దేశ వ్యాప్తంగా రక్షా బంధన్(Raksha Bandhan) సందడి ప్రారంభమైంది. రాఖీ కట్టిన సోదరికి ఏదైనా స్పెషల్ గిఫ్ట్(Gift) ఇవ్వడం ఈ రోజుల్లో కొత్త ట్రెండ్(Trend)గా మారింది. మీ సిస్టర్(Sister)కు ఉపయోగపడే ఎలాంటి గిఫ్ట్ అయినా ఇచ్చి, వారికి ఆనందాన్ని పంచడం రాఖీ ప్రత్యేకత. అయితే వారికి ఎలాంటి గిఫ్ట్ సెట్ అవుతుందనేది తెలుసుకోవడం కష్టం. ఈ రక్షాబంధన్‌కు మీ సిస్టర్‌కు ఏదైనా స్పెషల్ గిఫ్ట్ ఇచ్చి సర్‌ప్రైజ్ చేయాలనుకుంటే.. ఈ గాడ్జెట్స్‌పై ఓ లుక్కేయండి.
స్మార్ట్ వాచ్
హెల్త్ మానిటరింగ్ ఫీచర్లతో వచ్చే స్మార్ట్‌వాచ్.. ఒక బెస్ట్ రాఖీ గిఫ్ట్‌గా చెప్పుకోవచ్చు. హార్ట్ రేటు, రక్తంలో చక్కెర స్థాయిలు, స్టెప్స్ కౌంట్, ఇతర ఫిట్‌నెస్ ఫీచర్లతో ఇవి బెస్ట్ పర్ఫార్మెన్స్ అందిస్తాయి. మీ తోబుట్టువుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని.. టాప్ లెవల్ ఫీచర్లతో వచ్చే ఈ గాడ్జెట్‌ను గిఫ్ట్‌గా ఇవ్వొచ్చు. ప్రస్తుతం యాపిల్ వాచ్ సిరీస్ 7.. మీరు కొనుగోలు చేయగల అత్యుత్తమ స్మార్ట్‌వాచ్. లేదంటే బడ్జెట్ రేంజ్‌లో అనేక మోడళ్లు అందుబాటులో ఉన్నాయి.
అమెజాన్ కిండ్లే
మీ సోదరికి రీడింగ్ అంటే ఇష్టమా..? అయితే అమెజాన్ కిండ్లే డివైజ్‌ను ఆమెకు గిఫ్ట్‌గా ఇవ్వండి. ఇది బ్యాక్‌లైట్ సపోర్ట్‌తో, 6 అంగుళాల ఇ-ఇంక్ డిస్‌ప్లేను కలిగి ఉంది. కిండ్లే షాప్ నుంచి అప్‌లోడ్ చేసే ఇ-బుక్స్ లేదా కొనుగోలు చేసే వేలాది ఇ-బుక్స్‌ను నిల్వ చేయగలదు.
కెమెరా యాక్సెసరీస్
మీ సిస్టర్ ఇన్‌ఫ్లుయెన్సర్ అయితే.. లేదా ఫిల్మ్‌లు షూట్ చేయడం లేదా సెల్ఫీలు తీసుకోవడం ఆమెకు ఇష్టమైతే.. వారికి కెమెరా గేర్ గిఫ్ట్‌గా ఇవ్వవచ్చు. లైటింగ్, యాంగిల్ అడ్జస్ట్‌మెంట్ చేసుకుంటూ రొటేట్ చేయగల ఈ డివైజ్.. వ్లాగింగ్‌ను సులభతరం చేస్తుంది. షిమ్మర్, రెయిన్‌బో వంటివి బెస్ట్ ఫోటోగ్రాఫిక్ గేర్ ఆప్షన్స్.
మరికొన్ని రోజుల్లో ఐఫోన్ 14 సిరీస్ రిలీజ్ కానుంది. అయితే కాస్ట్ ఎఫెక్టివ్, పర్పార్మెన్స్ పరంగా ఐఫోన్ 11 అన్నింటికంటే బెస్ట్ ఆప్షన్‌గా చెప్పుకోవచ్చు. మంచి బిల్ట్ క్వాలిటీ, డిజైన్ దీని ప్రత్యేకతలు. ఐఫోన్ 11 వీడియో రికార్డింగ్ కెపాసిటీ మరో హైలెట్. మోడరేట్ ఫోన్ యూజర్స్‌కు ఐఫోన్ 11 బెస్ట్ గిఫ్ట్ ఆప్షన్. లేదంటే తాజా వెర్షన్ ఐఫోన్ 13ను కొనుగోలు చేసి, మీ సిస్టర్‌ను సర్‌ప్రైజ్ చేయవచ్చు.
ఫిట్‌నెస్ మిర్రర్
మీ సిస్టర్ ఫిట్‌నెస్ లవర్ అయితే.. ఫిట్‌నెస్ మిర్రర్ వారికి బెస్ట్ రాఖీ గిఫ్ట్ ఆప్షన్‌గా చెప్పుకోవచ్చు. ఈ హోమ్-జిమ్ ఎక్విప్‌మెంట్ ఫుల్ బాడీ ఇమేజ్‌ను అందిస్తుంది. ట్రైనింగ్ సెషన్‌లో ఇన్‌స్ట్రక్షన్స్ పూర్తిగా ఫాలో అవ్వడానికి ఫిట్‌నెస్ మిర్రర్‌ను ఉపయోగించుకోవచ్చు. టచ్‌స్క్రీన్, స్పీకర్, మెటల్ ఫినిషింగ్‌తో రూపొందించిన ఈ గాడ్జెట్‌తో మీ సిస్టర్‌ను ఆశ్చర్యపర్చవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Gadgets, Gifts, Raksha Bandhan, Smart watch