Anti Ageing Homemade Face Pack : ప్రతి ఒక్కరూ ఎప్పుడూ యంగ్ (Young) గా, అందంగా కనిపించాలని కోరుకుంటారు. కానీ వయస్సుతో చర్మం తేమ తగ్గడం ప్రారంభమవుతుంది. ఫలితంగా ముఖంపై ముడతలు రావడం సహజమే. కొన్ని హోం రెమెడీస్‌ని (Home remedies) అనుసరించడం ద్వారా మీ చర్మాన్ని యవ్వనంగా ,మృదువుగా ఉంచుకోవచ్చు. అదనంగా క్రమరహిత ఆహారపు అలవాట్లు (Food habits) , ఒత్తిడి, నిద్ర లేకపోవడం మీ ముఖంపై చాలా త్వరగా ముడతలు కలిగిస్తుంది.
ఈ రోజు మనం మీకు 40 ఏళ్ల తర్వాత కూడా అందంగా ,యవ్వనంగా కనిపించడానికి సహాయపడే ఫేస్ మాస్క్ (Face Pack) గురించి చెప్పబోతున్నాం.
ఇంట్లో తయారుచేసుకునే ఫేస్ ప్యాక్‌కి కావలసిన పదార్థాలను మీరు సులభంగా కనుగొనవచ్చు. ఈ ఫేస్ మాస్క్‌లో (Face Pack) విటమిన్-సి, ఇ పుష్కలంగా ఉన్నాయి. అరటిపండు చర్మానికి పోషణనిచ్చి దానిని సాగేలా చేస్తుంది. దీనికి సగం అరటిపండు, ఒక గుడ్డు, 4 టేబుల్ స్పూన్ల ఓట్స్, 1 టేబుల్ స్పూన్ రోజ్ వాటర్, 2 టేబుల్ స్పూన్ల తేనె అవసరం.
ఓట్స్ అద్భుతమైన ఎక్స్‌ఫోలియేటింగ్ ఏజెంట్‌గా పనిచేస్తాయి. ఇది చర్మంలోని మృతకణాలను తొలగించడంలో సహాయపడుతుంది. తేనె చర్మాన్ని మృదువుగా, తేమగా చేస్తాయి. కాబట్టి ఈ ఫేస్ ప్యాక్ మీ చర్మాన్ని మెరిసేలా చేస్తుంది.
ఫేస్‌ప్యాక్ ఎలా తయారు చేయాలి?
ఈ ఫేస్ ప్యాక్ చేయడానికి, పండిన అరటిపండ్లను (Banana) బాగా రుబ్బుకోవాలి. ఈ అరటిపండు పేస్ట్‌లో గుడ్డులోని తెల్లసొన, ఓట్స్, తేనె, రోజ్ వాటర్ కలపండి. ఇది బాగా కలిసినప్పుడు, మృదువుగా మారుతుంది. అప్పుడు ముఖంపై అప్లై చేయండి. దీన్ని అప్లై చేసే ముందు మీ ముఖాన్ని పూర్తిగా శుభ్రం చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ ఫేస్ ప్యాక్ వేసుకునే ముందు మీ ముఖాన్ని ఎక్స్ఫోలియేట్ చేసి కడగడం ఉత్తమం. ఇది ప్యాక్ ను మరింత ప్రభావవంతంగా చేస్తుంది. ఇప్పుడు మీ ముఖాన్ని బాగా కడిగి ఆరనివ్వండి. తర్వాత ముఖం మీద యాంటీ ఏజింగ్ సీరమ్ అప్లై చేయండి. మీరు ఈ ఫేస్ ప్యాక్ ను వారానికి ఒకసారి రాత్రి పడుకునే ముందు అప్లై చేసుకోవచ్చు.
ఫేస్‌ప్యాక్ ప్రయోజనాలు...
ఈ ఫేస్ మాస్క్‌లో విటమిన్-సి, ఇ (Vitamin c and e) పుష్కలంగా ఉన్నాయి. అరటిపండు చర్మానికి పోషణనిచ్చి దానిని సాగేలా చేస్తుంది. అదనంగా, విటమిన్ సి మీ చర్మంలో కొల్లాజెన్ (Collagen) స్థాయిని పెంచడంలో సహాయపడుతుంది. ఓట్స్ మీ చర్మంలోని మలినాలను తొలగించి, రంధ్రాలను శుభ్రపరచడంలో సహాయపడతాయి. ఈ విధంగా మీ చర్మం సహజంగా మెరుస్తుంది. మీ వయస్సు పెరిగినప్పటికీ యవ్వనంగా కనిపిస్తారు.
Published by:Renuka Godugu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.