బీపీ, షుగర్ పేషెంట్స్‌కి ఫ్రీగా మెడిసిన్.. పొందాలంటే ఇలా చేయండి..

బీపీ, షుగర్ పేషెంట్స్‌పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఇకనుంచి నెలకు సరిపడా మందులను రాష్ట్రప్రభుత్వమే ఉచితంగా ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

Amala Ravula | news18-telugu
Updated: February 9, 2019, 5:31 PM IST
బీపీ, షుగర్ పేషెంట్స్‌కి ఫ్రీగా మెడిసిన్.. పొందాలంటే ఇలా చేయండి..
ప్రతీకాత్మక చిత్రం
Amala Ravula | news18-telugu
Updated: February 9, 2019, 5:31 PM IST
ఐసీఎంఆర్, కలామ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ టెక్నాలజీ సంస్థలు ఏపీలో సర్వేలో నిర్వహించాయి. ఈ నేపథ్యంలోనే అక్కడ ప్రైవేట్ వైద్యరంగంలో నెలకు వేలకు వేలు వెచ్చించి బీపీ, షుగర్ మందులు కొనుగోలు చేస్తున్నట్లు తేలింది. దీంతో.. వారి ఆర్థికభారాన్నతి గ్గించేందుకు ఉచితంగా మందులు ఇచ్చేందుకు మార్గదర్శాలు విడుదల చేసింది.
అయితే, ఈ మందులు పొందాలంటే.. ప్రభుత్వాస్పత్రుల్లో వ్యాధిని నిర్దారణ చేయించుకోవాలి. అనంతరం డాక్టర్ రోగి పరీక్ష ఫలితాలను AP -e RX APP ద్వారా అప్‌లోడ్ చేస్తారు. ఆ వెంటనే పేషెంట్ సెల్‌నెంబర్‌కి ఎస్‌ఎంఎస్, కోడ్ వస్తుంది. ఇలా జరిగితే.. లబ్ధిదారుడిగా ఎంపికైనట్లు నిర్ధారణ. మొబైల్‌కి వచ్చిన కోడ్‌ని రిటైల్ మెడికల్ షాప్‌కి వెళ్తే.. నెలకు సరిపడా మందులువస్తాయి.
ఈ స్కీమ్‌లో లబ్ధిదారులుగా చేరాలంటే ఆధార్ నెంబర్, ప్రజా సాధికార సర్వే వివరాలు అనుసంధానం చేయాల్సి ఉంటుంది. ప్రజాసాధికార సర్వేలో నమోదు కాని వారు తమ సమీపంలో ఉన్న మీసేవా కేంద్రంలో సంప్రదించాలి.

First published: February 9, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...