ARE YOU DIABETIC PATIENT YOU SHOULD PAY ATTENTION TO YOUR EYES FOR THIS REASON SRD
Advertisement : మీరు మధుమేహ వ్యాధిగ్రస్తులా? మీ కంటిచూపుపై శ్రద్ధ పెట్టండి..
Netra Suraksha
మధుమేహం వచ్చే ప్రమాదం క్రమంగా పెరుగుతోంది. ఇంటర్నేషనల్ డయాబెటిస్ ఫెడరేషన్ అట్లాస్ 2019 ప్రకారం, 2000 సంవత్సరంలో దాదాపు 151 మిలియన్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారు.
మధుమేహం వచ్చే ప్రమాదం క్రమంగా పెరుగుతోంది. ఇంటర్నేషనల్ డయాబెటిస్ ఫెడరేషన్ అట్లాస్ 2019 ప్రకారం, 2000 సంవత్సరంలో దాదాపు 151 మిలియన్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారు1. ఇందులో 20-79 సంవత్సరాల మధ్య వయస్సు గల వ్యక్తులలో టైప్1 మరియు టైప్2, రోగనిర్ధారణ జరిగిన వారు అలాగే జరగని వారు కూడా ఉన్నారు1. ఆ సమయంలో, ఇది ప్రపంచ జనాభాలో 4.6%1. 2019లో, మొత్తం సంఖ్య 463 మిలియన్లకు పెరిగింది, ఇది జనాభాలో 9.3%1. ఈ సంఖ్య 2030లో 578 మిలియన్లకు చేరుతుందని అంచనా వేయబడింది (ప్రపంచ జనాభాలో 10.2%)1. అంటే ప్రతీ పది మందిలో ఒకరు.
ఇంకా ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే, మధుమేహంతో బాధపడుతున్న వారిలో దాదాపు సగం మందికి వ్యాధి నిర్ధారణ చేయబడలేదు 1. ఇది ఎందుకు జరుగుతుంది? మధుమేహం యొక్క సాధారణ లక్షణాలు ఇతర మూలాధారాలకు ఆపాదించడం చాలా సులభం ఎందుకంటే: అలసట మరియు శక్తిలేకపోవడం, అధిక దాహం, తరచుగా మూత్రవిసర్జన, తరచుగా ఆకలి – వీటన్నింటిని సులువుగా మర్చిపోతాం ఎందుకంటే అవి క్రమంగా జరుగుతాయి1. కొంత మందికి, మధుమేహం వల్ల నిద్రలో మూత్రవిసర్జన జరగడం, ఆకస్మికంగా బరువు తగ్గడం అలాగే దృష్టి మసకబారడం వంటివి కూడా జరుగుతాయి 1, ఇది సాధారణంగా వైద్యుడిని (అదృష్టవశాత్తూ) సందర్శించడం మరియు రోగనిర్ధారణకు ప్రేరేపిస్తుంది.
ఒకసారి నిర్ధారణ అయిన తర్వాత, మధుమేహాన్ని (ముఖ్యంగా టైప్2 డయాబెటిస్) చాలా ప్రభావవంతంగా నియంత్రణలో ఉంచవచ్చు – సాధారణ వ్యాయామం, ఆహారంలో మార్పులు మరియు మందుల తీసుకోవడం ద్వారా, మధుమేహం ఉన్న చాలా మంది వ్యక్తుల విషయంలో వారి రోజువారీ జీవితం తీవ్రంగా ప్రభావితం అవ్వదు. నిజానికి, ప్రారంభంలోనే వ్యాధి నిర్ధారణ జరిగితే, టైప్2 డయాబెటిస్ ఇప్పుడు రివర్సిబుల్గా పరిగణించబడుతుంది2.
అయినప్పటికీ, డయాబెటిస్‌ను సరిగ్గా నియంత్రించకపోతే, శరీరంలో అనేక సమస్యలకు దారి తీస్తుంది. 2019లో, 20-79 ఏళ్లలోపు 4.2 మిలియన్ల మంది పెద్దలు మధుమేహం మరియు దాని సమస్యల కారణంగా చనిపోతారని అంచనా వేయబడింది 1.
● డయాబెటిస్, హైపర్‌టెన్షన్ లేదా రెండింటి కలయిక ప్రపంచవ్యాప్తంగా 80% చివరి దశ మూత్రపిండ వ్యాధికి కారణమవుతుంది 1.
● మధుమేహం మరియు దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి రెండూ హృదయ సంబంధ వ్యాధులతో బలంగా సంబంధం కలిగి ఉంటాయి 1.
● ప్రపంచ వ్యాప్తంగా మధుమేహం ఉన్న 40 నుండి 60 మిలియన్ల మంది వ్యక్తులను ప్రభావితం చేసే డయాబెటిక్ ఫుట్ మరియు లోయర్ లింబ్ కాంప్లికేషన్లు డయాబెటిస్ ఉన్న వారిలో అనారోగ్యానికి ఒక ముఖ్యమైన కారణం 1.
● దీర్ఘకాలిక పుండ్లు మరియు విచ్ఛేదనం జీవిత నాణ్యతలో గణనీయమైన తగ్గుదలకు కారణమవుతాయి మరియు ముందస్తు మరణాల ప్రమాదాన్ని పెంచుతుంది 1.
అదనంగా, డయాబెటిక్ కంటి వ్యాధి మధుమేహానికి సంబంధించి చాలా-భయంకరమైన సమస్య, మరియు ప్రధానంగా డయాబెటిక్ రెటినోపతి, డయాబెటిక్ మాక్యులర్ ఎడిమా, కంటి శుక్లం మరియు గ్లాకోమాతో పాటు డబుల్ విజన్ మరియు ఫోకస్ చేయలేకపోవడం వల్ల ఏర్పడుతుంది1. చాలా దేశాల్లో, డయాబెటిక్ రెటినోపతి వినాశకరమైన వ్యక్తిగత మరియు సామాజిక ఆర్థిక పరిణామాలతో పనిచేసే వయస్సు జనాభాలో అంధత్వానికి ప్రధాన కారణాలలో ఒకటిగా గుర్తించబడింది1. తమిళనాడులో 2013 అధ్యయనం ప్రకారం, 2025 నాటికి భారతదేశంలో మధుమేహం ఉన్న సుమారు 57 మిలియన్ల మంది రెటినోపతిని కలిగి ఉంటారు 3. ఈ గణాంకాలు ఖచ్చితంగా కంగారుపడాల్సిన స్థాయిలో ఉన్నాయి.
దీనిని మరింత ప్రమాదకరంగా మార్చే విషయం ఏమిటంటే, ప్రారంభ దశల్లో, డయాబెటిక్ రెటినోపతి దాదాపు పూర్తిగా లక్షణరహితంగా ఉంటుంది. దీని అర్థం మీరు లక్షణాలను చూసే సమయానికి, మీ కంటి చూపుకు కొంత నష్టం జరిగిపోయి ఉంటుంది. అయినప్పటికీ, DR నిర్ధారణ అయినప్పటి నుండి, దానిని నియంత్రించవచ్చు మరియు మరింత నష్టాన్ని నివారించవచ్చు.
ఇంతకు డయాబెటిక్ రెటినోపతి కంటిచూపును ఎలా దెబ్బతీస్తుంది? రక్తంలో గ్లూకోజ్ స్థాయులను పరిశీలించకుండా ఉంటే, మీ రెటీనాను ఆరోగ్యంగా ఉంచే చిన్న రక్తనాళాలలో బ్లాక్‌లు ఏర్పడతాయి. రెటీనా అనేది కంటి వెనుక భాగంలో ఉండే లైనింగ్, ఇది కాంతిని ఇమేజ్‌లుగా ప్రాసెస్ చేస్తుంది. రక్తనాళాలు ఉబ్బవచ్చు, ద్రవం లీక్ అవ్వవచ్చు లేదా రక్తస్రావం కావచ్చు, ఇది తరచుగా దృష్టిలో మార్పులకు లేదా అంధత్వానికి దారితీస్తుంది2.
రెటీనా సొసైటీ ఆఫ్ ఇండియా జాయింట్ సెక్రెటరీ డాక్టర్ మనీషా అగర్వాల్ ప్రకారం, కళ్లద్దాలు మార్చినప్పటికీ తగ్గకుండా చదవడంలో నిరంతర కష్టమే ముందుగా కనిపించే లక్షణాలలో ఒకటి. ఇది తేలికగా తీసుకోకూడని ముందస్తు సంకేతం. విస్మరించినట్లయితే, లక్షణాలు దృష్టి క్షేత్రంలో నలుపు లేదా ఎరుపు రంగు మచ్చలు మేఘాలు లేదా కంటిలో రక్తస్రావాల కారణంగా ఆకస్మిక బ్లాక్అవుట్లుగా మారవచ్చు.
శుభవార్త ఏమిటంటే డయాబెటిక్ రెటినోపతి 100% నివారించదగినది 4. డయాబెటిక్ రెటినోపతిని నివారించడానికి ఉత్తమ మార్గం అది రోగ లక్షణంగా మారక ముందే దానిని గుర్తించడం. మీ కంటి వైద్యుని వద్ద ఒక సాధారణ, నొప్పి లేకుండా మరియు తరచుగా చేయించుకునే కంటి పరీక్ష చేయిస్తే సరిపోతుంది (కళ్లద్దాల దుకాణంలో కాదు!)4. చాలా మందికి దీని గురించి తెలియదు.
ఈ అవగాహన లోపాన్ని పరిష్కరించడానికి, Network18 మరియు Novartis కలిసి 'Netra Suraksha' – డయాబెటిస్‌పై భారతదేశ పోరాటం కార్యక్రమం ప్రారంభించాయి. కార్యక్రమ సమయంలో, Network18 డయాబెటిక్ రెటినోపతిని గుర్తించడం, నివారణ మరియు చికిత్సపై దృష్టి సారించిన రౌండ్ టేబుల్ చర్చల శ్రేణిని ప్రసారం చేస్తుంది. ఈ చర్చలు, వివరణాత్మక వీడియోలు మరియు కథనాల ద్వారా చర్చలు జరపడం ద్వారా, Network18 డయాబెటిక్ రెటినోపతికి గురయ్యే వ్యక్తులు తమకు అవసరమైన పరీక్షలు మరియు చికిత్సలను పొందేలా ప్రోత్సహించాలని భావిస్తోంది.
మీరు ఎలా ప్రారంభించవచ్చో ఇక్కడ ఉంది. ముందు మీరు డయాబెటిక్ రెటీనోపతీ స్వీయ చెకప్చేయించుకోండి. ఆ తర్వాత, స్నేహితులు మరియు కుటుంబ సభ్యులను కూడా చెకప్ చేయించుకోమని ప్రోత్సహించండి. మీకు మరియు మీ ప్రియమైన వారికి మధుమేహం కోసం పరీక్ష చేయించండి మరియు మీ కుటుంబ క్యాలెండర్లో వార్షిక కంటి పరీక్షను ఏర్పాటు చేయండి. సంవత్సరంలో ఏదైనా తేదీ లేదా సమయంతో దీన్ని మార్క్ చేసుకోండి, కనుక ఇది రొటీన్ అవుతుంది మరియు మీరు దానిని ఎప్పటికీ మరచిపోలేరు.
కంటి చూపు మీకు చాలా విలువైన ఆస్తి. దానికి కావలసినంత శ్రద్ధ మరియు సంరక్షణను అందించడంలో మీ కుటుంబంలో మొదటి వ్యక్తి అవ్వండి. అన్నింటి కంటే, ఉజ్వల భవిష్యత్తు కోసం పెట్టుబడి పెట్టడం మరియు మీ కుటుంబాన్ని చూసుకోవడంలో మీరు అడుగడుగునా వారితో ఉంటారు. కాబట్టి, చురుకుగా ఉండండి. మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి మరియు ఇతరులు అనుసరించడానికి ఒక ఉదాహరణగా ఉండండి. ఆపై, ఈ విషయాన్ని అందరికి తెలియచేయండి.
Netra Suraksha కార్యక్రమం గురించి మరిన్ని అప్డేట్ల కోసం అలాగే డయాబెటిక్ రెటినోపతీపై భారతదేశంలో జరుగుతున్న అతిపెద్ద పోరాటంలో భాగం అవ్వడానికి News18.comను ఫాలో అవ్వండి.
3. Balasubramaniyan N, Ganesh KS, Ramesh BK, Subitha L. Awareness and practices on eye effects among people with diabetes in rural Tamil Nadu, India. Afri Health Sci. 2016;16(1): 210-217.
4. https://youtu.be/nmMBudzi4zc 29 Dec, 2021
(This is a Partnered Content)
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.