ఉల్లిపాయ తొక్కలతో ప్రయోజనాలు... అవేంటో తెలిస్తే, తొక్కలు అస్సలు పారేయరు...

Benefits of Onion Peel : ఉల్లిపాయలు రేటు ఎక్కువగా ఉంటే... జాగ్రత్తగా వండుకుంటాం. తక్కువగా ఉంటే లైట్ తీసుకుంటాం. అయితే మనలో చాలా మంది ఉల్లి తొక్కలను పారేస్తూ ఉంటాం. నిజానికి వాటితో చాలా ప్రయోజనాలున్నాయి. అవేంటో తెలుసుకుందాం.

Krishna Kumar N | news18-telugu
Updated: March 20, 2019, 11:30 PM IST
ఉల్లిపాయ తొక్కలతో ప్రయోజనాలు... అవేంటో తెలిస్తే, తొక్కలు అస్సలు పారేయరు...
ప్రతీకాత్మక చిత్రం
Krishna Kumar N | news18-telugu
Updated: March 20, 2019, 11:30 PM IST
జుట్టుకు ఎంతో మేలు : జుట్టు రాలుతున్నా, చుండ్రు సమస్య ఉన్నా... ఉల్లి తొక్కల్ని వాడేసుకోవాలి. ఎలా అంటే, ఉల్లి తొక్కల్ని మెత్తగా నూరి, తలకు పట్టించాలి. పావుగంట తర్వాత అంతగా పవర్ ఉండని, సాధారణ షాంపూతో స్నానం చెయ్యాలి. ఇది ఎంత బాగా పనిచేస్తుందంటే... జుట్టు సమస్యలకు ఉల్లిపాయలు, తొక్కలు అద్భుతంగా పనిచేస్తాయని పరిశోధనల్లో తేలింది. ఉల్లిలోని సల్ఫర్... పాడైన, సన్నబడిన వెంట్రుకల్ని బలంగా చేస్తుంది. తెల్ల జుట్టును గోధుమ, బంగారం రంగులోకి మార్చుతుంది.

దోమలకు చెక్ : సాయంత్రం అవ్వగానే ఇంట్లోకి దోమలు వస్తున్నాయా? ఓ గిన్నెలో నీరు పోసి, వాటిలో ఉల్లిపాయ తొక్కలు వేసి కిటికీలు, గుమ్మాల దగ్గర పెడితే దోమలు అటు నుంచీ అటే పోతాయి. వాటికి ఉల్లిపాయల వాసన, ఘాటు పడదు. వేరే ఇల్లు చూసుకుంటాయి.

నొప్పుల్ని తరిమేస్తాయి : ఉల్లి తొక్కల్ని రాత్రంతా నీటిలో నానబెట్టి మర్నాడు ఆ నీటితో నొప్పులు ఉన్న చోట రాస్తే నొప్పులు త్వరగా తగ్గుతాయి. ఆ నీటిని చర్మానికి రాసి అరగంట తర్వాత స్నానం చేస్తే చర్మ సమస్యలు తొలగిపోతాయి.

చెడు కొలెస్ట్రాల్‌కి మూడినట్లే : ఉల్లి తొక్కలతో సూప్ చేసుకోవచ్చు. అది తాగితే చాలు... బాడీలో చెడు కొలెస్ట్రాల్ పెట్టే బెడా సర్దుకొని బయటకు పోతుంది. అది పోయిందంటే... అధిక బరువు తగ్గి, సన్నగా, చక్కటి శరీర ఆకృతి వస్తుంది. ఫలితంగా గుండె హ్యాపీగా ఉంటుంది. అంతేకాదు... ఆనియన్ సూప్... ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడుతుంది.కాళ్ల మంటలు, గాయాలకు మందు : కొంతమందికి గాళ్లు వాపు ఎక్కుతాయి. లేదా మంట పెడతాయి. అలాంటి వాళ్లు ఉల్లి తొక్కల్ని 10 నుంచీ 20 నిమిషాలు నీటిలో మరగబెట్టాలి. ఆ తొక్కల్ని తీసేసి, నీటిని టీ లాగా తాగేయాలి. నిద్రపోయే ముందు ఇలా చేస్తే మంచిది. నాలుగైదు రోజుల్లో గాయాలు మటుమాయం అవుతాయి.

తొక్కలే మొక్కలకు మందు : పై విధంగా వాడిన తొక్కల్ని చివరిగా పారేయకుండా... గులాబీ, ఇతర పూలు పూసే మొక్కల కాండాల చుట్టూ ఉంచాలి. అది ఎరువు (కంపోస్ట్)లా మారి మొక్కలకు ప్రాణం పోస్తుంది.

 
Loading...
ఇవి కూడా చదవండి :

యూట్యూబ్ ద్వారా డబ్బు సంపాదించడం ఎలా... ఇలా చెయ్యండి

రోజుకు 3 ఖర్జూరాలు చొప్పున వారం తినండి... మీకు కలిగే చక్కటి ప్రయోజనాలు ఇవి...

ఒక్క తులసి మొక్కను పెంచినా చాలు... ఆరోగ్యమే ఆరోగ్యం

వేడి నీరు, నిమ్మరసంతో అద్భుతమైన 9 ప్రయోజనాలు
First published: March 20, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...