హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

beauty tips: ముఖంపై నల్లటి మచ్చలు ఎక్కువగా ఉన్నాయా? అయితే ఈ నారింజతో మీ సమస్యకు చెక్​ పెట్టొచ్చు.

beauty tips: ముఖంపై నల్లటి మచ్చలు ఎక్కువగా ఉన్నాయా? అయితే ఈ నారింజతో మీ సమస్యకు చెక్​ పెట్టొచ్చు.

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. క్రీములు, లోషన్లు వాడటం, ఆయుర్వేదిక్ మెడిసిన్ అని ఇలా చాలానే ఉపయోగిస్తుంటారు. కొందరికి ఫలితం ఉంటుంది కానీ కొందరికి మాత్రం ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా ముఖంపై ఈ నల్ల మచ్చలు అనేవి అస్సలు పోవు. అయితే అలాంటి వారు నారిజం చిట్కా పాటించినట్లైతే తప్పక ప్రతిఫలం ఉంటుందని నల్ల మచ్చలు (Black spots)  మెల్లగా మీ ముఖంపై నుండి మాయమౌతాయని చెబుతున్నారు నిపుణులు.

ఇంకా చదవండి ...

  అందంగా (beautiful) కనిపించాలని అందరూ అనుకుంటారు. చాలా మంది అందం (beauty)గా లేమని బాధపడుతూ ఉంటారు కూడా. ఆత్మన్యూనతా భావంలోకి వెళతారు. అయితే వారి చర్మంలో కాంతి ఉంటే అందంగా కనిపిస్తారు. అయితే ముఖంపై నల్లటి మచ్చలు (Black spots) వారి ముఖాన్ని అందంగా కనిపించకుండా అడ్డుకుంటాయి. ఏదో క్రీములు (creams) వాడి వాటిని కనిపంచకుండా చేసినా.. అది ఆ సమయం వరకే. మళ్లీ ముఖం కడుక్కుంటే మచ్చలే (Black spots)  కనిపిస్తాయి. దాచితే దాగినవి మచ్చలు.  వీలైనంత వరకు అందంగా తయారవ్వాలని ఆకర్షణీయంగా కనిపించాలని అనుకుంటుంటారు. అయితే చాలా మంది ఎంత అందంగా ఉన్నప్పటికీ ముఖంపై నల్ల మచ్చలతో ఇబ్బంది పడుతుంటారు. ఆ నల్ల మచ్చలు (Black spots)  వారి ముఖంలో కాంతిని కోల్పోయేలా చేసి అంద వికారంగా కనిపిస్తుంటుంది. చాలా మందికి వయసు పైబడే కొద్ది ముఖంపై నల్ల మచ్చలు ఎక్కువగా వస్తుంటాయి. ఇవి నొప్పిని, బాదని అయితే కలిగించవు. కానీ ముఖంపై ఈ నల్లటి మచ్చల వలన వారు మానసికంగా చాలా కుంగిపోతుంటారు. ఎలా ఈ నల్లమచ్చలను పోగొట్టి అందంగా కనిపించాలి అని ఆలోచిస్తుంటారు.

  ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. క్రీములు, లోషన్లు వాడటం, ఆయుర్వేదిక్ మెడిసిన్ అని ఇలా చాలానే ఉపయోగిస్తుంటారు. కొందరికి ఫలితం ఉంటుంది కానీ కొందరికి మాత్రం ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా ముఖంపై ఈ నల్ల మచ్చలు అనేవి అస్సలు పోవు. అయితే అలాంటి వారు నారిజం చిట్కా పాటించినట్లైతే తప్పక ప్రతిఫలం ఉంటుందని నల్ల మచ్చలు (Black spots)  మెల్లగా మీ ముఖంపై నుండి మాయమౌతాయని చెబుతున్నారు నిపుణులు. ఆ చిట్కా  తెలుసుకుందాం.

  నారింజ తొక్కలతో..

  నారింజ తొక్కల (orange peels)ను ఎండబెట్టి మెత్తని పౌడర్ లా చేసుకోవాలి, అలాగే వీటికి సమానంగా రోజా (rose) రేకులను ఎండబెట్టి వాటిని కూడా మెత్తటి పౌడర్ లా చేసుకోవాలి. ఈ రెండింటినీ ఒక్కో స్పూను చొప్పున వేసి, అర స్పూను శనగపిండిని కూడా వేయాలి, ఇందులో కాస్త పాల (milk) మీగడను కానీ లేదా పెరుగును కానీ కలిపి ముఖానికి 9face) పట్టించాలి. ముఖంపై సర్కిల్ (circle) మోషన్ లో బాగా మసాజ్ చేసుకోవాలి.

  ఇవి కూడా చదవండి: శరీరం నుంచి దుర్వాసన అధికంగా వస్తుందా? అయితే ఈ చిట్కాలతో సమస్య నుంచి బయటపడండి

  ఆ తర్వాత ఒక పావు గంట ఆగి చల్లటి నీటి (cool water)తో ముఖాన్ని కడిగేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయాలి. మరీ ఎక్కువ సార్లు చేయకూడదు. వారానికి రెండు సార్లు చేస్తే సరిపోతుంది. ఇలా చేయడం వలన ముఖం పై ఉన్న నల్లటి మచ్చలు మెల్లగా పోయి మీ ముఖం ఎంతో కాంతివంతం (bright)గా తయారవుతుంది.

  (Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)


  ఇవి కూడా చదవండి: పాలు తాగితే అధిక బరువును తగ్గించుకోవచ్చా? నిపుణులు ఏమంటున్నారు?

  గదిలో ఒంటరిగా కూర్చుంటే తలనొప్పి తగ్గుతుందా? మరి నొప్పి తగ్గాలంటే ఇంకేం చేయాలి?

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Beauty tips, Face mask, Life Style, Orange film

  ఉత్తమ కథలు