#Breaking: హెచ్-1బీ విధానం అమలు..ఇక నుంచి వీసా జారీలో అమెరికా చదువుకి యమా క్రేజ్..

కొత్త హెచ్-1బీ విధానానికి అమెరికా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతో.. అమెరికాలో చదువుకున్న విదేశఈయులకు హెచ్-1బీ వీసాలు దక్కించుకునే అవకాశం పెరిగింది.

Amala Ravula | news18-telugu
Updated: January 31, 2019, 10:03 AM IST
#Breaking: హెచ్-1బీ విధానం అమలు..ఇక నుంచి వీసా జారీలో అమెరికా చదువుకి యమా క్రేజ్..
ప్రతీకాత్మక చిత్రం
Amala Ravula | news18-telugu
Updated: January 31, 2019, 10:03 AM IST
2020 ఆర్థిక సంవత్సరానికి అమెరికా ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో కొత్త హెచ్-1బీ విధానం ఆమోదించింది. దీంతో.. అక్కడ చదువుకునే విదేశీయులకు హెచ్-1బీ వీసాలు దక్కించుకునే అవకాశం 16శాతం పెరిగింది.
తమ దేశంలో చదువుకునే ప్రతిభావంతులని ప్రోత్సహిస్తూ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కొన్ని వారాల క్రితమే ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో అమెరికా ఇమిగ్రేషన్ విభాగం డైరెక్టర్ వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ట్రంప్ చె్పిన విధానాన్ని అమల్లోకి తీసుకొస్తున్నట్లు తెలిపారు.
ఇప్పటివరకూ విదేశీ ఉద్యోగులకు సాధారణ హెచ్-1బీ వీసాలు 65వేలు, అమెరికాలో ఉన్నత విద్య చదువుకున్నవారికోసం మరో 20వేల హెచ్-1బీ వీసాలు అదనంగా మంజూరు చేస్తున్నారు. ప్రస్తుత పద్ధతిలో అమెరిక ఉన్నత విద్య ఉన్న దరఖాస్తుదారులను పక్కన పెట్టి మొదట 65వేల సాధారణ హెచ్-1బీ వీసాలకు లాటరీ తీస్తున్నారు. ఆ తర్వాత అమెరికాలో ఉన్నత చదువులు చదివిన వారికోసం మరో 20వేల విడిగా లాటరీ తీస్తున్నారు. దాంతో ఉన్నత విద్య చదివిన విదేశీయులు అవకాశాం కోల్పోతున్నారు.

అయితే, అమెరికాలో వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన హెచ్-1బీ వీసా దరఖాస్తులు ఈ ఏడాది ఏప్రిల్1 నుంచి స్వీకరిస్తారు. అందులోనుంచి మొత్తం 85వేల వీసాలకు అమెరికాలో ఉన్నత విద్య అభ్యసించిన వారు పోటీ పడతారు. దీంతో, హెచ్-1బీ వీసా దొరికే అవకాశం 16 శాతం పెరుగుతుంది. అంతేకాదు, 5340మంది అమెరికా ఉన్నత విద్యావంతులకు కొత్తగా అవకాశం లభిస్తుంది.

ఈ వీడియో కూడా చూడండి..


First published: January 31, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...