Health Benefits of Copper: రోజు రాగి పాత్రలో నీరు తాగడం వల్ల ఏమౌతుందో తెలుసా!

Health Benefits of Copper: రోజు రాగి పాత్రలో నీరు తాగడం వల్ల ఏమౌతుందో తెలుసా!

copper water

రాత్రంతా రాగి పాత్రలో నిల్వ ఉంచి వాటిని ఉదయాన్నే తాగడం వల్ల కఫ, వాత, పిత్త దోషాలను రాకుండా ఉంటాయి. శరీరంలోని వివిధ అవయవాల పనితీరు మెరుగుపడుతుంది. 

  • Share this:
    పూర్వ కాలంలో  వాడే పద్దుతులు  మన అరోగ్యానికి ఎంతో మెలు చేస్తాయి, ముఖ్యంగా  రాగి పాత్రలలో నీటిని తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ విషయాన్ని చాలా పరిశోధనల్లో వెల్లడైంది. రాగి పాత్రల్లో నీరు సహజంగానే శుద్ధి అవుతుంది. వాటిలోని సూక్ష్మజీవులు నాశనం అవుతాయి. ఆ పాత్రలోని నీరు తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలను ఓ సారి  చూద్దాం...

    రాత్రంతా రాగి పాత్రలో నిల్వ ఉంచి వాటిని ఉదయాన్నే తాగడం వల్ల కఫ, వాత, పిత్త దోషాలను రాకుండా ఉంటాయి. శరీరంలోని వివిధ అవయవాల పనితీరు మెరుగుపడుతుంది.  రాగి పాత్రలోని నీరు కడుపులో మంట తగ్గిస్తుంది. జీర్ణవ్యవస్థలో ఏర్పాడే అల్సర్లు తగ్గడానికి, వాటి పనితీరు మెరుగవడానికి ఇది సహకరిస్తుంది. కాలేయం, కిడ్నీల పనితీరు మెరుగుపరుస్తుంది. ఆహారంలోని పోషకాలు శరీరానికి అందుతాయి. బరువు తగ్గాలనుకునే వారు రాగి పాత్రలో నిల్వ ఉంచిన నీటిని తాగడం ప్రయోజనకరం.

    శరీరంలోని కొవ్వు కరగడానికి, జీర్ణక్రియ పనితీరు మెరగుపడటానికి రాగి పాత్రలోని దోహదం చేస్తాయి. ఆ నీటి ప్రభావం వల్ల తనకు అవసరమైన వాటిని మాత్రమే ఉంచుకొని మిగతా వాటిని శరీరం బయటకు పంపుతుంది. గాయాలు త్వరగా మానడానికి కూడా ఇది ఉపకరిస్తుంది. శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ బలోపేతం చేస్తుంది. వృద్ధాప్య ఛాయలు త్వరగా రాకుండా కాపాడుతుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడే ఔషదం రాగి పాత్రలో నిల్వ ఉంచిన నీటిలో ఉంటుంది.

    రాగి పాత్రలను ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలు 

    జీర్ణ వ్యవస్థ పని తీరును మెరుగుపరుస్తోంది
    బరువు తగ్గటంలో తొర్పడుతుంది
    వేగంగా గాయాలను నయం చేస్తుంది
    వృద్ధాప్యం తొందరగా రాదు
    గుండె ఆరోగ్యాన్ని పెంచి రక్తపోటును కంట్రోల్ చేస్తుంది :
    క్యాన్సర్‌తో పోరాడుతుంది
    బాక్టీరియాని నాశనం చేస్తుంది
    మెదడును చురుకుగా పని చేసేలా చూస్తుంది
    థైరాయిడ్ గ్రంధి పనిని అదుపులో ఉంచుతుంది
    కీళ్ళనొప్పులు నివారిస్తోంది
    చర్మ ఆరోగ్యం పెంచి మెలనిన్ ఉత్పత్తికి తొర్పడుతుంది
    రక్తహీనత అరికడుతుంది
    Published by:Rekulapally Saichand
    First published: