Good News: AP Panchayat Secretary దరఖాస్తు గడువు జనవరి 26 వరకు పెంపు

APPSC Group 3 Notification 2018 | ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(APPSC) అధికారిక వెబ్‌సైట్ అయిన psc.ap.gov.inలో దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 1051 పంచాయతీ సెక్రటరీ పోస్టుల్ని భర్తీ చేసేందుకు ఈ నియామక ప్రక్రియ చేపట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.

news18-telugu
Updated: January 19, 2019, 2:45 PM IST
Good News: AP Panchayat Secretary దరఖాస్తు గడువు జనవరి 26 వరకు పెంపు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
గ్రూప్-3 నోటిఫికేషన్ దరఖాస్తు గడువును జనవరి 26 వరకు పొడిగించింది ఏపీపీఎస్సీ. దరఖాస్తు గడువు 2019 జనవరి 19న ముగుస్తుందని గతంలో ఏపీపీఎస్సీ ప్రకటించింది. ఇప్పుడు గడువును జనవరి 26 వరకు పొడిగించింది. పేమెంట్ మాత్రం జనవరి 25 అర్థరాత్రి 11.59 గంటలలోపే చేయాల్సి ఉంటుంది. పంచాయతీ సెక్రటరీ పోస్టుల భర్తీ కోసం గ్రూప్-3 నోటిఫికేషన్ గతేడాది చివర్లో విడుదలైంది. 2018 డిసెంబర్ 27న దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది.  ఇప్పటివరకు దరఖాస్తు చేయనివారికి జనవరి 26 వరకు అవకాశముంది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(APPSC) అధికారిక వెబ్‌సైట్ అయిన psc.ap.gov.inలో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి:

Flipkart Republic Day Sale: ఈ 15 స్మార్ట్‌ఫోన్లపై ఆకట్టుకునే ఆఫర్స్

ఈ యూజర్లు ఇక IRCTC ఉపయోగించుకోలేరు... ఎందుకో తెలుసా?

మొత్తం 1051 పంచాయతీ సెక్రటరీ పోస్టుల్ని భర్తీ చేసేందుకు ఈ నియామక ప్రక్రియ చేపట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. యూజీసీ గుర్తింపు కలిగిన డిగ్రీ పూర్తి చేసినవాళ్లు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. 2019 ఏప్రిల్ 21న స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. 2019 ఆగస్ట్ 2న ప్రధాన పరీక్ష ఉంటుంది. హాల్ టికెట్లను psc.ap.gov.in వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. గ్రూప్-3 పోస్టుకు ఎంపికైన వారి పే స్కేల్ రూ.16,400-రూ.49,870 ఉంటుంది. ఈ నియామక ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో ఉంటాయి.

గుర్తుంచుకోవాల్సిన తేదీలుదరఖాస్తుకు చివరి తేదీ- జనవరి 26, 2019
స్క్రీనింగ్- ఏప్రిల్ 21, 2019
పరీక్ష- ఆగస్ట్ 2, 2019

ఇవి కూడా చదవండి:

మొబైల్ బ్యాంకింగ్ చేస్తున్నారా? ఈ 12 టిప్స్ మీ కోసమే

మీ స్మార్ట్‌ఫోన్ పోయిందా? ఎక్కడ ఉందో ఇలా తెలుసుకోవచ్చు
Published by: Santhosh Kumar S
First published: January 19, 2019, 2:22 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading