ARE FENNEL SEEDS REALLY GOOD FOR DIABETICS HOW THEY CONTROL TYPE 2 DIABETICS NK
Type 2 Diabetes : డయాబెటిస్‌కి సోంపు గింజలతో చెక్... ఎలా వాడాలి?
సోంపు గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు
Fennel seeds (Saunf) for type 2 diabetes : సోంపు గింజలతో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని మనకు తెలుసు. ముఖ్యంగా ఆహారం జీర్ణం అయ్యేందుకు అవి ఎంతగానే మేలు చేస్తాయి. ఐతే... టైప్ 2 డయాబెటిస్ తగ్గేందుకు కూడా అవి ఉపయోగపడుతున్నాయని తాజా పరిశోధనల్లో తేలింది.
సోంపు గింజల్లో యాంటీఆక్సిడెంట్స్తోపాటూ... చాలా పోషకాలున్నాయి. అవి... టైప్ 2 డయాబెటిస్ వ్యాధిగ్రస్థుల్లో బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని తగ్గించేందుకు ఉపయోగపడుతున్నాయి. తాజా సోంపు గింజల్లో క్యాలరీలు తక్కువగా ఉండి... విటమిన్ సీ, మాంగనీస్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే వాటిలో క్లోరోజెనిక్ యాసిడ్, లైమొనెన్, క్వెర్సెటిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవన్నీ డయాబెటిస్, కాన్సర్, గుండె జబ్బులు రాకుండా వైరస్, బ్యాక్టీరియాతో పోరాడతాయి. సాధారణంగా అధిక బరువు ఉన్నవారు, షుగర్ ఉన్నవారు... రోజుకు రెండుసార్లు విటమిన్ సి టాబ్లెట్లు వేసుకుంటూ ఉంటారు. అలాంటి వారు సోంపు గింజల్ని తింటే... విటమిన్ సీ లభించి... టైప్ 2 డయాబెటిస్ లెవెల్స్ తగ్గే అవకాశాలుంటాయని ఆస్ట్రేలియాలో జరిపిన పరిశోధనలో తేలింది.
బంగ్లాదేశ్‌లో ఎలుకలకు పుదీనా, సోంపు గింజల్ని తినిపించారు. ఫలితంగా వాటిలో బ్లడ్ షుగర్ లెవెల్స్... కొంతవరకూ తగ్గాయి. మందులు వాడటం కంటే ఇది మంచిదంటున్నారు పరిశోధకులు. సోంపు మొక్క, సోంపు గింజల్లో ఫైబర్ ఎక్కువ. ఇది మన శరీరంలో కొలెస్ట్రాల్‌ను తగ్గించి, గుండె జబ్బులు రాకుండా చేస్తుంది. అంతేకాదు... సోంపు గింజల్లోని ఫైబర్... బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్ చేస్తూ... టైప్ 2 డయాబెటిస్ పెరగకుండా చేయగలుగుతోంది.
సోంపులోని మరో యాంటీఆక్సిడెంట్... బీటా కెరోటిన్... కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గేందుకు పోరాడుతోంది. సోంపులో కాన్సర్‌ను నిరోధించే లక్షణాలు కూడా ఉన్నాయని పరిశోధనలు చెబుతున్నాయి. ఐతే... కాన్సర్ హై స్టేజ్‌లో ఉన్నవారు మాత్రం సోంపు గింజల్ని తినవద్దని సూచిస్తున్నారు డాక్టర్లు.
పై ప్రయోజనాలు కలగాలంటే... సోంపు గింజల్ని డైరెక్టుగా తినడం గానీ లేదా... సూపులు, ఇతర వంటల్లో వేసుకొని తినడం గానీ చెయ్యాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ఐతే... సోంపు గింజల్ని రోజూ కొద్దిమొత్తంలోనే తీసుకోవాలనీ, అధికంగా తినడం అంత మంచిది కాదని చెబుతున్నారు. అలాగే... ప్రెగ్నెన్సీ ఉన్నవారు, పిల్లలకు పాలు ఇచ్చే తల్లులు... సోంపు గింజల్ని తినవద్దని సూచిస్తున్నారు.
Published by:Krishna Kumar N
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.