Home /News /life-style /

ARE NOT SLEEP PEACEFULLY AT NIGHT THEN FOLLOW THESE TIPS YOU CAN SLEEP COMFORTABLY DAILY PRV

Sleep tips: రాత్రిళ్లు ప్రశాంతంగా నిద్ర రావడం లేదా? అయితే ఇలా చేయండి.. హాయిగా నిద్రపోవచ్చు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

నిద్ర లేకపోవడం వల్ల ఏకాగ్రత లోపిస్తుంది. ఏకాగ్రత లోపించడం వల్ల ఏ పని పూర్తి చేయలేకపోతుంటాం అని చాలా మంది కంప్లెయింట్స్ చేస్తుంటారు. ఈ చిట్కాలు పాటిస్తే చక్కటి నిద్ర మీ సొంతం అవుతుంది.  అవేంటో ఒకసారి తెలుసుకుందాం..

  బిజీబిజీ జీవితంలో ప్రశాంతంగా నిద్రపోవడం ( Sleeping ) అనేది ఒక వరంలాంటిదే. కరోనా (corona) నేపథ్యంలో జీవితాలు తలకిందులయ్యాయి. లక్షలాది మంది ఉద్యోగాలు ఊడిపోయాయి. వారికి ప్రశాంతత (peace) కరువైంది. ఎన్నో మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నారు. కనీసం నిద్ర కూడా సరిగా పట్టనివారున్నారు. చాలా మంది జీవన విధానం వల్ల తీవ్రమైన ఒత్తిడి (pressure)కి గురి అవుతుంటారు. దీని ప్రభావం వారి ఆరోగ్యంపై (Health) పడుతుంది. నిద్ర (sleep) కూడా కరువు అవుతుంది. నిద్ర లేకపోవడం వల్ల ఏకాగ్రత లోపిస్తుంది. ఏకాగ్రత లోపించడం వల్ల ఏ పని పూర్తి చేయలేకపోతుంటాం అని చాలా మంది కంప్లెయింట్స్ చేస్తుంటారు. ఈ చిట్కాలు పాటిస్తే చక్కటి నిద్ర మీ సొంతం అవుతుంది.  అవేంటో ఒకసారి తెలుసుకుందాం..

  పాలతో చెక్​..

  రాత్రి పడుకొనే ముందు ఒక గ్లాసు గోరువెచ్చటి పాలు (milk) తాగాలి.ఇలా తాగడం వల్ల పాలలో ఉండే ట్రిప్టోపోన్ మీకు సరైన నిద్ర పట్టడానికి కారణం అవుతుంది. ఫలితంగా మీకు ప్రశాంతమైన నిద్ర వస్తుంది. ఇక పాలలో ఉన్న కాల్షియం ఒత్తిడిని తగ్గిస్తే, మెదడులో ఉన్న నరాలకు విశ్రాంతిని కలిగిస్తుంది.

  మల్లెపూలు (jasmine) మానసిక ఆహ్లాదాన్నిస్తాయని అందరికీ తెలిసిందే, అయితే ఈ పూలను ఔషధాలుగా కూడా వాడుకోవచ్చునని కొందరికే తెలుసు.. రోజంతా శారీరక కష్టంతో అలసి పోయిన శరీరాన్ని సేదతీర్చి, మనసంతా ఆహ్లాదాన్ని నింపి, మధురాను భూతులను పంచే మల్లెల గుబాళింపుల నడుమ హాయిగా కునుకు పట్టేస్తుంది. అవును మల్లెపూలు పక్కన పెట్టుకని పడుకుంటే హాయిగా నిద్ర(sleep) పడుతుందట.

  ఇది కూడా చదవండి: నీళ్లు ఎక్కువగా తాగితే నిత్య యవ్వనంగా కనిపిస్తారా? ముఖంపై ముడుతలు పోవాలంటే ఏం చేయాలి?

  అంతేకాదు ప్రతిరోజూ మల్లెపూలను తలలో పెట్టుకోవటం వల్ల ఆహ్లాదంగా వుండటమే కాదు, కళ్లకూ మేలు చేస్తాయి.  అలసిన కనురెప్పలపై మల్లెలను కొద్దిసేపు పరిచి వుంచితే చలవ చేస్తాయి. బాగా నిద్రపడుతుంది.

  వాల్ నట్స్ (walnuts) లో మెలటోనిన్ అధికంగా ఉండడం వల్ల మనకు సుఖంగా నిద్ర పడుతుంది. కాబట్టి వీటిని పడుకునే ముందు తింటే చాలా ప్రశాంతమైన నిద్ర మన సొంతమవుతుంది. అంతే కాదు రక్తంలో ఎర్ర రక్త కణాల సంఖ్య కూడా పెరుగుతుంది. ఇక రాత్రి పడుకునే ముందు అరటి పండ్ల (banana)ను కూడా తప్పకుండా తినాల్సిందే. నిద్రకు సహాయపడే విటమిన్ బి , ట్రిప్టోఫోన్ తో పాటు మెగ్నీషియం, పొటాషియం వంటి సమ్మేళనాలు పుష్కలంగా ఉండటం వల్ల ,మనకు ఆరోగ్యానికి ఆరోగ్యం, మంచి నిద్ర కూడా పడుతుంది. అలాగే బాదం గింజలు , గుమ్మడి గింజలు వంటివి కూడా రాత్రి పడుకునే ముందు తప్పకుండా తింటే క్వాలిటీ నిద్ర మీ సొంతం అవుతుంది.

  (Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)

  ఇవి కూడా చదవండి:  తిన్న ఆహారం అరగట్లేదా? అయితే రోజూ ఉదయాన్నే ఇలా చేయండి.. సమస్యను దూరం చేసుకోండి

  ముఖంలో కాంతి, తేజస్సు కావాలా ? మొటిమలు తగ్గిపోవాలా? అయితే ఇలా చేయండి

  చంకల్లో దురద ఎందుకు వస్తుందో తెలుసా? మరి ఆ దురద తగ్గాలంటే ఎలాంటి చిట్కాలు పాటించాలంటే

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Banana, Health Tips, MILK, Sleep tips

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు