Health tips: మీ పిల్లలకు ఆ ట్యాబ్లెట్లు వేస్తున్నారా? అయితే జాగ్రత్త.. చిన్నారుల  భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టొద్దు

ప్రతీకాత్మక చిత్రం

మనం చేసే చిన్న చిన్న పనుల వల్ల కూడా మన పిల్లలు (children) అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది. చాలామంది తల్లిదండ్రులు పిల్లలకు మల్టీ విటమిన్ (multi vitamin) ట్యాబ్లెట్లను ఇస్తున్నారు. మల్టీ విటమిన్ ట్యాబ్లెట్ల (tablets) వల్ల పిల్లలకు లాభం కంటే నష్టం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

  • Share this:
    ఉరుకుల పరుగుల జీవితంలో తల్లిదండ్రులకు ఇంటి పనులు ఒత్తిడిని ఎక్కువ చేస్తాయి. వేళకు కూడా తినే సమయం దొరకదు చాలామందికి. ఇక పిల్లలకైతే ఆటల్లో పడిపోయే ఏ సమయానికి తింటున్నారో కూడా తెలియని లోకంలో బతికేస్తున్నారు. వేళకు ఆహారం తినకపోవడం కారణంగా అనారోగ్య (Unhealthy) సమస్యలు మెండుగా వస్తాయి. మళ్లీ వాటిని తగ్గించుకోవడానికి ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. అప్పటికే కష్టపడి సంపాదించిన డబ్బులు కూడా అనారోగ్యానికి పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఇదంతా ఒక ఎత్తయితే మనం చేసే చిన్న చిన్న పనుల వల్ల కూడా మన పిల్లలు (children) అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది. చాలామంది తల్లిదండ్రులు పిల్లలకు మల్టీ విటమిన్ (multi vitamin) ట్యాబ్లెట్లను ఇస్తున్నారు. మల్టీ విటమిన్ ట్యాబ్లెట్ల (tablets) వల్ల పిల్లలకు లాభం కంటే నష్టం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పోషకాహార నిపుణులు పిల్లలకు మల్టీ విటమిన్ ట్యాబ్లెట్లను ఇవ్వాల్సిన అవసరం లేదని చెబుతున్నారు.

    చిన్నపిల్లలకు ఇచ్చే ఆహారం (food) ద్వారా పిల్లలకు అవసరమైన పోషకాలు అందుతాయని అలాంటప్పుడు పిల్లలకు స్పెషల్ గా సిరప్ లేదా మల్టీ విటమిన్లను ఇవ్వడం ఆరోగ్యానికి హానికరమని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. పిల్లలు తినే అహారంలో పోషకాలు ఎంతలో ఉన్నాయో చూసుకోవాలని వేళకు ఆహారం తీసుకునే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని వెల్లడిస్తున్నారు. వయస్సుకు తగిన విధంగా పిల్లలు ఉన్నారో లేదో గమనించాలని వైద్య నిపుణులు సూచనలు చేస్తున్నారు. ఇలా ట్యాబ్లెట్లు ఇచ్చుకుంటూ పోతే వారికి భవిష్యత్తులో అనారోగ్య సమస్యలు (unhealth issues) వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

    మల్టీ విటమిన్లు పిల్లలకు ఇస్తే అవి విషం (poison)గా మారే అవకాశం ఉందని వైద్య నిపుణులు (experts) వెల్లడిస్తున్నారు. వైద్యుల సూచనల మేరకు మాత్రమే విటమిన్ సప్లిమెంట్లు ఇవ్వాలని అలా కాకుండా ఇస్తే పిల్లల ప్రాణాలకే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని సమచారం. కొంతమంది పిల్లలు వయస్సుకు తగిన విధంగా ఎదగక పోవడంతో పాటు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కనిపిస్తుంటాయి.

    తల్లిదండ్రులు తిండి విషయంలో తప్పనిసరిగా జాగ్రత్తలు (precautions) తీసుకోవాల్సి ఉంటుంది. లేకుంటే పిల్లలకు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఈ రోజుల్లో పిల్లలు చాలా మంది బిస్కెట్లు (biscuits) తింటుంటారు. అయితే  బిస్కెట్లు అధికంగా తీసుకుంటే మంచిదికాదని (Side effects) చెబుతున్నారు వైద్యులు. చిన్నారులకు బిస్కెట్లు, చాక్లెట్లు అంటే చాలా ఇష్టం. అలాంటిది బిస్కెట్ల (biscuits)ను రెండుకు మించి ఒకే సమయంలో ఎక్కువ తీసుకుంటే ఆకలి లేమి ఏర్పడుతుంది. తద్వారా ఇతర ఆహారాన్ని తీసుకోవడంలో పిల్లలు ఆసక్తి చూపరని వైద్య నిపుణులు చెబుతున్నారు.

    మంచి ఆహారాన్ని ఎంపిక చేసుకునే అవకాశం పిల్లలకే ఇవ్వాలి. పిల్లలకు పండ్ల (fruits)ను అందుబాటులో ఉంచాలి. జంక్ ఫుడ్, కూల్‌డ్రింక్స్ ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతాయో తెలియజేయాలి. ఆహార పదార్థాల్లో ఏది మంచో, ఏది చెడ్డదో వివరించాలి. వంటగదిలో పోషకాలను అందించే స్నాక్స్ తినడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంచండి.
    Published by:Prabhakar Vaddi
    First published: