హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Red Rice Health : ఎర్ర బియ్యంతో ప్రయోజనాలు... తెలిస్తే అవే తింటారు

Red Rice Health : ఎర్ర బియ్యంతో ప్రయోజనాలు... తెలిస్తే అవే తింటారు

ఎర్ర బియ్యం (credit - twitter - Elizabeth and Sanjeev Kapoor)

ఎర్ర బియ్యం (credit - twitter - Elizabeth and Sanjeev Kapoor)

Indian Red Rice : ఇవో ప్రత్యేకమైన బియ్యం. దంపుడు బియ్యం వేరు. ఇవి వేరు. ఆంథోక్యానిన్ అనే పదార్థం వల్ల ఈ బియ్యం ఎరుపు రంగులో ఉంటాయి.

Indian Red Rice Health Benefits : రైస్ నచ్చని వాళ్లు దాదాపు ఉండరు. ఎన్నిసార్లు తిన్నా బోర్ కొట్టని ఆహారం అన్నమే. ఐతే... అన్నం ఎక్కువగా తింటే... బరువు పెరిగే ప్రమాదం ఉంటుంది. అదే రెడ్ రైస్‌ విషయంలో అలా జరగదు. చూడటానికి ఎరుపు రంగులో ఉండే ఈ బియ్యం... తినేటప్పుడు బాదం, జీడిపప్పులా... కాస్త మెత్తగా ఉంటాయి. పాలిష్ చేసిన (తెల్ల బియ్యం)తో పోల్చితే వీటిలో ఎక్కువ పోషకాలు ఉంటాయి. రక్తాషలీ (Raktashali), థాయ్ రెడ్ కార్గో రైస్ (Thai Red Cargo Rice), బూటాన్ రెడ్ రైస్ (Bhutanese Red Rice), ఫ్రాన్స్‌లో పండే కామార్గ్ రెడ్ రైస్ (Camargue Red Rice), కేరళలో పండే మట్టా రైస్ (Kerala Matta Rice)... ఇవన్నీ రెడ్ రైస్‌లో రకాలు. కేరళలోని పాలక్కడ్‌లో పండే మట్టా రెడ్ రైస్... శ్రీలంకలో కూడా ఫేమస్సే. అందువల్ల రెడ్ రైస్ ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.

ఫైబర్ ఎక్కువ : రెడ్ రైస్‌లో ఫైబర్ బాగా ఉంటుంది. కప్పు బియ్యంలో... 8 గ్రాముల ఫైబర్ ఉంటుంది. ప్రతీ వ్యక్తికీ రోజూ 8 గ్రాముల ఫైబర్ అవసరం. వైట్ రైస్‌లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ. ఎరుపు బియ్యంలో అవి తక్కువే. అందువల్ల ఎర్ర బియ్యం తినేవారికి మల బద్ధకం సమస్యే ఉండదు. అలాగే డయాబెటిస్, గుండె జబ్బులు, అధిక బరువు సమస్యలు రావు.

బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ : ఎర్రబియ్యంలో బ్లడ్ షుగర్‌ను తగ్గించే గుణాలు ఎక్కువగా ఉన్నాయి. బ్లడ్‌లో షుగర్ లెవెల్స్ తగ్గితే... ఇన్సులిన్ బాగా ఉత్పత్తి అవుతుంది. అది సరిగా ఉత్పత్తి అయితే... షుగర్ వ్యాధి వచ్చే సమస్య ఉండదు. అందువల్ల డయాబెటిస్ కంట్రోల్‌లో ఉండాలంటే... ఎర్ర బియ్యం సరైనవి.

గుండెకు మేలు, కొలెస్ట్రాల్‌కు చెక్ : బ్లడ్‌లో కొలెస్ట్రాల్ లెవెల్స్‌ని తగ్గించే శక్తి ఎర్ర బియ్యానికి ఉంది. ఎప్పుడైతే చెడు కొవ్వు తగ్గుతుందో... గుండెకు రక్త సరఫరా సరిగ్గా సాగుతుంది. అంటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఎర్రబియ్యంలోని మెగ్నీషియం... బీపీని క్రమబద్ధీకరిస్తుంది. అందువల్ల బీపీ వచ్చేవారికి తరచూ వచ్చే హార్ట్ ఎటాక్... ఈ రైస్ తినేవారికి పెద్దగా రాదు.

అధిక బరువుకు చెక్ : ఎర్రబియ్యంలో ఫైబర్ ఎక్కువగా ఉండటంతో... అది అధిక బరువు రాకుండా చేస్తుంది. ఎర్రబియ్యాని మనం ఎక్కువగా తినం. కొద్దిగా తినగానే... పొట్ట ఫుల్ అయిన ఫీల్ కలుగుతుంది. ఐతే... ఈ రైస్ ఎక్కువ ఎనర్జీ ఇస్తుంది. అంతకంటే కావాల్సింది ఏముంది.

ఫుల్లుగా ఐరన్ లభ్యం : ఎర్రబియ్యంలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. శరీరంలో ఆక్సిజన్ వేళ్లేందుకు ఐరన్ అవసరం. సరిగా ఐరన్ లేని బాడీ... ఆక్సిజన్‌ను సరిగా తీసుకోలేదు. ఊరికే అలసిపోతారు. వ్యాధినిరోధక శక్తి కూడా తగ్గిపోతుంది. అందుకే ఎర్ర బియ్యం మనం తినాలి. పుష్టిగా ఉండాలి. కొడితే గోడలు బద్ధలైపోవాలి.

విటమిన్ బీ6 లభ్యం : బీ6 విటమిన్ గ్రూప్ మనకు చాలా అవసరం. కానీ అది ఎక్కడబడితే అక్కడ, ఎందులో బడితే అందులో దొరకదు. DNAలో ఎర్రరక్త కణాలు తయారవ్వాలంటే ఈ విటమిన్ కావాలి. మన ఆర్గాన్లు చక్కగా పనిచెయ్యాలంటే ఇది కావాలి. ఇంకా చాలా ప్రయోజనాలు ఈ గ్రూప్ విటమిన్లతో వస్తాయి. కాబట్టి ఎర్రరైస్ తినడం బెటర్.

యాంటీఆక్సిడెంట్స్ లభ్యం : రెడ్ రైస్‌లో ఆంథోసియానిన్, మాంగనీస్, జింక్ ఉంటాయి. ఇవన్నీ మన బాడీలో విషవ్యర్థాల్ని వెంటపడి తరుముతాయి. ఏవైనా సూక్ష్మక్రిములు బాడీలోకి రావాలని చూస్తే... ఎంట్రీ గేట్ దగ్గరే అడ్డుకొని... బయటకు పంపేస్తాయి. అందువల్ల మన బాడీలో కణాలు హాయిగా, హ్యాపీగా ఉంటాయి. అందువల్ల మన చర్మం త్వరగా ముడుతలు పడదు. కాన్సర్ వంటి రోగాలు రావు. గాయాలు త్వరగా తగ్గిపోతాయి. బ్రెయిన్ అద్భుతంగా పనిచేస్తుంది. అన్నీ లాభాలే.

ఎముకలకు ఎంతో మంచివి : రెడ్ రైస్‌లో కాల్షియం, మాంగనీస్ ఉంటాయి. అవి ఎముకల్ని పుష్టిగా, గట్టిగా, బలంగా, పటిష్టంగా మార్చేస్తాయి. అప్పుడు ఎముకలు చిట్లే, పగిలే, బీటలొచ్చే ప్రమాదం ఉండదు. ముసలితనంలో అస్థియోపోరోసిస్ వ్యాధి సోకదు.

మెనోపాజ్ తర్వాత మహిళలు చాలా బాధ, నొప్పిని అనుభవిస్తారు. వాళ్లు ఎర్ర బియ్యం తింటే ఉపశమనం పొందుతారు. ఆస్తమా నుంచీ రిలీఫ్ పొందేందుకు కూడా ఎర్ర బియ్యం ఉపయోగపడతాయి. తిరిగి నార్మల్‌గా ఊపిరి పీల్చుకునే పరిస్థితి వస్తుంది. సో... ఇన్నాళ్లూ వైట్ రైస్ తింటున్న మనం... క్రమంగా రెడ్ రైస్ వైపు మళ్లితే మంచిదే. ఐతే... మన రైతులు కూడా ఎర్ర బియ్యాన్ని ఎక్కువగా పండిస్తే... అది తక్కువ రేటుకు దొరికే అవకాశం ఉంటుంది. ఇప్పటికైతే... ఆన్‌లైన్‌లో ఈ రెడ్ రైస్ కేజీ రూ.100కు పైనే ఉన్నాయి.

First published:

Tags: Health benefits, Health Tips, Telugu news, Telugu varthalu, Tips For Women, Women, Women health

ఉత్తమ కథలు