Egg health benefits: గుడ్లు తినడం ఒక కళ.. అది న్యూట్రిషనిస్టులు చెప్పే వేళ.. అదేంటో తెలుసుకోండి.

ప్రతీకాత్మక చిత్రం

కొన్ని నివేదికలు తెలిపిన ఆశ్చర్యకర నిజాలు ఏమిటంటే.. ఈ గుడ్డు పచ్చసొనతో బరువు తగ్గే గుణం ఉందట. అందుకే ఇకపై ఎగ్‌ ఎల్లోను తీసేయకుండా.. తినండి అంటున్నారు నిపుణులు.

  • Share this:

Egg benefits: గుడ్డు (Egg) లోని పచ్చసొనలో కోలిన్‌ ఉంటుంది. ఇది జీవక్రియను నియంత్రిస్తుంది. బరువు తగ్గడానికి కారణమవుతుంది. అందుకే ఇకపై ఎగ్‌ తింటే ఎల్లోను పక్కకు తీసిపెట్టకండి. గుడ్డు.. ఇందులో ఉండే ప్రోటీన్స్‌ విటమిన్స్‌ వల్ల ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఇమ్యూనిటీ బూస్ట్‌ Immunity boost  అవుతుంది.


అంతేకాదు దీంతో జలుబును వంటి అనారోగ్య సమస్యలను కూడా తగ్గించుకోవచ్చు.కొందరు గుడ్లలో ఉండే ఎల్లో పార్ట్‌ను తీసేసి కేవలం వైట్‌ ఎగ్‌ను మాత్రమే తింటారు.


ప్రపంచంలో అనేక దేశాల్లో గుడ్డు సాధారణ, ప్రసిద్ధి చెందిన బ్రేక్‌ఫాస్ట్‌. గుడ్లతో వేర్వేరు రెసిపీలు తయారు చేస్తారు. దీన్ని చాలా మంది ఇష్టపడతారు. కొందరు గుడ్లను ఉడకబెట్టి తినడానికి ఇష్టపడతారు.మరికొందరు గిలకొట్టిన గుడ్డును అంటే ఆమ్లెట్‌ వంటివి తినడానికి ఇష్టపడతారు.
మీరు గుడ్డును ఎలా తీసుకుంటున్నారు అనేది ముఖ్యం కాదు. ంఎదకంటే అది మీ రోజువారీ ఆహారంలో భాగం. కానీ, మీ శరీరంలోకి ఎలా, ఎంత ప్రోటీన్‌ను అందిస్తుందనేది ముఖ్యం.

ఇది కూడా చదవండి: కృత్రిమ ఐల్యాషస్‌ వాడితే.. కళ్లకు ఇంత డేంజరా..?

డైటీషియన్, పోషకాహార నిపుణులు న్మామి అగర్వాల్‌ గుడ్లను తినడం వల్ల కలిగే లాభాలను ఇన్‌స్టాగ్రాంలో షేర్‌ చేశారు. ఫన్‌ ఫ్యాక్ట్‌.. గుడ్డులోని అనేక పోషకాలు పచ్చసొనలో ఉంటాయి. గుడ్డులోని తెల్లసొన, పచ్చసొన పూర్తిగా తినడం వల్ల ప్రోటీన్‌ ఫ్యాట్, కేలరీల సమతుల్యతను అందిస్తుంది.
ఎగ్స్‌ చాలా మందికి సంపూర్ణంగా సంతృప్తి చెందడానికి అనుమతినిస్తుంది.

గుడ్లను సూపర్‌ ఫుడ్స్‌గా పరిగణిస్తారు. న్యూట్రాసీ లైఫ్‌స్టైల్‌ వ్యవస్థాపకుడు, పోషకాహార నిపుణుడు డాక్టర్‌ రోహిణి పాటిల్‌ అభిప్రాయం ప్రకారం గుడ్డు అన్ని రకాల పోషకాలతో సమృద్ధిగా ఉంటుంది. వీటిలో చాలా వరకు మోడ్రన్‌ ఫుడ్‌లలో లభించదు.

ఇది కూడా చదవండి:  పండగవేళ.. ఇంటిని తక్కువ టైంలోనే క్లీన్‌ చేసుకోవచ్చు!



గుడ్డులో ఉండే పోషకాలు..
విటమిన్‌ ఏ– 6 శాతం
విటమిన్‌ బీ5– 7 శాతం
విటమిన్‌ బీ12– 9 శాతం
ఫాస్ఫరస్‌– 9 శాతం
విటమిన్‌ బీ2– 15 శాతం
సెలీనియం– 22 శాతం.
కాబట్టి ప్రతిరోజూ గుడ్డు తినడం అత్యవసరం. అయితే, దాని తయారీని పరిగణనలోకి తీసుకోవడం కూడా చాలా ముఖ్యం.
Published by:Renuka Godugu
First published: