• HOME
  • »
  • NEWS
  • »
  • LIFE-STYLE
  • »
  • AMAZING HEALTH BENEFITS OF TOMATO SOUP HERE IS HOW TO PREPARE NK

Tomato Soup: టమాట సూప్‌తో ఆరోగ్యం...తయారు చేయడం ఎలా?

Tomato Soup: టమాట సూప్‌తో ఆరోగ్యం...తయారు చేయడం ఎలా?

ప్రతీకాత్మక చిత్రం

Tomato Soup: మన ఇళ్లలో టమాటాల్ని రోజూ వంటల్లో వాడుతూనే ఉంటాం. ఈసారి స్పెషల్‌గా టమాట సూప్ తాగి చూడండి... ఆరోగ్యానికి మేలు అంటున్నారు డాక్టర్లు.

  • Share this:
    Tomato Soup : టమాటాలు ఆరోగ్యానికి ఎంతో మంచివని మనకు తెలుసు. టమాట సూప్ కూడా ఆరోగ్యానికి మేలని చెప్పుకోవాల్సిన పనిలేదు. చల్లటి వాతావరణంలో గోరు వెచ్చగా ఉండే సూప్‌ని అలా అలా తాగుతుంటే... ఒంట్లో వేడి చేరి... ఎంతో ఉపశమనం కలుగుతుంది. అందులో కాస్త కరకరలాడే చిప్స్, ఇతరత్రా స్నాక్స్ కూడా వేసుకుంటే ఆ టేస్టే వేరు. నిజానికి టమాటో సూప్ తాగడం ఎంతో మంచిది. టమాటా సూప్‌లో ఫైబర్, పొటాషియం, విటమిన్స్ A, C, K, కాపర్, సెలెనియం ఉంటాయి. పొటాషియం ఎక్కువగా ఉండే టమోటోను మన ఆహారంలో చేర్చుకుని...ఉప్పును తగ్గిస్తే గుండె సంబంధిత వ్యాధులకు దూరంగా ఉండొచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. గుండె ఆరోగ్యంతో పాటు చర్మ సౌందర్యం, బరువు తగ్గడానికి  టమోటో సూప్ దోహదపడుతుంది.  ఇంకా ఇది వీర్య కణాలు పెంచుతుంది. రక్త ప్రసరణ వ్యవస్థ, కండరాల పనితీరును మెరుగు పరుస్తుంది. ఎముకలు పటిష్టంగా ఉండేలా చేస్తుంది. థైరాయిడ్ గ్రంథి చక్కగా పనిచేసేలా చేస్తుంది. క్యాన్సర్ బారినపడకుండా ఉండేందుకు టమాటో ఉపయోగపడుతుంది.

    ఇంకా  మధుమేహంతో బాధపడే వారు తమ రక్తంలో చక్కర స్థాయిని అదుపులో ఉంచుకునేందుకు కూడా ఇది ఉపయోగపడుతంది. దీన్ని తయారుచేసుకోవడం కూడా ఎంతో తేలిక. మూడే మూడు స్టెప్స్‌లో అయిపోతుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ వీలైనప్పుడల్లా టమాట సూప్ తయారుచేసుకొని... తాగేయమంటున్నారు డాక్టర్లు.

    tomato soup, tomato soup for kids, tomato soup recipe, tomato soup preparation, tomato rasam, tomato rice, టమాటో సూప్, టమాటో సూప్ తయారీ విధానం, టమాటో సూప్ తయారీ, టమాటో రసం, టమాటో అన్నం
    టమాటో సూప్(ప్రతీకాత్మక చిత్రం)


    టమాట సూప్ తయారీ : మంచి టమాటాల్ని ఎంచుకోవాలి. ఆర్గానిక్ టమాటాలు లేదా విదేశాల నుంచీ దిగుమతి చేసుకునే రోమా టమాటాలైతే భలే ఉంటాయి. లోకల్ టమాటాలు కూడా అదిరిపోయే టేస్ట్ ఇస్తాయి. ఆ టమాటాల్ని నీటిలో ఉడకబెట్టాలి. తర్వాత చల్లటి నీటిలో నానబెట్టాలి. తర్వాత వాటి స్కిన్ (తొక్క) తొలగించడం తేలిక. మరో రకమైన టేస్ట్ కావాలనుకుంటే... టమాటాల్ని రోస్ట్ (వేపుడు) చెయ్యవచ్చు.

    ఇప్పుడు ఓ పాన్‌లో బట్టర్ (వెన్న) వేసి... కొన్ని ఉల్లిపాయల ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు వేసి వేపాలి. ఇప్పుడు టమాటాల్ని ముక్కలు చేసి వెయ్యాలి. కొంత నీరు పొయ్యాలి. ఇప్పుడు చికెన్ లేదా కూరగాయలు వేసి... 40 నిమిషాలపాటూ ఉడికించాలి. ఇప్పుడు చూస్తే... నైస్‌గా, క్రీమీగా ఉన్న సూప్ రెడీ.
    Published by:Krishna Kumar N
    First published:

    అగ్ర కథనాలు