Sleep tips: రాత్రిళ్లు నిద్ర తొందరగా రావట్లేదా ? అయితే రోజూ ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ప్రశాంతంగా పడుకోవచ్చు

ప్రతీకాత్మక చిత్రం

హాయిగా నిద్ర పట్టడానికి కొన్ని చేయాల్సిన పనులుంటే మరికొన్ని చేయకూడని పనులు ఉంటాయి. మీరు ముందుగా రాత్రివేళ హాయిగా నిద్రపట్టడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన వాటి గురించి తెలుసుకుందాం.

  • Share this:
    జీవితంలో ప్రశాంతంగా నిద్రపోవడం ( Sleeping ) చాలా అవసరం. కరోనా (corona) లాక్​డౌన్​ కారణంగా జీవితాలు తలకిందులయ్యాయి. లక్షలాది మంది రోడ్డున పడ్డారు. వారికి ప్రశాంతత (peace) కరువైంది. మిగతా వారు ఆర్థికంగా కుదేలయ్యారు. ఎన్నో మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నారు. కనీసం నిద్ర కూడా సరిగా పట్టనివారున్నారు. అయితే వీటన్నింటి కారణంగా సగటు మధ్య తరగతి జీవుడిపై చాలా ఒత్తిళ్లు ఉంటాయి, నిత్యం బిజీబీజీ. చాలా మంది జీవన విధానం వల్ల తీవ్రమైన ఒత్తిడి (pressure)కి గురి అవుతుంటారు. దీని ప్రభావం వారి ఆరోగ్యంపై (Health) పడుతుంది. నిద్ర (sleep) కూడా కరువు అవుతుంది. హాయిగా నిద్ర పట్టడానికి కొన్ని చేయాల్సిన పనులుంటే మరికొన్ని చేయకూడని పనులు ఉంటాయి. మీరు ముందుగా రాత్రివేళ హాయిగా నిద్రపట్టడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన వాటి గురించి తెలుసుకుందాం. మీరు చేయాల్సిన పనులు ఏంటంటే మధ్యాహ్నం సమయంలో ఖాళీగా వుండకుండా ఏదో ఒక పనిచేయాలి. మధ్యాహ్నం శరీరానికి తగిన వ్యాయామం లేదా ఏదైన పని వుండాలి. పగటివేళ కష్టపడి పనిచేసేవారికి రాత్రివేళ హాయిగా సుఖవంతమైన నిద్రపడుతుంది.

    ఒకే వేళ నిద్రపోవాలి..

    రాత్రివేళ ఒక సమయానికి నిద్ర పోవడం (Sleeping at a time at night) తోపాటు ఒకే సమయానికి నిద్రలేచే విధంగా మీరు అలవాటు (hobby) చేసుకోవాలి. ఆ విధంగా అలవర్చుకోవడం వల్ల సమయానికి (time) ఆకలివేసినట్లు గానే సమయానికి నిద్రకూడా వస్తుంది. మీ పడకగది శుభ్రంగాను గాలి లభించే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. పడక గది దుర్వాసన వస్తూ చిందర వందరగా వుంటే నిద్ర పట్టకపోగా చికాకుతో నిద్ర (sleep) మరింత దూరం అవుతుంది. ఉదయం (morning) రోజు ఒకే సమయానికి నిద్రలేచే విధంగా అలారమ్‌ పెట్టుకోవాలి.

    నిద్ర లేవడం కూడా..

    రాత్రి (night) వేళ ఒకే సమయానికి నిద్రపోవడం ఎంత ముఖ్యమో ఒకే సమయానికి నిద్ర లేవడం కూడా అంతే ముఖ్యం. అందువల్ల ప్రతిరోజు నిర్ణీత సమయానికి నిద్ర లేచే విధంగా అలారమ్‌ (alarm) పెట్టుకొంటే మంచిది. బెడ్‌లైట్‌ తక్కువ వెలుతురు వుండాలి. కొంత మంది చీకటి (dark)లో నిద్రించకూడదని బెడ్‌లైట్‌ (bed light) తప్పని సరిగా వుండాలనే సెంటిమెంట్‌ వుంటుంది. బెడ్‌లైట్‌ వేసుకొనే వారు బెడ్‌లైట్‌ కంటికి ఎదురు గుండా వుండకుండా చూసుకోవాలి. అవకాశం వుంటే బెడ్‌లైట్‌ పడుకొనే మంచానికి దిగువ భాగంలో వుండే విధంగా ఏర్పాటు చేసుకోవాలి.

    వెలుతురు వచ్చే ప్రదేశం వద్దు..

    ఉదయం నిద్రలేచే వరకు ముఖంపై వెలు తురు పడకుండా జాగ్రత్త తీసుకోవాలి. వెలుతురు నిద్రకు ఇబ్బంది కలిగిస్తుంది. కొంతమంది బయట గాలివీస్తోందనో. లేక ప్రశాంతంగా వుందనో ఆరుబయట లేదా కిటికీ పక్కన పడు కొంటారు. అయితే ఉదయం సూర్యోదయం కావడంతోనే వెలుతురు ముఖం మీద పడి నిద్రకు ఇబ్బంది కలుగుతుంది.
    Published by:Prabhakar Vaddi
    First published: