Home /News /life-style /

skin problems: చలికాలంలోనూ చర్మంపై నల్లటి మచ్చలు ఎక్కువగా ఉన్నాయా? అయితే ఈ విధంగా చేయండి

skin problems: చలికాలంలోనూ చర్మంపై నల్లటి మచ్చలు ఎక్కువగా ఉన్నాయా? అయితే ఈ విధంగా చేయండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ముఖంపై ఈ నల్లటి మచ్చల వలన వారు మానసికంగా చాలా కుంగిపోతుంటారు. ఎలా ఈ నల్లమచ్చలను పోగొట్టి అందంగా కనిపించాలి అని ఆలోచిస్తుంటారు. చలికాలంలో వచ్చే చర్మ సమస్యలను తగ్గించడంలోనూ బేకింగ్ సోడా సహయపడుతుంది.

    ముఖంపై నల్లటి మచ్చలు (Black spots) వారి ముఖాన్ని అందంగా కనిపించకుండా అడ్డుకుంటాయి.  దాచితే దాగినవి మచ్చలు.  వీలైనంత వరకు అందంగా తయారవ్వాలని ఆకర్షణీయంగా కనిపించాలని అనుకుంటుంటారు. అయితే చాలా మంది ఎంత అందంగా ఉన్నప్పటికీ ముఖంపై నల్ల మచ్చలతో ఇబ్బంది పడుతుంటారు. ఆ నల్ల మచ్చలు (Black spots)  వారి ముఖంలో కాంతిని కోల్పోయేలా చేసి అంద వికారంగా కనిపిస్తుంటుంది. చాలా మందికి వయసు పైబడే కొద్ది ముఖంపై నల్ల మచ్చలు ఎక్కువగా వస్తుంటాయి. ఇవి నొప్పిని, బాదని అయితే కలిగించవు. కానీ ముఖంపై ఈ నల్లటి మచ్చల వలన వారు మానసికంగా చాలా కుంగిపోతుంటారు. ఎలా ఈ నల్లమచ్చలను పోగొట్టి అందంగా కనిపించాలి అని ఆలోచిస్తుంటారు.

    చలికాలంలో వచ్చే చర్మ సమస్యలను (skin problems) తగ్గించడంలోనూ బేకింగ్ సోడా సహయపడుతుంది. ఇది చర్మానికి పోషణతోపాటు… స్క్రిబ్బింగ్ కోసం కూడా ఉపయోగిస్తారు. అయితే చలికాలంలో ఈ బేకింగ్ సోడాను సరైన విధంగా ఉపయోగించకపోతే చర్మం మరింత పొడిబారుతుంది. అందుకే ఈ సీజన్లో బేకింగ్ సోడా ఉపయోగించే ముందు కొన్ని చిట్కాలను (beauty tips) తెలుసుకోవాలి.

    ఒక గిన్నెలో 1 లేదా 2 టీస్పూన్ల బేకింగ్ సోడా తీసుకుని, కాసిన్ని నీళ్లు కలిపి పేస్ట్ మాదిరిగా చేయాలి. ఆ తర్వాత దానిని చర్మం పై ఉన్న మచ్చలు.. గుర్తులపై రాయాలి. అయితే ఈ మిశ్రమాన్ని ముఖంపై ఎప్పుడైనా ఫేస్ మాస్కు మాదిరిగా అప్లై చేయకూడదు. మచ్చలపై బేకింగ్ సోడాను అప్లై చేసి 10 నిమిషాలు అలగే ఉంచి.. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడగాలి. ఈ ప్రక్రియను వారానికి ఒకసారి చేయాలి. దీనిని ఎక్కువగా చేస్తే చర్మం పొడిబారిపోతుంది. అలగే జిడ్డు చర్మం, సున్నితమైన చర్మం ఉన్నవారు బేకింగ్ సోడాను ఉపయోగించవద్దు. బేకింగ్ సోడాను ఎక్కువ పరిమాణంలో ఉపయోగించవద్దు.

    బేకింగ్ సోడా.. గ్రైనీ ఆకృతి ఎక్స్‏ఫోలియేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఎక్స్‏ఫోలియేట్ చర్మ రంధ్రాలను తెరచుకోవడమే కాకుండా.. బ్లాక్ హెడ్స్ సమస్యను తగ్గిస్తుంది. అంతేకాకుండా మొటిమల సమస్యను నియంత్రిస్తుంది. అలాగే ఇందులో యాంటీ ఇన్‏ఫ్లమేటరీ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి చర్మపు చికాకు, దద్దర్లు, వాపు వంటి సమస్యలను తగ్గిస్తాయి. అంతేకాకుండా బ్రేక్ అవుట్స్ సమస్యను తగ్గిస్తుంది.  చర్మం ph స్థాయి సాధారణంగా 4.5 నుంచి 5.5 మధ్య ఉంటుంది. ఇది చర్మాన్ని తేమగా ఉండేలా చేస్తుంది. అలాగే చర్మాన్ని బ్యాక్టీరియా, కాలుష్యం నుంచి రక్షిస్తుంది. అలాగే చర్మం ఆమ్లంగా ఉండి..చర్మంలోని సహజ నూనెల కారణంగా మొటిమలు ఏర్పడతాయి. బేకింగ్ సోడాను ముఖానికి ఉపయోగించినప్పుడు ఇది న్యూట్రలైజర్ గా పనిచేస్తుంది. అలాగే చర్మం ph స్థాయిని సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది.

    (Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)

    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Skin care, WINTER

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు