#Jobs: ఏపీలో జనవరి 21 నుంచి ‘ఎస్‌ఐ’ ఈవెంట్స్

ఆంధ్రప్రదేశ్‌లో ఈ నెల 21 నుంచి పోలీస్ అభ్యర్థులకు ఫిజికల్ ఈవెంట్స్ జరుగనున్నాయి.

Amala Ravula | news18-telugu
Updated: January 11, 2019, 3:46 PM IST
#Jobs: ఏపీలో జనవరి 21 నుంచి ‘ఎస్‌ఐ’ ఈవెంట్స్
నమూనా చిత్రం
Amala Ravula | news18-telugu
Updated: January 11, 2019, 3:46 PM IST
ఆంధ్రప్రదేశ్‌లో పోలీస్ ఉద్యోగాల భర్తీకోసం నిర్వహించిన ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన అభ్యర్థులకు జనవరి 21వ తేదీ నుంచి ఫిజికల్ ఈవెంట్స్ జరుగనున్నాయి. ఈ మేరకు.. స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ప్రకటన విడుదల చేసింది.
ఈవెంట్స్‌ని జనవరి 21 నుంచి ఫిబ్రవరి 4 వరకు విశాఖపట్నంలో జనవరి 21 నుంచి ఫిబ్రవరి 5వ తేదీ వరకు ఏలూరులో, జనవరి 21 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు గుంటూరులో, జనవరి 21 నుంచి ఫిబ్రవరి 9వ తేదీ వరకు కర్నూలులో ఈవెంట్స్ జరుగనున్నాయి. హాజరుకాన్ను అభ్యర్థులు ఎస్‌ఎస్‌సీ, ఇతర విద్యార్హత సర్టిఫికెట్లు, కుల, నివాస, ఎక్స్ సర్వీస్‌మెన్ ధృవీకరణ పత్రాలు వెంట తీసుకురావాల్సి ఉంటుందని అధికారులు. దేహదారుఢ్య పరీక్షలకు హాజరయ్యేవారు కాల్ లెటర్స్ జనవరి 17 నుంచి 20వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపారు.
ఏపీలో మొత్తంగా ఎస్సై జాబ్స్‌కోసం 1,22,160 మంది పరీక్ష రాయగా ఇందులో 51,926మంది క్వాలిఫై అయ్యారు. ఇప్పుడు ఫిజికల్ టెస్ట్‌లో క్వాలిఫై అయినవారికి ఫిబ్రవరి 23, 24 తేదీల్లో మెయిన్స్ ఉంటాయి.

First published: January 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు