Home /News /life-style /

ARE THERE SIDE EFFECTS OF EATING TRIPHALA POWDER FIND OUT UMG GH

Triphala Powder: త్రిఫల చూర్ణం తీసుకుంటున్నారా..? ఇవి తప్పకుండా తెలుసుకోవాల్సిందే.. లేకపోతే డేంజరే..!!

త్రిఫల చూర్ణం తీసుకుంటున్నారా..? ఇవి తప్పకుండా తెలుసుకోవాల్సిందే.. లేకపోతే డేంజరే..!!

త్రిఫల చూర్ణం తీసుకుంటున్నారా..? ఇవి తప్పకుండా తెలుసుకోవాల్సిందే.. లేకపోతే డేంజరే..!!

త్రిఫల చూర్ణాన్ని శతాబ్దాలుగా ఆయుర్వేద, మూలికా ఔషధంగా ఉపయోగిస్తున్నారు. ఆయుర్వేదం ప్రకారం, త్రిఫల తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్, మధుమేహం, రక్తపోటు వంటి సమస్యలు నయమవుతాయి. ఈ చూర్ణం వల్ల బోల్డన్ని ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India
ఉసిరికాయ, తానికాయ, కరక్కాయలతో త్రిఫల చూర్ణం (Triphala Powder) తయారు చేస్తారు. ఈ ఆయుర్వేద మూలికా మెడిసిన్‌ (Ayurveda Herbal Medicine) వాడితే మలబద్ధకం, కంటి సంబంధ సమస్యలు, జుట్టు రాలటం, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, రక్తపోటు, మధుమేహం వంటి అనేక ఆరోగ్య సమస్యలు నయమవుతాయి. కడుపులో నులిపురుగులు కూడా త్రిఫల చూర్ణం పోగొడుతుంది. అత్యంత సమర్థవంతంగా పనిచేసే త్రిఫల చూర్ణాన్ని లేదా త్రిఫల మాత్రలను వాడటం ద్వారా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావని చాలామంది నమ్ముతుంటారు. కానీ మోతాదుకు మించి త్రిఫల చూర్ణం (Triphala Churna) తీసుకుంటే దుష్ప్రభావాలు (Side Effects) తలెత్తుతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

త్రిఫల చూర్ణాన్ని శతాబ్దాలుగా ఆయుర్వేద, మూలికా ఔషధంగా ఉపయోగిస్తున్నారు. ఆయుర్వేదం ప్రకారం, త్రిఫల తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్, మధుమేహం, రక్తపోటు వంటి సమస్యలు నయమవుతాయి. ఈ చూర్ణం వల్ల బోల్డన్ని ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. అయితే దీనిని అధిక మోతాదులో తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం ఎక్కువ.

ఇదీ చదవండి: షాకింగ్ న్యూస్.. ఆ ఫోన్‌లు ఇండియాలో బ్యాన్..? ఇక బడ్జెట్ మొబైల్స్ కష్టమే.. ప్రభుత్వం ఏం చెబుతుంది అంటే..!


రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది.
త్రిఫల చూర్ణంలో యాంటీ డయాబెటిక్ లక్షణాలు సమృద్ధిగా ఉంటాయి. అందుకే ఈ చూర్ణం మధుమేహం రాకుండా సమర్థవంతంగా పోరాడుతుంది. అయితే మధుమేహం మందులు వాడుతున్న వ్యక్తులు త్రిఫలాన్ని అధికంగా తీసుకుంటే... వారి రక్తంలోని చక్కెర స్థాయిలు ప్రమాదకర స్థాయిలో పడిపోతాయి. ఎందుకంటే మధుమేహం మందులతో కలిపి త్రిఫల తీసుకోవడం ద్వారా హైపోగ్లైసీమియా వస్తుంది. అంటే రక్తప్రవాహంలో గ్లూకోజ్ లోపం ఏర్పడుతుంది. అందువల్ల, మధుమేహ రోగులు త్రిఫల తీసుకునే ముందు వైద్యులను సంప్రదించాలి. ఇందులో ఉండే సార్బిటాల్, మెంథాల్ అనేవి రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

మందుల ప్రభావాలను తగ్గిస్తుంది.
వేరే మెడిసిన్స్ వాడేటప్పుడు త్రిఫల చూర్ణాన్ని తీసుకోకూడదని చెబుతారు. ఎందుకంటే త్రిఫల చూర్ణం అనేది వేరే మెడిసిన్స్ పని చేయకుండా అడ్డుకుంటుంది. త్రిఫల సైటోక్రోమ్ P450 అనే ముఖ్యమైన కాలేయ ఎంజైమ్ పనితీరును కూడా దెబ్బతీస్తుంది. ఫలితంగా మోడ్రన్ మెడిసిన్ లేదా అల్లోపతిక్ మెడిసిన్ సరిగ్గా జీర్ణం కావడంలో సమస్యలను వస్తాయి. కేవలం అల్లోపతి మందులపై కాకుండా మిగతా మెడిసిన్స్ పై కూడా త్రిఫల ప్రభావం చూపుతుంది.



మరిన్ని సైడ్ ఎఫెక్ట్స్
ఈ చూర్ణాన్ని మోతాదుకు మించి తీసుకుంటే విరేచనాలు, రక్త విరేచనాలు అవుతాయి. దీనికి విరుగుడుగా పెరుగు లేదా మజ్జిగ తీసుకోవాలి. త్రిఫలలోని ఒకటైన కరక్కాయ గర్భిణీలలో అబార్షన్లకు దారితీస్తుందని చెబుతుంటారు. అందుకే గర్భవతులు దీనిని వాడే ముందు డాక్టర్‌ని సంప్రదించడం మంచిది.

ఆయుర్వేదంలో ఉసిరికాయ, తానికాయ, కరక్కాయలను ఎన్నో ఔషధ గుణాలున్న రసాయనాలుగా పేర్కొంటారు. ఈ రసాయనాలు వయసు పెరుగుతున్న కొద్దీ వచ్చే మలబద్ధకం, మతిమరుపు వంటి సమస్యలను దరి చేరనివ్వవు. అయితే ఈ మూడు ఫలాల తో తయారు చేసిన త్రిఫల వాడే ముందు, దానిని ఎంత మోతాదులో తీసుకోవాలో తెలుసుకోవడం ముఖ్యం. ఒక వ్యక్తి ఒక రోజులో 500 మిల్లీగ్రాముల నుంచి 1 గ్రాము కంటే ఎక్కువగా త్రిఫల చూర్ణాన్ని తీసుకోకూడదని ఆయుర్వేద నిపుణులు చెబుతుంటారు. త్రిఫల వాడే వారు ఈ విషయాన్ని తప్పక గుర్తుంచుకోవాలి.
Published by:Mahesh
First published:

Tags: Ayurveda, Ayurveda health tips, Health, Health benefits

తదుపరి వార్తలు