Home /News /life-style /

ANDHRA PRADESH NEWS DOG AND MONKEY STRONG FRIENDSHIP IN EAST GODAVARI DISTRICT NGS

Friendship: స్నేహమంటే ఇదేరా.. జాతి వైరం మరిచి సాయం చేసుకుంటున్న కోతి-కుక్క.. హద్దులు లేని ఫ్రెండ్ షిప్

కుక్కు కోతి స్నేహం

కుక్కు కోతి స్నేహం

Friendship: ఫ్రెండ్ షిప్.. ఈ ప్రపంచంలో ఇంతకన్న తియ్యని బంధం లేదంటారు.. స్నేహం చాలా స్వచ్ఛమైనది.. మనకు మనమే సృష్టించుకున్న అతి మధురమైన బంధం.. కష్టమొచ్చినా.. బాధ వచ్చినా నేను ఉన్నాను అంటూ నిలబడేదే స్నేహం.. అయితే కొన్ని జాతుల మధ్య మాత్రం శత్రుత్వం మాత్రమే ఉంటుంది ఫ్రెండ్ షిప్ ఉండదు.. కానీ అందుకు భిన్నంగా ఉన్న ఈ రెండింట్ ఫ్రెండ్ షిప్ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.

ఇంకా చదవండి ...
    Dog and Moneky Friendship: కష్టం వచ్చినా.. తోడు వచ్చినా మనకు అంటూ అండగా నిలిచేది ఫ్రెండ్ షిప్ (Friendship) ఒక్కటే.. నిజమైన స్నేహం అంటే అర్థం అదే.. సాధరణంగా మనకు ఉన్న బంధాల్లో అమ్మ, నాన్న, చెల్లి, తమ్ముడు, అన్న, అక్క, అత్త, పిన్ని, బాబాయ్, మామయ్య ఇలా చాలా బంధాలు మనకు మనం ఎంచుకున్నవి కాదు.. కానీ స్నేహ బంధం అలా కాదు.. ఎవరు ఎవరితోనైనా స్నేహం చేయొచ్చు.. ఆ స్నేహం నిజమైంది అయితే అన్ని బంధాలకన్నా కలకాలం స్ట్రాంగ్ గా నిలబడుతుంది. కొన్ని స్నేహాలు చివరి చూపు వరకు వీడిపోకుండా ఉంటాయి. మనుషుల్లో ఫ్రెండ్స్ (friends) చాలా కామన్.. మరి జంతువుల (Animals) విషయం ఏంటి. ముఖ్యంగా జాతి వైరం ఉన్న జంతువులు ఫ్రెండ్ షిప్ చేయడం చాలా కష్టం. కుక్క- పిల్లి, ఎలుక-పిల్లి, కుక్క- కోతి, ఇవి నిత్య శత్రువులు.. ఒక జీవికి మరో జీవి ఎదురు పడింది అంటే కొట్లాడుకోవడమే కాని ఫ్రెండ్ షిప్ చేయడం చాలా కష్టం. స్నేహమంటే లింగ బేధం ఉండదు, జాతి బేధం ఉండదు, కులం, మతం ఏదీ చూసుకోదు. సమస్త జీవకోటిలోనూ స్నేహ భావన కలుగుతుంది.

    ఎవరిమధ్య అయినా స్నేహం చిగురించ వచ్చుకానీ.. శత్రువుల మధ్య స్నేహం ఏర్పడితే దాన్ని వింతగానే చూస్తాం.. ముఖ్యంగా జంతువుల విషయంలో జాతి వైరం ఉన్నవి అసలు ఎదురెదురు పడితే కయ్యానికి కాలు దువ్వుతాయి. అలాంటి వాటి మధ్య ఫ్రెండ్ షిప్ అసలు మనం ఊహించలేం. కానీ ఎవరు ఊహించని విధంగా అలాంటి వాటి మధ్య అప్పుడప్పుడు ఫ్రెండ్ షిప్ ను మనం చూస్తూ ఉంటాం.. తాజాగా ఓ కుక్క (dog)- కోతి (Monkey) స్నేహం ఇప్పుడు హాట్ టాపిక్ గా నిలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) లోని తూర్పు గోదావరి జిల్లాలో వెలుగు చూసింది.



    జాతి వైరాన్ని పక్కన పెట్టిన కుక్క కోతి స్నేహం చేస్తున్నాయి. అది కూడా సాధారణ స్నేహం కాదు.. అసలు విడి విడిగా ఉండలేం అన్నట్టు ఆ రెండు కలియ తిరుగుతున్నాయి. వాటిని చూసిన వారంతా అసలు ఒక్క క్షణం కూడా విడివిడిగా ఉండడం లేదు అని ఆశ్చర్యపోతున్నారంట.. ఒకదాని వీపుపై మరొకటి ఎక్కి ఊరంగా తిరుగుతుంటే.. గ్రామస్తులు చూసి షాక్ అవుతున్నారు. కుక్క కోతి స్నేహం ఏంటని నోరువెళ్లబెడుతున్నారు.

    ఇదీ చదవండి : భక్తి పేరుతో రక్తి.. వన భోజనాలు అంటూ అశ్లీల నృత్యాలు.. పాఠశాల పూర్వ విద్యార్థుల నిర్వాకం

    సాధారణంగా కుక్క, కోతి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి ఉంటుంది. చాలా సార్లు ఆ రెండు ఎదురెదురుగా ఢీ కొన్ని ఘటనలు చాలా మంది చూసే ఉంటారు. కుక్క ని చూస్తే కోతి ఆమడ దూరం పరుగెడుతుంది. ఒక్కోసారి కుక్కకు చుక్కలు చూపిస్తుంది కోతి. ఏదైనా పొలాల్లో గాని, చెట్టు మీదకు గానీ కోతులు వస్తే వాటిని తరిమేందుకు కుక్కల్ని ఉసిగొల్పుతారు. కానీ ఇక్కడ మాత్రం సీన్ మొత్తం రివర్స్ లో కనిపిస్తోంది. ఎంతలా అంటే.. ఒకదానిని విడిచి మరొకటి ఉండలేనంతగా కలిసిపోయాయి ఈ రెండు..
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, Dog, East Godavari Dist, Monkeys, Viral Videos

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు