హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

చిటికెడు ఆవాలు.. బోలెడు మేలు.. ఎన్ని ప్రయోజనాలో తెలుసా..

చిటికెడు ఆవాలు.. బోలెడు మేలు.. ఎన్ని ప్రయోజనాలో తెలుసా..

ఆవాలు

ఆవాలు

Health Tips : శరీరంపై ఏర్పడే కురుపులు, దురదలకు ఆవ పొడితో చెక్ పెట్టవచ్చు. ఆవ మిశ్రమాన్ని వాటిపై రాయడం ద్వారా అవి తగ్గిపోతాయి.ఆవ పొడిని తేనెతో కలిపి తీసుకుంటే శ్వాసకోశ సమస్యలు కూడా తగ్గుముఖం పడుతాయి.

    కూరలకు తాళింపు పెట్టేటప్పుడు పోపు దినుసుగా ఆవాలను ప్రతీ ఇంట్లో వాడుతారు. ఆవాల వల్ల రుచి, వాసన మాత్రమే కాదు బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పంటినొప్పితో బాధపడేవారికి ఆవాలు దివ్య ఔషధం. గోరు వెచ్చని నీటిలో కాసిన్ని ఆవాలు వేసి.. ఆ నీటిని పుక్కిలిస్తే పంటి నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. అలాగే శరీరంపై ఏర్పడే కురుపులు, దురదలకు ఆవ పొడితో చెక్ పెట్టవచ్చు. ఆవ మిశ్రమాన్ని వాటిపై రాయడం ద్వారా అవి తగ్గిపోతాయి.ఆవ పొడిని తేనెతో కలిపి తీసుకుంటే శ్వాసకోశ సమస్యలు కూడా తగ్గుముఖం పడుతాయి.కీళ్ల నొప్పులతో బాధపడేవారికి కూడా ఆవాలు మంచి ఔషధంగా పనిచేస్తాయి. ఆవాల ముద్దను, కర్పూరంతో కలిసి కీళ్లపై రాసుకుంటే నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.చర్మంపై ఏర్పడే పులిపిర్లను తొలగించడానికి కూడా ఆవ పొడి బాగా పనిచేస్తుంది. ఆవ పొడిని మెత్తని మిశ్రమం చేసి దాన్ని పులిపిర్లపై రాయడం ద్వారా అవి ఎండిపోయి రాలిపోతాయి.

    First published:

    Tags: Health benifits, Mustard oil, Mustard seeds

    ఉత్తమ కథలు