Your body health symptoms tests: ప్రస్తుత పరిస్థితులు ఏమీ బాగులేవు. మనిషి జీవన శైలి మారింది. కాలుష్యం కోరలతోనే నిత్యం కాపురం చేయాల్సి వస్తోంది. వీటికి తోడు సీజనల్ వ్యాధులు.. అన్నిటికంటే అతి ప్రమాదకరమైన కరోనా వైరస్.. ఇలా నిత్యం పోరాటం చేయాల్సి వస్తోంది.. అందుకే ఆరోగ్యం కాపాడుకోవడం.. ఇమ్యూనిటీ పెంచుకోవడం ప్రతి ఒక్కరికీ చాలా అవసరం. అందుకే ప్రతి ఒక్కరు తమ ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవటానికి రెగ్యులర్ గా చెకప్ లు చేయించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలా పరీక్షలు చేయించుకోవటానికి చాలా ఖర్చు అవుతుంది. కానీ మీ ఆరోగ్యం ఎలా ఉందో..అసలు ఆరోగ్య సమస్యలు ఉన్నాయో లేవో తెలుసుకోడానికి.. మనమే కొన్ని తేలికపాటి పరీక్షలు చేసుకోవచ్చు.. వాటి ద్వారా మనం ఆరోగ్యంగా ఉన్నామో లేదో తెలుసుకోవచ్చు. సాధారణంగా మన శరీరం అనేక రకాల అనారోగ్యాలని పసిగట్టేస్తుందనే విషయం మీకు తెలుసా..? కానీ ఇది నిజం.. మనం అనారోగ్యంగా ఉన్నాయో లేదో మన శరీరంలోని కొన్ని మనకు తెలియజేస్తాయి. కొన్ని లక్షణాల ద్వారా ఆ విషయం మనకు తెలుస్తుంది. మనమే ఆ లక్షణాలను కూడా పట్టించుకోకుండా ఉంటాం. ఒకవేళ ఆ లక్షణాలని మనం అర్థం చేసుకుంటే ముందుగానే అనారోగ్యాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు.
పిడికిలిని బిగిసిపట్టాలి..
మీ వేళ్లను గట్టిగా బిగించి పిడికిలిని బిగిసిపట్టాలి. అప్పుడు మీ చేతిని గట్టిగా పట్టుకోండి. 30 సెకన్ల పాటు అలాగే ఉంచండి. తరువాత మీరు మీ చేతిని విడుదల చేసిన తర్వాత.. మీ అరచేతి మునుపటి కంటే కొంచెం తెల్లగా మారిందని మీరు గమనించవచ్చు. రక్త ప్రసరణ తగ్గడం దీనికి కారణం. అలా మీ అరచేతిని గమనించండి. దాని సాధారణ రంగుకు తిరిగి రావడానికి పట్టే టైముని చెక్ చేయండి. తిమ్మిరిగా ఉన్నట్లు లేదా రక్తం వెనక్కి వెళ్లడానికి కొంత సమయం లేదా అంతకంటే ఎక్కువ సమయం తీసుకుంటే..అది ఆర్టిరియోస్క్లెరోసిస్‌కు సంకేతం కావచ్చు అంటున్నారు వైద్య నిపుణులు. ఇలాంటి పరిస్థితుల్లో గుండె నుండి శరీరంలోని మిగిలిన భాగాలకు ఆక్సిజన్, పోషకాలను తీసుకువెళ్లే రక్త నాళాలు మారుతాయి.
కాలు పైకి లేపి పట్టుకోండి..
ఇక రెండో నేలపై ఫ్లాట్‌గా పడుకోండి. ముఖం నేలకు నిదానంగా ఉంచాలి. చేతులను శరీరానికి అనుగుణంగా ఉండేట్టు చేసుకుని శరీరం నేలపై విశ్రాంతి తీసుకునేటప్పుడు రెండు కాళ్లను నెమ్మదిగా పైకి ఎత్తాలి. 30 సెకన్ల పాటు అలా ఉంచండి. అలా ఎంత సేపు ఉంచగలరో గమనించండీ. మీరు వాటిని స్థిరంగా లేదా కలిసి ఉంచడంలో సమస్యలను ఎదుర్కోలేకపోతే లేదా ఎదుర్కొంటే, మీ ఉదరం లేదా మీ వెన్నెముకలో కొంత సమస్య ఉన్నట్లు లెక్క.
వేళ్లు చెప్పే ఆరోగ్యం..
వేళ్ల గోళ్లను గట్టిగా నొక్కండి..పిండినట్లుగా నొక్కి పట్టండి..అలా ఒక్కో వేలుని నొక్కండి.. వాటిలో బొటనవేలు నొప్పి శ్వాసకోశ సమస్యలను సూచిస్తుంది. చూపుడు వేలు పెద్దప్రేగు, జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలను సూచిస్తుంది. మధ్య వేలు హృదయ సంబంధ సమస్యలకు సంకేతం. ఉంగరపు వేలు గుండెకు సంబంధించిన సమస్యలను కూడా సూచిస్తుంది. చిటికెన వేలు ప్రేగు సమస్యలతో ముడిపడి ఉంటుంది.
వణికే చేతులు
చాలామందికి చేతులు గజగజా వణికిపోతుంటాయి. మంచినీళ్లు పట్టుకున్నా..ఖాళీ చేతుల చూపించినా వణుకుతూ ఉంటాయి. అయితే కేఫిన్ ఎక్కువగా తీసుకునే వారిలో, ఆందోళనలో ఉన్నవారిలో, ఆస్తమా, ఇతర మానసిక రోగాలకి సంబంధించిన మందులు వాడేవారిలో ఈ రకమైన సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే నరాల బలహీనత ఉండేవారిలో కూడా ఈ సమస్య ఉంటుంది. కొంతమందికి అరచేతుల్లో చెమట వస్తుంటుంది. ఎక్కువగా ఒత్తిడికి గురైనా, జీవక్రియరేటుని ప్రేరేపించే ఓవర్ యాక్టివ్ థైరాయిడ్ విడుదలయినప్పుడు అరచేతుల్లో చెమట పుడుతుంది. కానీ ప్రతిరోజూ ఇలానే జరుగుతుంటే మాత్రం తప్పనిసరిగా డాక్టర్‌ని సంప్రదించాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Health care, Health Tips