Diabetes: షుగర్ పేషెంట్లకు గుడ్ న్యూస్... భారీగా తగ్గనున్న ట్యాబ్లెట్ల ఖర్చు

ప్రస్తుతం ఒక ట్యాబ్లెట్ ధర రూ.20 నుంచి రూ.28 మధ్య ఉంటే జనరిక్ ట్యాబ్లెట్ ధర రూ.5 నుంచి రూ.10 మధ్యే ఉంటుందని అంచనా. మైక్రోల్యాబ్స్, మ్యాన్‌కైండ్, మెడికో ల్యాబ్స్, ఐకాన్ రెమిడీస్, ఇన్నోవేటీవ్ ఫార్మా లాంటి 50 కంపెనీలు జనెరిక్ ట్యాబ్లెట్లను తయారు చేసే అవకాశం ఉంది.

news18-telugu
Updated: December 10, 2019, 6:11 PM IST
Diabetes: షుగర్ పేషెంట్లకు గుడ్ న్యూస్... భారీగా తగ్గనున్న ట్యాబ్లెట్ల ఖర్చు
Diabetes: షుగర్ పేషెంట్లకు గుడ్ న్యూస్... భారీగా తగ్గనున్న ట్యాబ్లెట్ల ఖర్చు (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
డయాబెటిస్ ఉన్నవారికి ఇది ఉపశమనం కలిగించేవార్త. ఇక త్వరలో డయాబెటిస్ కోసం వాడే ఓ ట్యాబ్లెట్ ధర దిగిరానుంది. డయాబెటిస్ ఉన్నవారు వాడే మెడిసిన్‌లో Vildagliptin కూడా ఒకటి. ఈ డ్రగ్ పేటెంట్ Novartis కంపెనీది. భారతదేశంలో Vildagliptin పేటెంట్ డిసెంబర్ 9న ఎక్స్‌పైరీ అయింది. అంటే ఇకపై ఇదే ఫార్ములాతో జనెరిక్ డ్రగ్స్ మార్కెట్‌లోకి అందుబాటులోకి రానున్నాయి. అదే జరిగితే Vildagliptin ధర భారీగా తగ్గుతుంది. షుగర్ పేషెంట్ల నెలవారీ మందుల ఖర్చు కూడా తగ్గుతుంది. ఈ మెడిసిన్ ధర ఏకంగా 80% పడిపోతుందని అంచనా. ప్రస్తుతం Novartis కంట్రోల్‌లో ఉన్న బ్రాండ్లు Vildagliptin ట్యాబ్లెట్‌ను రూ.20 నుంచి రూ.28 మధ్య అమ్ముతున్నాయి. ఇది ఒక ట్యాబ్లెట్ మాత్రమే. నాట్కో ఫార్మా 50ఎంజీ Vildagliptin 14 ట్యాబ్లెట్ల స్ట్రిప్‌ను రూ.125 ధరకు అమ్ముతోంది. వివిఫి లైఫ్ సైన్సెస్ 15 ట్యాబ్లెట్ల స్ట్రిప్‌ను రూ.105 ధరకు అమ్ముతోంది. ఈ ధరలు మరింత దిగిరానున్నాయి.

Galvus బ్రాండ్ పేరుతో Vildagliptin డ్రగ్‌ను ఇండియాలో అమ్ముతోంది నోవార్టిస్. Zomelis, Jalra, Vyosov లాంటి బ్రాండ్స్ నోవార్టిస్ దగ్గర సబ్ లైసెన్స్ తీసుకొని Vildagliptin మెడిసిన్ తయారు చేస్తున్నాయి. మరికొన్ని వారాల్లో Vildagliptin జనెరిక్ ట్యాబ్లెట్లు మార్కెట్లోకి అందుబాటులోకి వస్తాయని పలు సంస్థలు మనీకంట్రోల్‌తో మాట్లాడుతూ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఒక ట్యాబ్లెట్ ధర రూ.20 నుంచి రూ.28 మధ్య ఉంటే జనరిక్ ట్యాబ్లెట్ ధర రూ.5 నుంచి రూ.10 మధ్యే ఉంటుందని అంచనా. మైక్రోల్యాబ్స్, మ్యాన్‌కైండ్, మెడికో ల్యాబ్స్, ఐకాన్ రెమిడీస్, ఇన్నోవేటీవ్ ఫార్మా లాంటి 50 కంపెనీలు Vildagliptin జనెరిక్ ట్యాబ్లెట్లను తయారు చేసే అవకాశం ఉంది. షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్ చేయడానికి Vildagliptin ట్యాబ్లెట్‌ పనిచేస్తుంది. Vildagliptin డ్రగ్‌తో పాటు Sitagliptin, Saxagliptin, Teneligliptin లాంటి డ్రగ్స్ కూడా ఉన్నాయి. భారతదేశంలో యాంటీ డయాబెటిక్స్ మార్కెట్ విలువ రూ.15,000 కోట్లు అయితే అందులో ఈ గ్లిప్టిన్స్ డ్రగ్స్ విలువే రూ.3,510 కోట్లు ఉంటుందని అంచనా. ఇందులో నాలుగో వంతు Vildagliptin వాటా ఉంది. అంటే సుమారు రూ.900 కోట్లు. త్వరలో Vildagliptin జనరిక్ డ్రగ్ అందుబాటులోకి వస్తే షుగర్ పేషెంట్ల నెలవారీ మందుల ఖర్చు భారీగా తగ్గుతుందని అంచనా.

Vivo S1: వివో ఎస్1 ధర తగ్గింది... ఫోన్ ఎలా ఉందో చూడండి





ఇవి కూడా చదవండి:

SBI Card: మీ క్రెడిట్ కార్డు అక్కడ వాడితే కేసులు తప్పవు

LIC Customer App: పాలసీ ఉంటే ఎల్ఐసీ కస్టమర్ యాప్ వాడుకోండి ఇలా2019 Smartphones: రూ.10,000 లోపు ఈ ఏడాది రిలీజైన బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ ఇవే
First published: December 10, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>