హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Health Benefits of Radish: ముల్లంగి తింటున్నారా... మీకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవీ...

Health Benefits of Radish: ముల్లంగి తింటున్నారా... మీకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవీ...

ముల్లంగితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

ముల్లంగితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

Health Benefits of Radish: మనలో చాలా మంది వారంలో ఏ రోజు ఏం తినాలో ఓ చార్ట్ పెట్టుకుంటారు. అందులో ఉన్నవి మాత్రమే తింటుంటారు. ఫలితంగా వాళ్లు ముల్లంగి లాంటి అరుదైన కూరగాయల్ని తినే అవకాశం కోల్పోతుంటారు. కానీ ఆరోగ్య నిపుణులు ముల్లంగి వల్ల కలిగే ఎన్నో అద్భుత ఆరోగ్య ప్రయోజనాల్ని చెబుతున్నారు. అవేంటో తెలుసుకుందాం.

ఇంకా చదవండి ...

ముల్లంగి అనేది ఓ కూరగాయ మాత్రమే కాదు. ఇందులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. అందువల్ల దీన్ని మనం తింటుండాలి. పెద్దవాళ్లు చాలా మందికి అర్ష మొలలు, ఉబ్బసం, దగ్గు, ఆస్తమా, ముక్కు, చెవి, గొంతు నొప్పులతో బాధపడుతుంటారు. వాళ్లు ముల్లంగి తింటే ఎంతో మేలు. ముల్లంగిలో గ్లూకోసైడ్, ఎంజైములతోపాటూ... ఆకలిని పెంచి... మలబద్ధకాన్ని దూరం చేసే గుణాలు ఉన్నాయి.

- తిన్న ఆహారం జీర్ణం అవ్వకుండా ఇబ్బంది పడేవాళ్లు... భోజనం తర్వాత ముల్లంగిలో మిరియాల పొడి కలిపి తినేయాలి. ఎలాగంటే... ముల్లంగిని చిన్న చిన్న ముక్కలు చేసి, అందులో మిరియాల పొడి, నిమ్మరసం వెయ్యాలి. కాస్త ఉప్పు కూడా వేసుకొని... రోజుకు మూడు సార్లు తింటే చాలు. మలబద్ధకం, అర్ష మొలలు, ప్లీహం, కామెర్ల వంటి అడ్డమైన సమస్యలూ దూరమవుతాయి.

- విటమిన్లు, పొటాషియం, ఐరన్ లాంటి ఖనిజాలు ఎక్కువగా ఉండే... ముల్లంగి ఆకుల్ని నీటిలో ఉడకబెట్టి... అందులో నాలుగైదు నిమ్మరసం చుక్కలు వేసి... తాగితే... మూత్ర సంబంధ మంట తగ్గుతుంది.

- కొంతమంది ఊపిరి తిత్తుల్లో ఏదో ఉన్నట్లు మాటిమాటికీ దగ్గుతూ ఉంటారు. కారణం బ్రాంకైటిస్ అనే సమస్య. వాళ్లు ముల్లంగి జ్యూస్‌లో కొద్దిగా తేనె కలిపి తాగేయాలి.

- కొంతమంది అబ్బాయో, అమ్మాయో అర్థం కాదు. తేడాగా కనిపిస్తుంటారు. ఆ నపుంసకత్వం తొలగిపోవాలంటే ముల్లంగి గింజల్ని, ఆవు పాలలో మరిగించి... వాటిని తాగాలి. తద్వారా లైంగిక శక్తి పెరగడమే కాదు... శీఘ్రస్కలన సమస్య కూడా పోతుంది.

- కిడ్నీల్లో సమస్యలు ఉండేవాళ్లు... రోజుకు ఒకసారి 100ఎంఎల్ ముల్లంగి ఆకుల రసం తాగాలి. అప్పుడు హైబీపీ, శరీర వాపులకు కారణమయ్యే నెఫ్రైటీస్, కిడ్నీలకు వచ్చే డియురెటిక్ (Diuretic) సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. పచ్చి రసం తాగలేని వారు తేనె కలుపుకొని తాగొచ్చు.

- అధిక బరువు ఉన్నవారు, డయాబెటిస్‌తో బాధపడేవారు ముల్లంగి కూర తింటే మేలు జరుగుతుంది. ఆకలి తగ్గుతుంది.

- ముల్లంగి గింజల్ని నీటిలో నానబెట్టి... గుజ్జులా చేసి... శరీరంపై గజ్జి, పొక్కులు ఉన్న చోట రాస్తే... అవి తగ్గిపోతాయి. అవే గింజల్ని పొడిచేసి... నీళ్లలో కలిపి... రాత్రి తాగితే... కడుపులో పురుగులు, క్రిముల వంటివి చనిపోతాయి.

- ముల్లంగి గింజల్ని బాగా నూరి... ఫేస్‌ మాస్క్‌లా రాసుకొని... గంట తర్వాత నీటితో కడుక్కుంటే... ముఖంపై మచ్చలు, మొటిమలు, చారల వంటివి తొలగిపోతాయి.

First published:

Tags: Health benifits, Health Tips, Tips For Women, Women health

ఉత్తమ కథలు