Dementia: ఈ యాప్ తో డిమెన్షియాకు చెక్.. నొప్పి ఎక్కడ ఉందో కచ్చితంగా తెలుసుకునే అవకాశం...

ప్రతీకాత్మక చిత్రం

మనసులో బాధను పైకి చెప్పకుండా లోలోపల తపన పడటాన్ని డిమెన్షియా అని అంటారు. తెలుగులో దీన్నే మతిభ్రంశం లేదా చిత్తవైకల్యం అని పిలుస్తారు. తాజాగా ఈ వ్యాధి స్థాయిని అంచనావేయడానికి కృతిమ మేధస్సు (AI)ను ఉపయోగించే యాప్ ను అభివృద్ధి చేశారు పరిశోధకులు.

  • News18
  • Last Updated :
  • Share this:
సాధారణంగా మనం బాధల్లో ఉన్నప్పుడు లేదా కష్టాల్లో ఉన్నప్పుడు ఇతరులతో పంచుకుంటే తగ్గుతాయి. కానీ వారితో మనకు మాటలు లేనప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఇలాంటి సమయంలో వారితో మన కష్టాన్ని పంచుకున్నప్పుడు బాధ మాట అలా ఉంచితే తప్పుగా అర్థం చేసుకునే అవకాశముంది. ఈ విధంగా మనసులో బాధను పైకి చెప్పకుండా లోలోపల తపన పడటాన్ని డిమెన్షియా అని అంటారు. తెలుగులో దీన్నే మతిభ్రంశం లేదా చిత్తవైకల్యం అని పిలుస్తారు. తాజాగా ఈ వ్యాధి స్థాయిని అంచనావేయడానికి కృతిమ మేధస్సు (AI)ను ఉపయోగించే యాప్ ను అభివృద్ధి చేసింది ఆస్ట్రేలియాకు చెందిన పెయిన్ చెక్ అనే అంకుర సంస్థ.

కేరర్ స్మార్ట్ ఫోన్ ఉపయోగించి ముఖ కదలికలు, ప్రవర్తన, మాటలు ప్రశ్నల సంబంధించి సమాధానం చెప్పేలా ఓ కేరర్ షార్ట్ వీడియోను రూపొందించారు. ఈ యాప్ కు సంబంధించిన కృత్రిమ మేధస్సు ఫేషియల్ మజిల్స్ కదలికలతో పాటు నొప్పి, బాధను అంచనా వేసి పరిశీలించారు. కంపెనీ ప్రకారం 180,000 కదలికల పరిశీలించి నొప్పిని 90 శాతం కచ్చితత్వంతో తెలుసుకోగలిగారు. ఇందులో ప్రపంచ వ్యాప్తంగా 66 వేల మంది పాల్గొన్నారు. అయితే ఈ యాప్ పెద్దవారి కోసం మాత్రమే డిజైన్ చేశారు.

నొప్పి స్థాయిలను నిర్ణయించడం..

సాధారణంగా తీవ్రమైన కమ్యూనికేషన్ లోపం, చిత్తవైకల్యం ఉన్న రోగుల్లో నొప్పిని అంచనావేయడం అనేది సంరక్షకులు, ఆరోగ్య నిపుణులు వారి ముఖ కవళికలను, ప్రవర్తనను గమనిస్తూ ఫలితాలను అబ్బే పెయిన్ స్కేలుపై ప్రామాణికంగా కొలిచారు. పశ్చిమ ఆస్ట్రేలియాలో కర్టిన్ వర్సిటీకి చెందిన శాస్త్రవేత్తల బృందం 2012లో పెయిన్ చెక్ ను ప్రారంభిచారు. పేపర్ బేస్డ్ మదింపులకు మంచి ప్రత్యామ్నాయం కనుగొనాలని వారు కోరుకున్నారు.

వ్యక్తి ముఖం భావోద్వేగాలను డీకోడ్ చేయడం మానవులకు చాలా కష్టం అని పెయిన్ చెక్ వ్యాపార అభివృద్ధి డైరెక్టర్ పీటర్ షెర్గిల్ వివరించారు. కాబట్టి ఈ యాప్ ద్వారా పరిశోధనల ఆధారంగా ముఖాన్ని డీకోడ్ చేయడాన్ని కృత్రిమ మేధనస్సు, అల్గారిథమ్లను వర్తిస్తుంది. 2017లో జర్నల్ ఆఫ్ అల్జీమర్స్ డిసీజ్ లో ప్రచురించిన పెయిన్ చెక్ అధ్యయనం ప్రకారం ఈ యాప్ నొప్పి ఉనికికి నమ్మదగిన సాక్ష్యాలను అందించినట్లు కనుగొంది. ఈ టెక్నాలజీ ఐరోపా, ఆస్ట్రేలియా, కెనడా మెడికల్ డివైజ్ గా వర్గీకరించారు. ప్రతి నివాసికి 4 డాలర్లు చొప్పున నెలవారీ సభ్యత్వంగా గృహాలను సంరక్షించడానికి అందించబడుతుంది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ విశ్వవ్యాప్తంగా 50 మిలియన్ల మందికి చిత్తవైకల్యం ఉందని అంచనా వేసింది. ప్రతి ఏటా దాదాపు 10 మిలియన్ల కొత్త కేసులు వస్తున్నాయి. చిత్తవైకల్యంతో బాధపడుతున్న వారిలో 80 శాతం మంది నర్సింగ్ హోమ్స్ లో ఉన్నారని 2012 అధ్యయనం అంచనా వేసింది. విశ్వవ్యాప్తంగా చిత్తవైకల్యంతో బాధపడే వ్యక్తుల్లో నొప్పిని అంచనా వేయడం అంత బలంగా లేదని షెర్గిల్ చెప్పారు. చిత్తవైకల్యంతో నివసించే ప్రజల్లో నొప్పి గుర్తించకపోయినట్లయితే లేదా చికిత్స చేయించుకోకపోతే ఇది కష్టసాధ్యమైన ప్రవర్తనల్లో వ్యక్తమవుతుంది.

అనంతరం ప్రజలు యాంటిసైకోటిక్ మందులతో నియంత్రించడానికి ప్రయత్నిస్తారు. ఇది మరింత ప్రమాదాలను తీసుకొస్తుంది. రెండేళ్ల విచారణలో భాగంగా పెయిన్ చెక్ ను స్వీకరించడానికి 2019లో ఆస్ట్రేలియా ప్రభుత్వం దేశంలోని కేర్ హోమ్స్ కోసం 5 మిలియన్ల ఆస్ట్రేలియన్ డాలర్లు కేటాయించింది. కేర్ హోమ్స్ లో ప్రజలు బాధ, జీవన నాణ్యత, ఆరోగ్య ఫలితాల నిర్ధారణను మెరుగుపరచడం దీని లక్ష్యం అని ఆస్ట్రేలియా మంత్రి రిచర్డ్ కోల్బెక్ చెప్పారు.

భావాలను వివరించడం..

ప్రపంచవ్యాప్తంగా 722 కేర్ హోమ్స్ లో దీని సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నట్లు పెయిన్ చెక్ తెలిపింది. గత ఆగస్టులో ఇది యూకేలో ప్రారంభించబడింది. ఇక్కడ ఇప్పటివరకు 1000 మంది రోగులు దీన్ని ఉపయోగించారు. పాలీ రౌలీ అనే యూకేలో 24 పడగల గృహాన్ని కలిగి ఉన్నాడు. పెయిన్ చెక్ దాదాపు ఏడాది నుంచి దీన్ని ఉపయోగిస్తోంది. తన నివాసితుల్లో 20 మందికి చిత్తవైకల్యం ఉందని పాలీ అన్నారు. మాట్లాడటంలో ఇబ్బంది ఉన్నవారు ఎలాంటి అనుభూతి చెందుతున్నారో తప్పనిసరిగా చెప్పలేరు. తద్వారా తరచూ వారి భావాలను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఎవరికైనా నొప్పి ఉందో లేదో త్వరగా గుర్తించడానికి ఈ యాప్ సహాయకరంగా ఉంటుందని తెలిపారు.

నొప్పి లేకుండా ఉండాలంటే పెయిన్ చెక్ యాప్ ముఖ్యమైన సాధనం. మహిళలు పదే పదే అనవసరంగా మందులు వేయకుండా నిరోధించడానికి ఈ యాప్ ను ఉపయోగించవచ్చుని రౌలి తెలిపాడు. చిత్తవైకల్యమున్న మహిళ తమ దగ్గర ఉందని, తరచూ బాధను వ్యక్తపరుస్తుంటుందని చెప్పాడు. అయితే వాస్తవానికి ఆమెకున్నది నొప్పికాదని, నిరాశ మరియు ఆందోళన అని స్పష్టం చేశాడు. ఇందుకోసం తాము పెయిన్ చెక్ ను ఉపయోగించినట్లు స్పష్టంచేశాడు.

అన్ని రకాల ప్రజలు వారి బాధలను తెలియజేయడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చెందుతోంది. యూఎస్ఏ.. మాక్సీ టెక్ జియా పైన్ అనే యాప్ ను అభివృద్ధి చేసింది. ఇది శరీరం 3డీ చిత్రం ద్వారా బాధ ఎక్కడ ప్రారంభమవుతుందనే విషయాన్ని కచ్చితంగా గీయడానికి అనుమతిస్తుంది. పెయిన్ చెక్ ఇతర సమూహాలను లక్ష్యంగా చేసుకొని ఉత్పత్తులను అభివృద్ధి చేయాలని చూస్తోంది. మూడు ఏళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లలో నొప్పిని గుర్తించడానికి ఓ యాప్ అభివృద్ధి చేయడంలో సహాయపడటానికి ఇది మెల్ బోర్న్ లోని ఓ ఆసుపత్రిలో పరిశోధనలు చేస్తోంది.
Published by:Srinivas Munigala
First published: