Home /News /life-style /

పోర్న్ సైట్లు చూసే వారికి ఇలాంటి లక్షణాలు వస్తున్నాయట.. షాకింగ్ న్యూస్

పోర్న్ సైట్లు చూసే వారికి ఇలాంటి లక్షణాలు వస్తున్నాయట.. షాకింగ్ న్యూస్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

టీనేజర్లు, యువత పోర్న్​ అడిక్ట్ కావడానికి అనేక కారణాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. భాగస్వాములతో లైంగికంగా ఇబ్బందులు పడుతున్న వారు, అసహజ శృంగారం చేయాలనే కోరికలు ఉన్న వారు పోర్న్​ వీడియోలు చూడటం ద్వారా ఒక రకమైన సంతృప్తిని పొందుతారు.

ఇంకా చదవండి ...
టెక్నాలజీతో ఎన్ని ఉపయోగాలున్నాయో, అన్ని అనర్థాలు కూడా ఉన్నాయి. అనర్థాల విషయంలో పోర్న్​ ముందు వరుసలో ఉంటుంది. ఈ రోజుల్లో చాలా మందికి పోర్న్​ చూడటం ఒక అలవాటుగా మారింది. ముఖ్యంగా టీనేజర్లు, యువత పోర్న్​ సైట్లకు అడిక్ట్​ అవుతున్నారు. చాలా దేశాల్లో పోర్న్​ వీడియోలను చూడటం నిషిద్ధం. ఇటీవల భారత ప్రభుత్వం కూడా అనేక పోర్న్​ సైట్లపై కొరడా ఝులిపించింది. వీటి ద్వారా యువత పెడదోవ పడుతున్నారని, అత్యాచారాలు పెరుగుతున్నాయని, వ్యక్తిగత స్వేచ్చ పేరుతో విశృంఖలానికి అనుమతివ్వలేమని స్పష్టం చేసింది. అయినప్పటికీ, పోర్న్​ సైట్లకు అడిక్ట్​ అవుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ ధోరణి ప్రపంచవ్యాప్తంగా ప్రమాదకరంగా మారుతోంది. పోర్న్​ అడిక్షన్​పై నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం.

పోర్న్ అడిక్షన్​ అంటే ఏమిటి?
పోర్న్​ అడిక్షన్​ అనేది ఒక వింతైన సమస్య. ఇది చాలా తక్కువ సమయంలోనే వ్యక్తిలో మానసిక రుగ్మతకు దారితీస్తుంది. పదే పదే అశ్లీల చిత్రాలను చూడటం లేదా వాటిలో ఉన్న విధంగా చేయాలనే కోరికలు కలగడం అనేవి వ్యక్తి మానసిక స్థితిని కుంగదీస్తాయి. తద్వారా వ్యక్తి తన మనస్సుపై నియంత్రణ కోల్పోతాడు. ఏ విషయంపై శ్రద్ధ పెట్టలేడు. అంతేకాక, తనపై తాను నియంత్రణ కోల్పోతాడని మానసిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీనిపై మానసిక నిపుణురాలు సోకర్నో మాట్లాడుతూ "పోర్న్​ అడిక్షన్​ అనేది విపరీతంగా పెరుగుతోన్న విశృంఖల దోరణి. ఈ వ్యసనం ఉన్న వ్యక్తి తనతో పాటు తన చుట్టూ ఉన్నవారికి కూడా హాని చేస్తారు. వారిని ఒంటరిగా ఉండనీయకుండా చూసుకోవడమే దీనికి సరైన పరిష్కారం. ’’ అని ఆమె అభిప్రాయపడ్డారు.

అడిక్షన్​గా మారడానికి కారణాలు?
ముఖ్యంగా టీనేజర్లు, యువత పోర్న్​ అడిక్ట్ కావడానికి అనేక కారణాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. భాగస్వాములతో లైంగికంగా ఇబ్బందులు పడుతున్న వారు, అసహజ శృంగారం చేయాలనే కోరికలు ఉన్న వారు పోర్న్​ వీడియోలు చూడటం ద్వారా ఒక రకమైన సంతృప్తిని పొందుతారు. అందువల్ల, వీటికి సులభంగా అడిక్ట్​ అవుతున్నారని డాక్టర్లు వివరిస్తున్నారు. పోర్న్​ అడిక్షన్​కు గల కారణాలపై డాక్టర్ సోకర్నో మాట్లాడుతూ ‘‘ఒక వ్యక్తి పోర్న్​ వీడియోలను చూసినప్పుడు, అది వారి మెదడులో అనేక న్యూరోకెమికల్ ప్రతిచర్యలను ప్రేరేపిస్తుంది. ఈ ప్రతిచర్యలు అధిక స్థాయి డోపామైన్ స్రావాన్ని ఉత్పత్తి చేస్తాయి. తద్వారా, ఆ వ్యక్తిలో ఉద్వేగం తీవ్రంగా మారి మంచి అనుభూతి కలుగుతుంది. అందువల్లే సమయం దొరికినప్పుడల్లా పదే పదే పోర్న్​ వీడియోలను చూడాలని వారు కోరుకుంటారు. మద్యం, సిగరెట్ అలవాట్ల మాదిరిగానే పోర్న్​ను కూడా ఒక వ్యసనంగా చూడాలి.” అని వివరించారు.

పోర్న్‌కు బానిసలైతే ఇలా చేయండి..
పోర్న్​ అడిక్ట్​ అయిన వారిని దాని నుంచి బయటపడేసేందుకు అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా, వారితో ఎక్కువ సమయం గడపడం, వారిని ఒంటరిగా ఉండకుండా చేయడం వంటివి చేయాలి. మీరు లేదా మీకు తెలిసిన వ్యక్తిలో పోర్న్​ అడిక్షన్ లక్షణాలు కనిపిస్తే ఒక ప్రొఫెషనల్ సహాయం తీసుకోవడం చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు.
First published:

Tags: Porn ban, Porn Movies

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు