హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Health Tips : గసగసాలతో ఆరోగ్య ప్రయోజనాలు... తెలిస్తే తప్పక వాడతారు

Health Tips : గసగసాలతో ఆరోగ్య ప్రయోజనాలు... తెలిస్తే తప్పక వాడతారు

గసగసాలతో ఆరోగ్య ప్రయోజనాలు

గసగసాలతో ఆరోగ్య ప్రయోజనాలు

Health Benefits of Poppy seeds : మనం వంటల్లో వాడే గసగసాల్ని లైట్ తీసుకోవడానికి వీల్లేదు. తప్పనిసరిగా వాడే వాటిలో ఈ సుగంధ ద్రవ్యాలు కూడా ఉన్నాయి.

తెల్లగా, చిన్నగా ఉండే గసగసాల్ని ఈ రోజుల్లో మనం వంటల్లో వాడుతున్నాంగానీ... పూర్వం వాటిని మందుల తయారీలో వాడేవాళ్లు. మిగతా సుగంధ ద్రవ్యాలలాగే గసగసాలు కూడా చాలా ముఖ్యమైనవి. వాటితో కలిగే ప్రయోజనాలు తెలియక చాలా మంది... మిగతా మసాలా ఐటెమ్స్ కొనుక్కుంటారు కానీ, గసగసాల్ని కొనేందుకు అంతగా ఇష్టపడరు. ఇప్పుడవి కొనకపోతే, కూర టేస్ట్ మారిపోతుందా అని అనుకుంటారు. ఐతే... గసగసాలు కూరలకు ఎంతో టేస్ట్ ఇస్తాయి. కుర్మా లాంటి వాటిలో గసగసాల్ని వేయడం ద్వారా ప్రత్యేక రుచి, కమ్మదనం వస్తుంది. ఈ రోజుల్లో ప్రతీదీ పొడుల రూపంలో వచ్చేస్తున్నా, చిన్నగా ఉండే గసగసాలు మాత్రం పొడిలా కాకుండా అవి ఎలా ఉన్నాయో, అలాగే ప్యాకింగ్‌లో దొరుకుతున్నాయి. మరి గసగసాలతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం.

గసగసాలతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు :

* కిడ్నీల్లో రాళ్లు ఏర్పడకుండా చేసే శక్తి గసగసాలకు ఉంది. వీటిలో ఉండే ఆక్సలేట్లు... కాల్షియంను గ్రహించి, రాళ్లు ఏర్పడకుండా చేస్తాయి.

* మలబద్దకాన్ని తగ్గిస్తాయి. గసగసాల్లో ఫైబర్ (పీచు పదార్థం) ఎక్కువ. ఇది పేగులు బాగా కదిలేలా చేస్తుంది. తద్వారా మలబద్దకాన్ని తగ్గిస్తుంది.

* నిద్రకు మేలు. కొంతమందికి సరిగా నిద్ర పట్టదు. అలాంటి వారు గసగసాలు తీసుకోవాలి. రోజు పడుకునే ముందు వేడి పాలలో గసగసాల పేస్ట్‌ను కొద్దిగా కలిపి తాగితే చాలు... చక్కటి నిద్ర వచ్చేస్తుంది.

* శ్వాస సమస్యలకు చెక్. గసగసాలు ఎక్స్పెక్టోరెంట్, సిమల్సేంట్ (నయం చేసే గుణాలు) గుణాలు కలిగి ఉన్నాయి. అందువల్ల ఇవి శ్వాస సంబంధిత సమస్యల్ని తగ్గిస్తాయి. దగ్గు, ఆస్తమా వంటివి తగ్గుతాయి.

* గుండె సమస్య ఉన్నవారు గసగసాలు లైట్‌గా ఫ్రై చేసి, షుగర్ కలిపి మార్నింగ్, ఈవెనింగ్ హాఫ్ స్పూన్ (అర చెంచాడు) తీసుకొంటే గుండె హాయిగా ఉంటుంది.

* గసగసాలు చలవ చేస్తాయి. శరీరంలో వేడి ఎక్కువగా ఉంటే గసగసాలు వాడొచ్చు.

* కడుపులో మంట, ఎసిడిటీ వున్న వారు గసగసాల్ని వాడితే పేగులలో అల్సర్లు, పుండ్ల వంటివి తగ్గుతాయి.

గసగసాలతో ఈ ప్రయోజనాలు ఉన్నాయి కదా అని వీటిని మరీ ఎక్కువగా వాడటం మాత్రం మంచిది కాదు. గసగసాలు ఎక్కువగా తింటే, మగవాళ్లలో స్పెర్మ్ కౌంట్ తగ్గిపోతుంది. లైంగిక సామర్థ్యం దెబ్బతింటుంది.


ఇవి కూడా చదవండి :

ఎంతకీ బరువు తగ్గలేకపోతున్నారా?... రోజూ ఇది తాగండి... తేడా కనిపిస్తుంది... ప్రకృతి వరం

ఉల్లిపాయ తొక్కలతో ప్రయోజనాలు... అవేంటో తెలిస్తే, తొక్కలు అస్సలు పారేయరు...

రోజుకు 3 ఖర్జూరాలు చొప్పున వారం తినండి... మీకు కలిగే చక్కటి ప్రయోజనాలు ఇవి...

గుండెను కాపాడే చేమదుంపలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు...

ఉదయాన్నే వెల్లుల్లి తింటే... అద్భుతమైన ప్రయోజనాలు... ఇలా చెయ్యండి...

First published:

Tags: Health Tips, Tips For Women, Women health

ఉత్తమ కథలు