సాంకేతిక పరిజ్ఞానం బాగా పెరిగింది. చిన్న చిన్న పనులు సైతం మెషీన్లు చేసేస్తున్నాయి. అయితే ఈ రోజుల్లో చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య జుట్టు రాలడం ( hair fall). వయసుతో సంబంధం లేకుండా ఈ సమస్యను ఎదుర్కొంటున్న వారి సంఖ్య కోట్లలోనే ఉంటుంది. పాతికేళ్ల వయసులోనే జట్టు ఊడిపోయి బట్టతలతో ఇబ్బంది పడుతున్నారు. మానసిక ఒత్తిళ్లు, చెడు ఆహారపు అలవాట్లు (food habits), గంటల కొద్ది స్మార్ట్ఫోన్ల వినియోగం వంటివి దీనికి కారణం కావచ్చు. ఏదేమైనప్పటికీ, ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు మార్కెట్లో దొరికే ఉత్పత్తులు అన్నీ వాడేస్తుంటారు చాలా మంది. అయినా, ఫలితం లేక విసుగు చెందుతుంటారు. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అని అంటారు. ఈ ఉల్లి (Onions)లో ఉండే కొన్ని రసాయనాల సమ్మేళనాల వల్ల, జుట్టు (hair) ఒత్తుగా పెరగడానికి సహాయపడుతుంది. అయితే ఈ ఉల్లిని జుట్టుకు ఎలా ఉపయోగించాలి..? దీని వల్ల జుట్టుకు కలిగే ప్రయోజనాలు ఏమిటి..? అనే విషయాలను ఒకసారి తెలుసుకుందాం..
ఆక్సిజన్ సరఫరా బాగా జరిగి..
ఇక ఈ ఉల్లి పేస్టు (onion paste)ని తల మాడుకు పట్టించండి. దీంతో అక్కడ రక్తనాళాలు సరఫరా బాగా జరుగుతుంది. ఉల్లిపాయలో ఉండే " క్యాంపీఫెరాల్ అలాగే క్వర్సెటిన్" అనే రసాయనాలు జుట్టు కుదుళ్ళకు ఉండే రక్తనాళాలు వ్యాకోచం చెందేలా చేస్తాయి. అంటే రక్తనాళాలు వెడల్పు అయ్యేందుకు ఈ రసాయనాలు సహాయపడతాయన్నమాట. ఇక ఈ రక్తనాళాలు తెరుచుకోవడం వల్ల ఆక్సిజన్ సరఫరా బాగా జరిగి, జుట్టు కుదుళ్లు బలపడతాయి. ఫలితం జుట్టు రాలే (hair loss) సమస్య దూరం అవడంతో పాటు జుట్టు మీద ఏర్పడే చుండ్రు (dandruff), రసాయనాల నుండి జుట్టును సంరక్షించుకోవచ్చు.
ఉల్లిపాయలలో సల్ఫర్ (Sulphur) ఎక్కువగా ఉండడం వల్ల ఆ ఘాటుకి తట్టుకోలేక, మనకు కళ్ళ వెంట , ముక్కు వెంట నీళ్లు రావడం సహజం. ఇక ఎప్పుడైతే ఈ ఉల్లిపాయ పేస్ట్ ను జుట్టుకు పట్టిస్తామో , అప్పుడు జుట్టు కుదుళ్లలో వుండే కెరటోనాయిడ్స్ ఉత్పత్తిని, ఈ సల్ఫర్ వేగవంతం చేస్తుంది. ఫలితంగా కెరటిన్ కలిగిన జుట్టు (hair) ఒత్తుగా పెరగడానికి (growth) సహాయపడుతుంది. అలాగే యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు సమృద్ధిగా ఉల్లిపాయలో ఉండటం వల్ల, జుట్టు కుదుళ్ల మీద ఏర్పడే ఫంగస్ లేదా బ్యాక్టీరియాను నాశనం చేయడానికి ఉల్లిపాయ బాగా పనిచేస్తుంది.
(Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.