Home /News /life-style /

ARE YOU FACING SLEEPING PROBLEMS DAILY THEN EAT THESE FOOD AND FOLLOW THESE TIPS FOR BETTER SLEEP PRV

health tips: రాత్రిళ్లు నిద్ర సరిగా పట్టడం లేదా.. అయితే హాయిగా నిద్ర పట్టాలంటే ఈ ఆహారం తీసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ప్రశాంతమైన నిద్ర (peaceful sleep)కోసం ప్రతి రోజు ప్రయత్నిస్తూ ఉంటాం. కానీ మన ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఇది సాధ్యం కావట్లేదు. మనిషి ఆరోగ్యకరంగా జీవించడానికి , రోజుకు కనీసం 7 నుంచి 9 గంటల నిద్ర అవసరం.

    పని ఒత్తిడి (stress) బాగా పెరిగిపోయింది. తిండి కూడా వేళకు తినడం లేదు. రాత్రిళ్లు (night) సరిగా నిద్రపోవడం లేదు. అయితే సరిగా నిద్రపోకపోవడం కూడా ఓ రోగం (disease)తో సమానం. ఇలాగే మీ జీవితం కొనసాగితే భవిష్యత్తుల్లో  తీవ్ర పరిణామాలు ఎదుర్కొవలసి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ కాలంలో చాలామంది నిద్ర లేమి సమస్యతో బాధ పడుతున్నారు. కంటికి సరిపడా నిద్ర (Enough sleep) అనేది లేకపోవడం ఒక పెద్ద రోగం అనే చెప్పాలి.

    మనలో చాలా మంది ప్రశాంతమైన నిద్ర (peaceful sleep)కోసం ప్రతి రోజు ప్రయత్నిస్తూ ఉంటాం. కానీ మన ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఇది సాధ్యం కావట్లేదు. మనిషి ఆరోగ్యకరంగా జీవించడానికి , రోజుకు కనీసం 7 నుంచి 9 గంటల నిద్ర అవసరం. అలాగే మనం పడుకున్న తరువాత గాఢ నిద్రలో ఎంతసేపు ఉన్నాం అనేది చూసుకోవాలి. ఇటువంటి గాఢ నిద్ర పట్టాలంటే మన ఆహారంలో కొన్నిపదార్ధాలు తప్పని సరిగా తీసుకోవాలి.

    అరటి పండ్లు..

    మన అందరికి విరివిగా దొరికే పండ్లలో అరటి పండ్లు (banana) కూడా ఒకటి. దీనిని రోజూ తింటే నిద్ర (sleep)కు మంచిది. వీటిలో మెగ్నీషియం, పొటాషియం వంటివి మన కండరాలు రిలాక్స్ కావడానికి ఉపయోగపడతాయి. అరటిలో ఉండే కార్బోహైడ్రేట్ రక్తంలోని గ్లూకోజ్ (glucose) తగ్గకుండా చేసి నిద్ర త్వరగా రావడానికి సహాయపడతాయి.

    Read this : అధిక బరువుతో ఇబ్బందులకు గురవుతున్నారా? అయితే రోజూ ఈ పద్దతులు పాటించి బరువు తగ్గించుకోండి

    నిద్రకు ఉపక్రమించే ముందు ఒక గ్లాసు పాలు తాగడం ఎంతో మంచిది. పాలల్లో ఉండే అమినో ఆసిడ్లు, ట్రైఫ్టోనీన్ వంటివి శరీరంలో సెరటోనిన్ విడుదల చేస్తాయి. ఇది నిద్రను ఉపక్రమించే ఒక రసాయనం. అందుకే నిద్రపోయే ముందు ఒక గ్లాస్ స్వచ్చమైన పాలు త్రాగితే నిద్ర త్వరగా వస్తుంది.

    ఆయుర్వేద శాస్త్రం ప్రకారం.. ప్రతి ఒక్కరు బ్రహ్మ ముహూర్తం ( Brahma Muhurat)లో నిద్ర లేవాలని (wakeup) సూచిస్తున్నారు. అంటే తెల్లవారు జామున 3 గంటల 30 నిమిషాల నుంచి 5 గంటల 30 నిమిషాల లోపు నిద్ర లేవాలి. ఇలా బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేవడం వల్ల పాజిటివ్ ఎనర్జీ (positive energy) మనకు వరిస్తుందట. తద్వారా మన ఆలోచనలు కూడా పాజిటివ్ రావడం, సమాజంలో అందరితోనూ ఆనందోత్సహాలతో జీవించడానికి వీలు ఉంటుందట. శరీరానికి కావలసిన శక్తి (energy) లభించడమే కాకుండా ఆరోగ్యంగా (healthy) కూడా ఉంటారు అట

    (Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Banana, Fruits, Health Tips, Sleep tips

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు