• HOME
  • »
  • NEWS
  • »
  • LIFE-STYLE
  • »
  • APRJC APRDC CETS NOTIFICATION RELEASED CHECK HERE FULL DETAILS RA

APRJC Notification : ఏపీఆర్‌జేసీ & ఏపీఆర్‌డీసీ సెట్ నోటిఫికేషన్ విడుదల

APRJC Notification : ఏపీఆర్‌జేసీ & ఏపీఆర్‌డీసీ సెట్ నోటిఫికేషన్ విడుదల

ప్రతీకాత్మక చిత్రం

ఏపీలోని వివిధ జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీల్లో 2019-2020 విద్యాసంవత్సరానికి గాను ప్రవేశాలకు కోసం ఏపీఆర్‌జేసీ & ఆర్డీసీ సెట్ -2019 నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందుకు సంబంధించిన వివరాలనుచూస్తే..

  • Share this:
ఏపీఆర్‌జేసీ సెట్‌కి పదోతరగతి, ఆర్డీసీ సెట్‌కి ఇంటర్ విద్యార్హతతో ‘ఏపీఆర్‌జేసీ & ఆర్డీసీ సెట్ -2019’ నోటిఫికేషన్‌ని ఆంద్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థ విడుదల చేసింది. ఏపీలోని వివిధ జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలల్లో 2019-20 విద్యా సంవత్సరానికిగానూ ఈ ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఫీజుగా రూ.400 చెల్లించి మార్చి 14 నుంచి ఏప్రిల్ 14 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ ఎగ్జామ్స్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 7 రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలు, 13 మహాత్మా జ్యోతిబాపూలే రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలల్లో ఇంటర్ ఫస్టియర్‌లో ప్రవేశాలు కల్పించనున్నారు. అలాగే డిగ్రీ కోర్సులకు సంబంధించి నాగార్జునసాగర్‌లోని ఏపీ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్(బాలురు), కర్నూలులోని సిల్వర్ జూబ్లీ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్‌లో ప్రవేశాలు కల్పించనున్నారు.
అర్హత : ఏపీఆర్‌జేసీ ప్రవేశపరీక్షకు పదోతరగతి, ఏపీఆర్‌డీసీ ప్రవేశ పరీక్షకు ఇంటర్
దరఖాస్తు విధానం : ఆన్‌లైన్ ద్వారా
దరఖాస్తు ఫీజు : రూ.400
ఎంపిక విధానం : ఉమ్మడి ప్రవేశ పరీక్ష ద్వారా..
ముఖ్యమైన తేదీలు
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం : 14-03-2019
చివరితేదీ : 14-04-2019
ఫీజు చెల్లింపు ప్రక్రియ : 14-03-2019 - 14-04-2019
ప్రవేశ పరీక్ష తేదీ: 09-05-2019
First published:

అగ్ర కథనాలు