హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Beauty tips: నలుగు పిండి, బాదంలతోనే మీ ముఖాన్ని అందంగా మార్చుకోవచ్చు.. ఎలాగంటే

Beauty tips: నలుగు పిండి, బాదంలతోనే మీ ముఖాన్ని అందంగా మార్చుకోవచ్చు.. ఎలాగంటే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

చర్మం(skin) మెరుస్తూ .. నిగారింపుని ఇస్తే .. ఎవరైనా సరే అందం(beauty)గా మెరిసిపోవాల్సిందే. అయితే .. అందుకోసం ఏ బ్యూటీ పార్లర్ ని పరుగులు తీయాల్సిన అవసరం లేదు. బాదం ఫేస్ ప్యాక్(face pack) వేయడం వల్ల ముఖం పై మడతలు తగ్గిపోతాయి. మనకు నిత్యం అందుబాటులో ఉండే కొన్ని పదార్థాలతో తయారైన నలుగు పిండి చర్మాన్ని శుభ్రం చేస్తుంది.  మృతకణాల వినియోగాన్ని తొలగించడానికి చర్మానికి  వాడుతారు.

ఇంకా చదవండి ...

కొన్నేళ్లు మనం వెనక్కి వెళితే .. సబ్బులు, షాంపూలు, ఫేస్ క్రీములు లేని రోజులు వస్తాయి. మరి, ఆ రోజుల్లో శరీరాన్ని శుభ్రపరచడానికి .. చర్మం సౌందర్యాన్ని (beauty) కాపాడుకోవడానికి అప్పట్లో వారు ఏమి ఉపయోగించారు? పూర్వీకులు సంప్రదాయ పద్ధతిలో .. కొన్ని పదార్థాలను ఉపయోగించి తయారు చేసిన అద్భుతమైన సౌందర్య సాధనం నలుగు పిండి(flour) .  మనకు నిత్యం అందుబాటులో ఉండే కొన్ని పదార్థాలతో తయారైన నలుగు పిండి చర్మాన్ని శుభ్రం చేస్తుంది.  మృతకణాల వినియోగాన్ని తొలగించడానికి చర్మానికి  వాడుతారు. అందుకే పెళ్లిలో ప్రత్యేకంగా వధువుకి, వరుడికి నలుగు పెట్టి స్నానం చేయిస్తారు. పెళ్లి అనే కాదు .. పండగల సమయంలోనూ ఒంటికి నూనె రాసుకొని నలుగు పెట్టుకొని స్నానం చేస్తారు. మెరిసే చర్మానికి బాదం పప్పు ఎంతగానో ఉపయోగపడుతుంది. బాదం పప్పు రోజూ తినడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుందని మనకు తెలుసు. కానీ .. అదే బాదం(almond) పప్పు చర్మం(skin) ప్రకాశవంతంగా మెరవడానికి సహాయం చేస్తుంది. కాబట్టి .. బాదం పప్పుతో చేసిన ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల మరింత అందంగా మెరవచ్చు. ఈ బాదం, నలుగు పిండి ముఖ తేజస్సు, నిగారింపులకు ఏవిధంగా ఉపయోగపడుతాయో ఒకసారి తెలుసుకుందాం ..

చర్మం(skin) మెరుస్తూ .. నిగారింపు(glowingfaceని ఇస్తే .. ఎవరైనా సరే అందం(beauty)గా మెరిసిపోవాల్సిందే. అయితే .. అందుకోసం ఏ బ్యూటీ పార్లర్ ని పరుగులు తీయాల్సిన అవసరం లేదు. మీ ఇంటిని .. మీరే ఇంట్లో లభించే పదార్థాలతో పార్లర్ గా మార్చేసుకోవచ్చు .. బాదం ఫేస్ ప్యాక్(face pack) వేయడం వల్ల ముఖం పై మడతలు తగ్గిపోతాయి. చర్మంపై నల్లని మచ్చలు తొలగిపోతాయి. దీని వల్ల చర్మం కాంతివంతంగా మెరుస్తుంది. రాత్రిపూట నాలుగు లేదా ఐదు బాదం పప్పులను పాలల్లో నానపెట్టాలి. మరుసటి రోజు వాటి పొట్టు తీసేసి .. పాలల్లో మరగనివ్వాలి. తర్వాత మెత్తని పేస్టులాగా చేసుకోవాలి. దీనిని రాత్రిపూట ముఖానికి(face) రాసుకోవాలి(apply). తెల్లారిన తర్వాత .. దీనిని కడిగేసుకోవాలి. ఇలా వారానికి మూడు, నాలుగు సార్లు చేస్తే .. మీ ముఖం కాంతివంతంగా మెరిసిపోతుంది.

ఇక మరో పద్దతి నలుగు పిండి(flour). కొన్ని రకాల పప్పు ధాన్యాలను పిండిగా మార్చి దాన్ని ఉపయోగించాలి. ఆయుర్వేదంలోనూ దీనికి ప్రాధాన్యం కల్పించారు. ఆయుర్వేదం ప్రకారం మీ శరీర తత్వానికి అనుగుణంగా నలుగు పిండి తయారు చేసుకోవాలి. అప్పుడే మీ చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. సాధారణంగా ఆయుర్వేదంలో వాతం, పిత్తం, కఫం అనే మూడు దోషాలకు  ఉపయోగించే ఔషధాలను ఇస్తారు. ఇదే సూత్రం చర్మ సౌందర్యానికీ వర్తిస్తుంది. సాధారణంగా నలుగు పిండిని శెనగపిండి, పసుపు, పాలు వంటి వాటితో తయారు చేస్తారు. అయితే ఇటీవల కాలంలో శెనగపిండి, చందనం, పాలు లేదా పాలపొడి, బాదం పొడి, మిల్క్ క్రీం, నిమ్మరసం, రోజ్ వాటర్, పసుపు వంటి వాటితో తయారు చేస్తున్నారు.

First published:

Tags: Almonds Health Benefits, Beauty tips, Lifestyle

ఉత్తమ కథలు