హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

పండ్లపై ఉప్పు చల్లుకొని తింటున్నారా... ఈ విషయాలు మీరు తెలుసుకోవాల్సిందే

పండ్లపై ఉప్పు చల్లుకొని తింటున్నారా... ఈ విషయాలు మీరు తెలుసుకోవాల్సిందే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Health Tips : పండ్లపై ఉప్పు, కారం చల్లుకొని తినడం మన ఇండియన్స్‌కి అలవాటు. అది మనకు మేలు చేస్తుందా? ఉప్పు చల్లితే ఏమవుతుంది?

    చాలా పండ్లలో ఆటోమేటిక్‌గా తీపి ఉంటుంది. కొన్ని రకాల మామిడి కాయల లాంటివి మాత్రం పుల్లగా ఉంటాయి. అలాంటి వాటికి కాస్త ఉప్పు, కారం చల్లుకొని తినడం మనకు అలవాటు. కొంత మంది జామకాయల్ని కట్ చేసి... ఉప్పు చల్లుకుని తింటారు. ఈమధ్య పుచ్చకాయల్లో కూడా సాల్ట్ వేసుకుంటున్నారు. కొందరైతే సాల్ట్ వేస్తే ఆ టేస్టే వేరంటారు. నిజమే పండ్లపై ఉప్పు చల్లుకుంటే రుచి పెరుగుతుంది. దానివల్ల కొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయని తెలుసా మీకు? ఆ ప్రయోజనాలేంటో తెలిస్తే... ఇకపై మీరు కూడా ఉప్పు చల్లుకొని తింటారు. మరింత టేస్ట్ కావాలంటే ఉప్పుకి కారం మిక్స్ చేసి వాడుకోవచ్చు. అంతమాత్రాన ఎలాంటి సమస్యా ఉండదు.


    health tips, fruits benefits, benefits of salt, side effects of salt, salt and fruits, health benefits of fruits, పండ్లు, ఆరోగ్యం, ఉప్పు, ఉప్పుతో సమస్యలు, ఉప్పుతో ఆరోగ్యం, పండ్లపై ఉప్పు, ఆరోగ్య చిట్కాలు, ఆరోగ్య రహస్యాలు
    ప్రతీకాత్మక చిత్రం


    మనకు తెలియకుండానే పండ్లపై బ్యాక్టీరియా చేరుతుంది. దాన్ని ఉప్పు చంపేయగలదు. అలా అని అన్ని రకాల పండ్ల ముక్కలపైనా ఉప్పు చల్లుకుని తినడం మంచిది కాదు. ముఖ్యంగా డయాబెటిస్‌తో బాధపడేవారు ఉప్పు చల్లుకోవడం కరెక్టు కాదు. పైగా ఉప్పు ఎక్కువగా చల్లుకుంటే బీపీ, గుండెజబ్బులు, కిడ్నీ వ్యాధులు తప్పవని డాక్టర్లు చెబుతున్నారు. ఐతే... అత్యంత పుల్లగా ఉండే సిట్రస్ జాతి పండ్ల మీద (నిమ్మకాయ, ఉసిరికాయ, పుల్ల మామిడి, దబ్బకాయ, నారింజ మొదలైనవి) ఉప్పు చల్లుకుని తింటే కడుపులో ఉత్పత్తి అయ్యే యాసిడ్లను అడ్డుకోవచ్చు. ఫలితంగా అజీర్తి సమస్యలకు చెక్ పెట్టినట్లవుతుంది. జామకాయ మీద కొద్దిగా ఉప్పు చల్లుకుని తింటే దంతాలకు మేలు జరుగుతుంది. నోట్లో బ్యాక్టీరియా చచ్చిపోతుంది.


    డాక్టర్లు ఏమంటున్నారంటే : మనలో చాలా మంది మన శరీరానికి కావాల్సిన దాని కంటే ఎక్కువగానే సాల్ట్ తీసుకుంటున్నారు. అందువల్ల పండ్ల వంటివి తినేటప్పుడైనా ఈ సాల్ట్ వాడకాన్ని మానేయమంటున్నారు. ఫ్రెష్ పండ్లు చాలా టేస్టీగా ఉంటాయి కాబట్టి, వాటిని అలాగే తినేయమంటున్నారు. మన బాడీకి ఉప్పు అవసరమే... కానీ అతి తక్కువ మాత్రమే కావాలి. కాబట్టి... ఎప్పుడో తప్పితే... రోజూ పండ్లపై ఉప్పు వేసుకోవద్దని సూచిస్తున్నారు. మంచి సూచనేగా... పాటించేద్దాం.


     


    ఇవి కూడా చదవండి :


    ఎంతకీ బరువు తగ్గలేకపోతున్నారా?... రోజూ ఇది తాగండి... తేడా కనిపిస్తుంది... ప్రకృతి వరం


    ఉల్లిపాయ తొక్కలతో ప్రయోజనాలు... అవేంటో తెలిస్తే, తొక్కలు అస్సలు పారేయరు...


    రోజుకు 3 ఖర్జూరాలు చొప్పున వారం తినండి... మీకు కలిగే చక్కటి ప్రయోజనాలు ఇవి...


    యూట్యూబ్ ద్వారా డబ్బు సంపాదించడం ఎలా... ఇలా చెయ్యండి

    First published:

    Tags: Health Tips, Life Style, Tips For Women

    ఉత్తమ కథలు