ANTI AGING BEAUTY TIPS IN TELUGU HERE ARE SOME AMAZING HEALTH TIPS TO PREVENT AGING FOLLOW THESE STEPS SK
Health: మీరు ముసలోళ్లు అవకూడదా? 40 ఏళ్ల ఏజ్‌లోనూ యంగ్‌గా కనిపించాలా? ఇలా చేయండి
ప్రతీకాత్మక చిత్రం
Health Tips: 40 ఏళ్ల వయసు రాగానే.. చాలా మందిలో వృద్ధాప్య ఛాయలు కనిపిస్తాయి. ముఖంపై ముడతలు ఏర్పడతాయి. షుగర్, బీపీ వస్తుంటాయి. మరి అలాంటప్పుడు ఏం చేయాలి?
40 ఏళ్లు వచ్చే సరికి ముఖంపై ముడతలు రావడం సహజమే. అంతేకాదు శరీరంలో ఎనర్జీ కూడా తగ్గుతూ వస్తుంది. వృద్ధాప్య ఛాయలు కనిపించడం మొదలవుతుంది. ముఖ్యంగా మహిళల్లో ఇలాంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తుంది. అందుకే ఈ వయసులో ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి. అప్పుడే వృద్ధాప్య ప్రభావాన్ని తగ్గించవచ్చు. ఇది పెద్ద కష్టం కాదు. ఎందుకంటే..ఇవి మన జీవనశైలికి సంబంధించిన పద్దతులు, అలవాట్లు మాత్రమే. వాటిని మార్చుకుంటే సరిపోతుంది. తద్వారా 40 ఏళ్ల వయసుల్లోనూ 20 ఏళ్ల కుర్రాడిలా కనిపిస్తారు. పూర్తి ఫిట్‌గా.. యవ్వనంగా తయారవుతారు. అందుకోసం ఏ చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.
శనగ, వేరుశనగ, సోయాబీన్, పొద్దు తిరుగుడు, గుమ్మడికాయ వంటి విత్తనాల్లో ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి. అన్ని రకాల ఖనిజాలు, ఫైబర్ కూడా పుష్కలంగా లభిస్తాయి. ఫైటోన్యూట్రియెంట్లకు కూడా కొదువలేదు. ఇవి మన జీవ వ్యవస్థ బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిష్తాయి. అందుకే ఈ విత్తనాలన్నింటినీ కలిపి తీసుకంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. అప్పుడు మనం శరీరానికి అవసరమైన అన్ని అమైనో-యాసిడ్లను పొందుతాము. కండరాలు, ఎముకలు కూడా దృఢంగా మారుతాయి.
పెరుగులో మంచి బ్యాక్టీరియా ఉంటుంది. ముఖ్యంగా మన ప్రేగుల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అందుకే కొన్ని విషయాల్లో పాల కంటే పెరుగే మంచిది. రక్తపోటను నియంత్రిస్తుంది. ప్రోటీన్, కొవ్వు పదార్థం, కాల్షియం కూడా ఇందులో ఉంటాయి. పెరుగును క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల వృద్ధాప్య ప్రభావం తగ్గుతుంది. ముఖం కూడా అందంగా కనిపిస్తుంది.
రాత్రుళ్లు త్వరగా నిద్రపోవడం అలవాటు చేసుకోవాలి. ఉదయాన్నే నిద్రలేవాలి. రాత్రి భోజనానికి, ఆ తర్వాత నిద్రించడానికి మధ్య రెండు గంటల గ్యాప్ ఉండాలి. కానీ చాలా మంది రాత్రి ఆలస్యంగా భోజనం చేస్తారు. వెంటనే నిద్రపోతారు. తద్వారా మధుమేహం, గుండె సంబంధ వ్యాధులు వస్తాయి. అందుకే ఈ అలవాట్లను మార్చుకోవాలి. త్వరగా భోజనం చేయాలి. త్వరగా పడుకోవాలి.
మనోలా చాలా మంది తగినంత పాలు, పండ్లు, కాలానుగుణంగా లభించే కూరగాయలను ఎక్కువగా తినరు. వీటిని తగినంతగా తీసుకోకపోతే మన శరీరానికి సమతుల్య ఆహారం అందనట్లే. దీని ఫలితంగా మనలో కొన్ని పోషకాలు, ముఖ్యంగా విటమిన్లు లోపం ఉంటుంది. అందుకే వయసు పెరిగే కొద్దీ విటమిన్ సప్లిమెంట్స్ తీసుకోవడం బెస్ట్ చాయిస్. విటమిన్ సి, విటమిన్-ఇ, విటమిన్-డి సప్లిమెంట్లను ఆహారంలో చేర్చుకుంటే యంగ్‌గా కనిపిస్తారు. వీలైనంత ఎక్కువగా పండ్లు, పచ్చి కూరగాయలు తినాలి. సహజంగా లభించే వీటి నుంచి పోషకాలు, విటమిన్లతో పాటు ఫైటోకెమికల్స్ కూడా లభిస్తాయి. వీటిని పాటిస్తే మీరు వృద్ధాప్యం బారినపడరు. నిత్య యవ్వనంగా ఉంటారు.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.