హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Anjeer for Health: అంజీర్‌ పండుతో అదిరిపోయే లాభాలు.. తెలిస్తే వదలరంతే..

Anjeer for Health: అంజీర్‌ పండుతో అదిరిపోయే లాభాలు.. తెలిస్తే వదలరంతే..

ఆయుర్వేదంలో అంజీర్ పండ్లకు ప్రత్యేకమైన స్థానముంది. కేవలం ఆరోగ్యం కోసమే కాదు అందమూ ప్రసాదిస్తుంది. ఎర్రటి అంజీర్ పండ్లను పాలతో కలిపి తీసుకుంటే మధుమేహాన్ని నియంత్రించవచ్చు. ఇలాంటి ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి.

  అంజీర్ (Figs).. దీన్నే అత్తి పండు అని కూడా పిలుస్తారు. మార్కెట్‌లో విరివిగా లభిస్తుంటాయి. సాధారణ పండ్లతో పాటు ఎండు ఫలాలుగానూ ఇవి అందుబాటులో ఉంటాయి. అంజీర్ పండ్లు చాలా రుచిగా ఉండడమే కాదు అద్భుతమైన పోషకాలు వీటి సొంతం. అత్తి పండ్లలో పోటాషియం, ఖనిజ లవణాలు, విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ పండ్లు తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. పలు రకాల వ్యాధులకు అంజీర్‌తో చెక్ పెట్టవచ్చు. రక్తంలో చక్కెర స్థాయి పెరిగినప్పుడు ఇది ఇన్సులిన్‌గా పనిచేసి కంట్రోల్ చేస్తుంది. ఆయుర్వేదంలో అంజీర్ పండ్లకు ప్రత్యేకమైన స్థానముంది. కేవలం ఆరోగ్యం కోసమే కాదు అందమూ ప్రసాదిస్తుంది. ఎర్రటి అంజీర్ పండ్లను పాలతో కలిపి తీసుకుంటే మధుమేహాన్ని నియంత్రించవచ్చు. ఇలాంటి ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. అవేంటో ఇక్కడ చూడండి.

  ఎముకలకు ఎంతో మేలు:

  అంజీర్ పండ్లలో కాల్షియం సమృద్ధిగా ఉంటుంది. అందుకే ఈ పండ్లు తింటే ఎముకలకు ఎంతో మంచింది. క్రమం తప్పకుండా అంజీర్ పండ్లు ఎముకలు ధృడంగా మారుతాయి. ఎముకల బలహీనత సమస్య తగ్గుతుంది.

  మొటిమలు మటుమాయం:

  యువత చాలా మంది మొటిమలతో ఇబ్బందులు పడుతున్నారు. ఐతే అంజీర్ పండ్లతో ఆ సమస్యకు చెక్ పెట్టవచ్చు. అందుకోసం అంజీర్ పండ్లను మెత్తగా నూరి ఆ పేస్ట్‌ను మొటిమలకు అప్లై చేయాలి. ఆకులు కూడా వాడవచ్చు. 20 నిమిషాల తర్వాత ముఖాన్ని కడుక్కోవాలి. ఇలా కొన్ని రోజుల పాటు చేస్తే మొటిమలు తగ్గిపోతాయి.

  మలినాలను తొలగిస్తుంది:

  శరీరంలో ఉన్న మలినాలను తొలగించడంలో అంజీర్ పండ్లు సమర్థవంతంగా పనిచేస్తాయి. మూత్ర సంబంధ, ఉదర సంబంధ సమస్యలను తొలగిస్తుంది. శరీరంలో పేరుకుపోయిన చెత్తనంతా బయటకు పంపిస్తుంది.

  మలబద్ధకం సమస్యకు చెక్:

  మీరు బలబద్ధకం సమస్యతో బాధపడుతుంటే అంజీర్ పండ్లు చక్కగా పనిచేస్తాయి. ప్రతి రోజు 2-3 అంజీర్ పండ్లను తేనెతో కలిపి తీసుకుంటే కడుపు ఖాళీ అవుతుంది. గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు కూడా దరి చేరవు.

  లైంగిక సమస్యలు, సంతాన భాగ్యం కలగనివారికి అంజీర్ పండ్లు అద్భుతంగా పనిచేస్తాయి. స్పెర్మ్ కౌంట్ పెంచేందుకు, వయాగ్రాలా పనిచేసేందుకు ఇది దోహదపడతాయి. మగవాళ్లు 2 లేదా 3 అంజీర్లను రాత్రంతా పాలలో నానబెట్టి తింటే ఎంతో మంచిది.

  (Disclaimer: అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ ఆర్టికల్ రాయబడింది. న్యూస్18 తెలుగు దీనిని ధృవీకరించలేదు. వీటిని అమలుచేసే ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం.)

  First published:

  Tags: Ayurveda health tips, Health, Health care, Health food, Life Style

  ఉత్తమ కథలు