ఉసిరి రసం (Amla juice) ప్రతిరోజూ తాగడం వల్ల వెయిట్ పెరగకుండా ఉండటమే కాదు, ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది.ఇండియన్ గూస్బెర్రీగా పేరున్న ఉసిరిలో (Amla juice) పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీంతో కొన్ని రకాల వ్యాధులకు చెక్ పెట్టొచ్చు. ఈ ఉసిరిలో విటమిన్ సీ ఉండటంతో బలవర్ధకమైన యాంటీఆక్సిడెంట్స్ (antioxidants) ఉంటాయి. దీన్ని అలాగే పచ్చిగానే తీసుకుంటారు. లేకపోతే ఎండినవి కూడా తింటారు. అమ్లా జ్యూస్, మురబ్బాగా కూడా తింటారు.
పోషకాహార నిపుణులు ఈ ఉసిరితో జలుబు, దగ్గును తగ్గించుకునే పర్ఫెక్ట్ హోం రెమిడీ అని సిఫార్సు చేస్తున్నారు. ఇది మెటబాలిజం రేటును పెంచడంతోపాటు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఉసిరి తినడం వల్ల ఆకలిని తగ్గిస్తుంది. ఇందులో కేలరీస్ కూడా తక్కువగా ఉంటాయి. మొత్తానికి ఇది బరువు తగ్గించుకోవాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.
ఇది కూడా చదవండి: పునీత్ రాజ్‌కుమార్ టీవీ ప్రయాణంపై ఓ లుక్!
ఉసిరి తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..
ఉసిరికాయను తినడం వల్ల శరీరంలోని చెబు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. ఉసిరిలో క్రోమీయం ఎక్కువగా ఉంటుంది. ఇవి బ్యాడ్ కొలెస్ట్రాల్‌కు చెక్ పెడతాయి.
యాంటీ ఏజింగ్..
ఉసిరిలో పుష్కలంగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం వల్ల చాలా రోగాలను తగ్గిస్తుంది. ఇందులో ఉండే ర్యాడికల్స్ ఏజింగ్, రింకిల్స్‌ను సమస్యను తగ్గిస్తాయి. ప్రతిరోజు ఉసిరి రసం తాగడం వల్ల ఏజింగ్ సమస్యను తగ్గిస్తుంది. చర్మ రోగాలను తగ్గిస్తుంది.
ఇది కూడా చదవండి: కార్డియాక్ అరెస్ట్ అంటే ఏంటి? వ్యక్తికి అందించాల్సిన తక్షణ చికిత్స!
జీర్ణక్రియ..
మీకు జీర్ణ సంబంధిత సమస్యలు ఉంటే ఆమ్లా మంచి ఆప్షన్. ఇందులో ఉండే రిచ్ ఫైబర్ జీర్ణక్రియకు ప్రభావవంతంగా సహాయపడుతుంది. ఏదైనా పేగు సమస్యల నుంచి మిమ్మ ల్ని దూరంగా ఉంచుతుంది. ఉసిరితో మీ పేగు కదలికలు చక్కగా ఉంటాయి.
ప్రతి ఒక్క మహిళ తన చర్మ సౌందర్యాన్ని నేచరల్‌గా మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తుంది. ప్రతిరోజూ ఆమ్లా జ్యూస్ తాగడం వల్ల మీ ముఖం కాంతివంతమవుతుంది. బ్లెమిషెస్ సమస్యలు తగ్గుతాయి. ఉసిరి మాస్క్ పెట్టుకోవడం వల్ల నిర్జీవంగా ఉన్న చర్మం మెరుపు సంతరించుకుంటుంది.
ఉసిరి వల్ల గుండె సంబంధిత సమస్యలకు దూరంగా ఉండవచ్చు. ప్రతిరోజూ ఉసిరి రసం లేదా దానికి సంబంధించిన ఏ ఫుడ్‌ను తిన్నా.. సమర్థవంతంగా రక్తాన్ని గుండె ఇతర శరీర భాగాలకు పంప్ చేస్తుంది. కొలెస్ట్రాల్ తయారవ్వకుండా ఉంటుంది. మీరు తరచూ ఉసిరిని తినడం వల్ల హార్ట్స్ట్రోక్, హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం కూడా తక్కువగానే ఉంటుంది.
ఉసిరి రసం తయారీ విధానం..
ఉసిరి కాయల నుంచి విత్తనాలను తీసేసి జ్యూసర్లో వేసుకోవాలి. వీటిని స్మూత్‌గా బ్లెండ్ చేసుకోవాలి. ఆ తర్వాత స్ట్రెయిన్ చేసుకుని గోరువెచ్చని నీటిలో కలుపుకోవాలి. నిపుణుల ప్రకారం 30 ఎంఎల్ ఆమ్లా జ్యూస్‌కు 20 ఎంఎల్ గోరువెచ్చటి నీటిని కలుపుకోవాలి. దీన్ని పరగడుపున తీసుకోవాలి.
ప్రతిరోజూ తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య లాభాలు ఉంటాయి. ఇది మిమ్మల్ని డిటాక్స్ చేసి త్వరగా బరువు తగ్గడానికి సహాయపుడతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: HOME REMEDIES