చాలా మంది ఇంటి పరిశుభ్రతపై ఉన్న శ్రద్ధ, బాత్రూమ్లపై(Bathroom) చూపరు. నిజానికి ఈ అంశాన్ని చాలా సీరియస్‌గా(Serious) తీసుకోవాలి. బాత్రూమ్ రూపాన్ని మరింత మెరుగుపరచడానికి అనేక ప్రొడక్ట్స్(Products) అందుబాటులో ఉన్నాయి. అయితే తాజాగా ఇలాంటి యాక్సెసరీస్‌పై భారీ ఆఫర్స్ ప్రకటించింది ఈకామర్స్(E Commerce) దిగ్గజం అమెజాన్(Amazon). ప్రస్తుతం 50 శాతం వరకు డిస్కౌంట్‌తో(Discount) లభిస్తున్న బాత్రూమ్ యాక్సెసరీస్(Bathroom Accessories) ఏవో చూద్దాం.
* యాంటిక్ సోప్ డిష్
యాంటిక్ సోప్ డిష్‌తో బాత్రూమ్కి పురాతన కాలం టచ్‌ను జోడించవచ్చు. మిక్స్డ్ మెటీరియల్‌తో దీన్ని తయారు చేశారు. పైగా పర్యావరణ పరిరక్షణతో పాటు ఎక్కువ కాలం మన్నికగా ఉంటుంది. సులభంగా శుభ్రం చేసుకోవచ్చు. ఇది మీ బాత్రూమ్ రూపాన్ని కూడా మెరుగుపరుస్తుంది. దీని ధర రూ. 2499 కాగా, అమెజాన్‌లో కేవలం రూ.854 వద్ద అందుబాటులో ఉంది.
* ఫోల్డింగ్ టవల్ ర్యాక్
అమెజాన్‌లో లభిస్తున్న స్టెయిన్లెస్ స్టీల్ టవల్ ర్యాక్ నికెల్ క్రోమ్ మిర్రర్ ఫినిషింగ్‌తో వస్తుంది. హై గ్రేడ్ స్టెయిన్లెస్ స్టీల్‌తో తయారుచేయడంతో ఎక్కువ రోజులు మన్నిక వస్తుంది. దీనికి 4 హుక్స్ ఉంటాయి. దీని ధర రూ.5149 కాగా, ప్రస్తుతం రూ.1799కే బెస్ట్ డీల్‌తో అమెజాన్‌లో అందుబాటులో ఉంది.
* డబుల్ లేయర్ బాత్రూమ్ షెల్ఫ్
వీటిని స్టెయిన్లెస్ స్టీల్‌తో తయారు చేయారు. బేరింగ్ సామర్థ్యం కారణంగా ఇది అత్యంత మన్నికైనది. వంటగదిలో మసాలా బాటిళ్లను ఉంచడానికి కూడా దీన్ని ఉపయోగించవచ్చు. బాత్రూమ్లో టవల్‌ను వేలాడదీయడానికి హుక్స్ను ఉపయోగించవచ్చు. షాంపూ, కండీషనర్, షవర్ జెల్ వంటి వస్తువులను స్టోరేజ్ షెల్ఫ్‌లలో ఉంచుకోవచ్చు.అలాగే జుట్టు సంరక్షణ సామాగ్రి, మేకప్ కిట్‌ను భద్రపర్చుకోవచ్చు. దీని ధర 3999 కాగా, అమెజాన్‌లో రూ.1165తో బెస్ట్ డీల్‌తో సొంతం చేసుకోవచ్చు.
* సోప్ హ్యాండ్ వాష్ డిస్పెన్సర్
ABS ప్లాస్టిక్ మెటీరియల్‌తో తయారు చేసిన హ్యాండ్ వాష్ డిస్పెన్సర్స్‌ను అనేక రకాలుగా ఉపయోగించుకోవచ్చు. లోషన్ డిస్పెన్సర్‌గా, షాంపూ డిస్పెన్సర్‌గా కూడా ఉపయోగించవచ్చు. ఇది సాధారణ బాక్స్-ఫిట్-లాక్ మెకానిజంతో వస్తుంది. అవసరమైనప్పుడు రీఫిల్ చేయవచ్చు. దీని ధర రూ. 1349 కాగా, అమెజాన్‌లో కేవలం రూ.521కే అందుబాటులో ఉంది.
* ట్రాన్స్పరెంట్ గ్లాస్ షెల్ఫ్
దీన్ని 8 మిమీ పారదర్శక గాజుతో తయారు చేయడంతో ఎక్కువ కాలం మన్నికగా ఉంటుంది. దీని రెయిలింగ్‌లు స్క్రాచ్ రెసిస్టెంట్, రస్ట్ ప్రూఫ్ హెవీ డ్యూటీ ఇత్తడితో తయారు చేశారు. దీన్ని వంటగది, బాత్రూమ్ లోని మూలల్లో సులభంగా సెట్ చేసుకోవచ్చు. ఇది ఆధునిక నార్డిక్ శైలితో ఉంటుంది. ఈ ప్యాకేజీలో 3 ముక్కల గ్లాస్ కార్నర్ షెల్ఫ్ ఉంటుంది. దీని ధర 2298 కాగా, అమెజాన్ డీల్ ద్వారా కేవలం రూ.999 కే కొనుగోలు చేయవచ్చు.
* మైక్రోఫైబర్ యాంటీ స్కిడ్ బాత్ మ్యాట్స్
వీటిని 100 శాతం అధిక నాణ్యతతో పాలిస్టర్ నూలుతో తయారు చేశారు. ఈ మ్యాట్స్ సూపర్ సాఫ్ట్ అనుభూతితో మరింత సౌకర్యంగా అనిపిస్తాయి. డెనియర్ థ్రెడ్‌తో తయారు చేయడంతో ఇవి అద్భుతంగా నీటిని శోషించుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. దీని ధర రూ.749 కాగా, అమెజాన్ డీల్ ద్వారా కేవలం రూ.284కే సొంతం చేసుకోవచ్చు.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.