ANY BIRD DOES MIMICRY DID YOU KNOW IN AUSTRALIA ITS CALLED LYREBIRD IT WAST IMITATE HUMAN NGS
Lyrebird: మనిషిలా మిమిక్రీ చేసే పక్షిని ఎప్పుడైనా చూశారా..? కావాలంటే ఈ వీడియో చూడండి!
మిమిక్రీ చేసే పక్షి
Rare Bird: ప్రపంచంలో ఎన్నో రకాల పక్షులు ఉంటాయి.. అందులో చాలా వింత వింత పక్షులు గురించి మనం చాలా విన్నాం.. కానీ మనిషిని మిమిక్రీ చేసే పక్షి ఒకటి ఉందని మీకు తెలుసా..?
Mimicry Bird: సాధారణంగా మనుషులే మిమిక్రీ చేస్తారు.. సెలబ్రీటీల వాయిస్ లను మిమిక్రీ చేసే వారికి మంచి గుర్తింపు ఉంటుంది. అయితే మనుషులే కాదు పక్షులు (Birds) కూడా మిమిక్రీ చేస్తాయి. సాధారణంగా కొందరి ఇళ్లలో రామ చిలుకలను పెంచి వాటితో ఒకటి రెండు మాటలు చెప్పించి మురిసిపోతుండేవారు కొందరు. మాట్లాడే చిలుక అంటూ అప్యాయంగా ఇళ్లలో పెంచుకునే వారు.. అయితే ఒకటి రెండు పదాలు కాదు.. అచ్చం మనిషిలా మిమిక్రీ చేసే పక్షి ఒకటి ఉందని మీకు తెలుసా..? ఈ పక్షి మనుషులు చేసే శబ్ధాలను విని.. వాటిని అచ్చం మనుషుల్లానే మిమిక్రీ చేస్తుంది అంట.. ఆ విషయం ఆ పక్షిని రోజూ చూస్తూ జూ సిబ్బంది కూడా ఇన్నాళ్లు తెలియదట.. ఓ కెమెరాలో ఆ పక్షి ఆడియో రికార్డు అవ్వడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. మామూలుగా కొన్ని జంతువులు చేసే వింత శబ్దాలు మనుషులను భయపెడతాయి. ఎప్పుడు వినని వారైతే వాటి వింత శబ్దాలు విని పరుగులు తీస్తుంటారు. తాజాగా ఆస్ట్రేలియాలోని టారోంగా జూలో ఓ పక్షి చేస్తున్న వింత శబ్దం విని పర్యాటకులు భయపడుతున్నారు. ఆ పక్షి అచ్చం పసిపిల్లలు ఏడ్చినట్టుగా శబ్దం చేస్తుంది. దీనిని మొదటి సారి వింటే ఎవరు పక్షి అరుపని నమ్మరు. తదేకంగా గమనిస్తే తప్ప ఆ శబ్దం పక్షి చేస్తుందని నమ్మలేరు. కానీ ఇది నిజ...
పక్షి జాతుల్లో ప్రత్యేకమైన దీనిపేరు లైర్ బర్డ్.. దీనికో ప్రత్యేకత ఉంది. ఈ పక్షి ఏదైనా శబ్దం వింటే దానిని క్షణాల్లో మిమిక్రి చేస్తుంది అంట. ఇది ఎప్పుడో చిన్న పిల్లాడి ఏడుపు విని ఉంటుంది. దానిని ఇప్పుడు మిమిక్రి చేసి వినిపిస్తోంది. ఇక ఈ మిమిక్రి పక్షిని చూసేందుకు పర్యాటకులు భారీగా వస్తున్నారు.
మొన్నటి వరకు కరోనా లాక్డౌన్ కారణంగా టారోంగా జంతు ప్రదర్శనశాల గత కొద్ది కాలంగా మూసివేయబడినప్పటికీ.. నిత్యం జూ-కీపర్లు ఇటీవల పెద్దగా అరుస్తున్న శబ్దాలు, ఏడుస్తున్న శబ్దాలు వింటున్నారు. దీంతో మొదట్లో చాలా భయపడ్డారు అంట.. అయితే ఆ శబ్ధాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియక జూలో కెమెరాలు ఏర్పాటు చేయాల్సి వచ్చింది. http://
Bet you weren't expecting this wake-up call! You're not hearing things, our resident lyrebird Echo has the AMAZING ability to replicate a variety of calls - including a baby's cry!
తాజాగా జూలోని సీసీ కెమెరాలను పరిశీలించారు. అయినా ఆ శబ్దాలు ఎక్కడి నుంచి వస్తున్నాయన్నది తెలియలేదు. చివరకు ఓ కెమెరాలో బంధించిన వీడియోలో స్పష్టమైన శబ్దంతోపాటు పక్షి నోరు కదలికలను పసిగట్టారు. పక్షే ఈ శబ్దం చేస్తుందని గుర్తించారు. కాగా జూలో ఉండే చాలామంది సిబ్బందికి ఈ పక్షి మిమిక్రి చేస్తుందనే సంగతి ఇప్పుడే తెలిసిందట..
Published by:Nagesh Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.