ANDHRA PRADESH NEWS VIRAL FEVERS TENSION IN ANDHRA PRADESH DAILY INCREASE FEVERS CASES IN VISAKHA AGENCY NGS VSP
Fever Tension: ఆ జిల్లాను భయపెడుతున్న వింత జ్వరాలు.. 6 నెలల లోపు చిన్నారులకు అంతు చిక్కని వ్యాధి
విశాఖ జిల్లాను భయపెడుతున్న వింత జ్వరాలు
What happens in Agency: అమ్మతనం మధురానుభూతిని ఆనదంగా ఆస్వాదించాలని ప్రతి మహిళా కోరుకుంటుంది. బిడ్డలే తన్న ప్రాణంగా చూసుకుంటుంది. బిడ్డకు ఏ బాధ తెలియకుండా పెంచాలనుకుంటుంది. కానీ మన్యంలో కమ్మనైన అమ్మతనానికి పెను సవాళ్లు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా ఆరు నెలలోపు చిన్నారులు అంతుచిక్కని వ్యాధికి గురయ్యి ఆస్పత్రుల పాలవుతున్నారు.
P. Anand Mohan, Visakhapatnam, News18. Fevers Tension In Viskha Agency: ఆ గ్రామానికి ఏమైంది. అక్కడ నివసించాలి అంటేనే ప్రజలు భయపెడుతున్నారు. కొత్తగా పెళ్లైన వారు.. గర్భిణి స్త్రీలు అక్కడ ఉండేందుకు ససేమిరా అంటున్నారు. ఇంతకీ ఎందుకంతలా భయపడుతున్నారు. ఆ గ్రామం ఎక్కడ ఉంది.. విశాఖ ఏజెన్సీ (Visakha Agency)లో పరిస్థితి ఇది. పుట్టిన రెండు నుంచి ఆరు నెలల్లోపు చిన్నారులు అంతుచిక్కని వ్యాధితో మృత్యువాత పడుతున్నారు. గత రెండేళ్లలో 14 మంది ముక్కుపచ్చలారని చిన్నారులు ఆ ఒక్క గ్రామంలోనే మరణించడం కలవర పెడుతోంది. గ్రామానికి ఏదో అరిష్టం పట్టిందని అక్కడ ఉండడం మంచిది కాదని కొంతమంది వేరే ప్రాంతాలకు వలస వెళ్లిపోతున్నారు.
అరకులోయ (Araku Vally) నియోజకవర్గంలోని పెదబయలు మండలం మారుమూల రూఢకోట పంచాయతీ పాతరూఢకోట గ్రామంలో సుమారు 1000 మంది జనాభా నివసిస్తున్నారు. పాడేరు మాజీ ఎమ్మెల్యే లకే రాజారావు స్వగ్రామం ఇది. ఇక్కడ సుమారు 30 మంది వరకు ప్రభుత్వ ఉద్యోగులున్నారు. ఈ గ్రామంలో రెండేళ్లలో 14 మంది ముక్కుపచ్చలారని చిన్నారులు ఆరోగ్యంగా పుట్టిన నెల నుంచి ఆరునెలల వ్యవధిలో చనిపోయారు. వీరిలో గత ఆరు నెలల కాలంలో ఎనిమిది మంది మృత్యువాత పడగా, వారం వ్యవధిలో ఇద్దరు మృతిచెందారు.
అలా మరణిస్తున్న చిన్నారులంతా ఆరోగ్యంగా ఉండి ఒక్కసారిగా గిలగిలా కొట్టుకుంటూ కళ్లెదుటే చనిపోతుంటే ఆ తల్లిదండ్రులు అంతులేని వేదన అనుభవిస్తున్నారు. దీనిపై పలుమార్లు వైద్యశాఖ అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ గ్రామానికి కూతవేటు దూరంలోనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉంది. పుష్కలంగా ఆరోగ్య సిబ్బంది, వైద్య సేవలందుతున్నా అకస్మాత్తుగా పిల్లలు చనిపోతున్నారు. దీంతో ఇక్కడ ఉండటానికి చాలామంది ఆసక్తి చూపడం లేదు.
కడుపులో బిడ్డపడితే పక్క గ్రామాలకు వలస వెళ్లిపోతున్నామని పలువురు పేర్కొంటున్నారు. రెండేళ్ల కాలంలో పిల్లల్ని కోల్పోయిన వారిలో గ్రామానికి చెందిన వడ్డే గణేష్‌బాబు, కిముడు సింహాద్రి, వడ్డే చిన్నారావు, లకే బాలరాజు, కిముడు సురేష్‌కుమార్, మఠం సుధాకర్పడాల్, ముక్కి రమేష్ తదితరులున్నారు.
పాతరూఢకోటలో పిల్లలను కనాలంటేనే తల్లి దండ్రులు భయపడే పరిస్థితి నెలకొంది. గత రెండేళ్లలో 14 మంది బిడ్డలు చనిపోవడం చాలా బాధ కలిగిస్తోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు. అయితే బిడ్డ గర్భంలో ఉన్నప్పుడు తల్లి స్కానింగ్ చేయించుకోవడం లేదని.. వైద్యుల సూచనల మేరుకు క్రమం తప్పకుండా స్కానింగ్ చేస్తే సమస్య ఏదైనా ఉంటే తెలుస్తుందని వైద్యులు అంటున్నారు.
పాత రూఢకోటలో ఇప్పటివరకు మృతిచెందిన వారిలో ఒక్కరు కూడా స్కానింగ్ తీయించుకోలేదని చెబుతున్నారు. కడుపులో బిడ్డ పడగానే 3, 5, 7, 9 నెలల్లో స్కానింగ్ తీసుకుంటే లోపమేదో తెలుస్తుంది. ఇప్పటికైనా ఈ విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్త తీసుకోవాలని కోరుతున్నారు. అలాగే ఇక్కడ పిల్లల మరణాలపై సర్వే చేయించామని.. ముందస్తు ప్రసవాలు, చలి వాతావరణం, ఊపిరితిత్తుల్లో లోపం ఉంటే మరణాలు ఎక్కువగా సంభవిస్తాయి అంటున్నారు. ఇద్దరు పిల్లలను కోల్పోయినవారిని విశాఖ వెళ్లి జన్యుపరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నాం అంటున్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదిస్తాం.
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.