Home /News /life-style /

ANAND MAHINDRA GAVE 10 STAR RATING TO THIS INDIAN ARMY RUB KASHMIRI CADE RNK

ఈ కేఫ్‌కి ఆనంద్ మహీంద్రా 5, 7 కాదు.. ఏకంగా 10 స్టార్ రేటింగ్ ఇచ్చారు.. దాని ప్రత్యేకతేంటో తెలుసా?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా తన ట్విట్టర్ ఖాతాలో ఒక వీడియోను పంచుకున్నారు. అది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కశ్మీర్ లో ఉన్న గురేజ్ వ్యాలీలోని ఒక కేఫ్ గురించిన వీడియో అది. ఈ కేఫ్ మరెవరిదో కాదు ఇండియన్ ఆర్మీ ఆధ్వర్యంలో నడిచే కేఫ్. మరి దాని స్పెషాలిటీ ఏంటో తెలుసా...

ఇంకా చదవండి ...
ఆనంద్ మహీంద్రా ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) తన ట్విట్టర్ ఖాతాలో ఒక వీడియోను పంచుకున్నారు. ఇది భారత సైన్యం (Indian Army) నిర్వహిస్తున్న కాశ్మీరీ లాగ్ హట్ కేఫ్‌. దీనికి 5 లేదా 7 కాకుండా ఏకంగా 10 స్టార్ రేటింగ్ ఇచ్చారు. తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ రేటింగ్ ఇచ్చారు. బిజినెస్ టైకూన్ మహీంద్రా మాట్లాడుతూ 'నాకు సంబంధించినంత వరకు ఈ కేఫ్ 5 స్టార్ లేదా 7 స్టార్ కాదు, 10 స్టార్ డెస్టినేషన్ ఇవ్వాలి' అని క్యాప్షన్‌లో రాశారు. ఈ వీడియోలో గరీమా గోయల్ అనే అమ్మాయి ,ట్వీటర్ యూజర్  ఈ హోటల్ ప్రత్యేకతను చూపిస్తోంది. ఇక్కడ వాతావరణం, ఆహారం నిజంగా ఆకర్షణీయంగా ఉన్నాయి.



వీడియోను అప్‌లోడ్ చేసినప్పటి నుండి 5 లక్షలకు పైగా వీక్షించారు. దీనికి 19 వేలకు పైగా లైక్‌లు వచ్చాయి. చాలా మంది ఈ వీడియోను బాగా ఇష్టపడుతున్నారు. ఆనంద్ మహీంద్రా ఈ వీడియోను షేర్ చేసిన వెంటనే చాలా మంది కామెంట్స్ రాశారు. దాదాపు ప్రతి సరిహద్దు ప్రాంతంలోనూ భారత సైన్యం అన్ని సేవలను అందజేస్తోందని ఒక ట్వీట్టర్ యూజర్ రాయగా.. 'మా అరుణాచల్ ప్రదేశ్ టూరిస్టు ప్రదేశాల్లో సైన్యం నిర్వహించే దాదాపు అన్ని షాపింగ్ కాంప్లెక్స్‌లు, టూర్లు, కేఫ్ సేవలను మేము పూర్తిగా ఆస్వాదిస్తాము' అని ఒకరు రాశారు.

ఇది కూడా చదవండి:  ఈ చిత్రంలో ఏముందో చెప్పే సత్తా మీలో ఉందా? అయితే, మీకే ఈ సవాలు..!


మరొక వ్యక్తి , "అన్ని కొండ పట్టణాలలో 'మ్యాగీ పాయింట్' వంటి పేర్లతో ఉన్న చిన్న దుకాణాలను సందర్శించడం మర్చిపోకండి! వంటకాలు ఉత్తమమైనవి కాకపోయినా అక్కడి మనుషులు ఉత్తమవ్యక్తులు అని రాశారు.

మరోవ్యక్తి "నేను ఈ కేఫ్ గురించి విన్నాను. మీ ట్వీట్‌కి తగిన గౌరవంతో ఇది వెయ్యి నక్షత్రాల విలువతోపాటు దానికి తగిన గౌరవం పొందుతుందని నేను భావిస్తున్నాను. శుభాకాంక్షలు అని రాశాడు.

ఇది కూడా చదవండి: రక్తదానం చేస్తే.. కేన్సర్ వచ్చే ప్రమాదం తగ్గుతుందా? మరో 7 లాభాలు..!


విశేషమేమిటంటే..
ఈ లాగ్ హట్ కేఫ్‌గా ప్రసిద్ధి చెందిన ఈ అందమైన ప్రదేశం బందిపోరాకు సమీపంలో ఉన్న కాశ్మీర్‌లోని గురేజ్ వ్యాలీలో ఉంది. ఇండియన్ ఆర్మీ ఈ కేఫ్‌ను గురై వ్యాలీ ప్రజలకు అంకితం చేసింది. అందమైన వాతావరణంతో కూడిన ఈ అద్భుతమైన కేఫ్‌లో మీరు అందమైన క్షణాలను గడపవచ్చు అద్భుతమైన ఆహారాన్ని ఆస్వాదించవచ్చు.

చాలా చౌక...
కేఫ్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో ఇచ్చిన సమాచారం ప్రకారం ఇక్కడ ఆహారం చాలా చౌకగా ఉంటుంది. ఉదాహరణకు చిల్లీ పనీర్ కేవలం రూ. 150, నాన్ వెజ్ బిర్యానీ రూ. 180 ప్లేట్.

(Disclaimer: The information and information given in this article is based on general assumptions. news18 Telugu does not confirm the same. Please contact the relevant expert before implementing them)
Published by:Renuka Godugu
First published:

Tags: Anand mahindra, Indian Army, Kashmir, Twitter

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు