Oregano Health Benefits : ఒరెగానో అనేది ఓ చిన్న సైజు మొక్క. ఇది ఎంత మంచిదంటే... దీనికి అద్భుతమైన ఔషధ గుణాలున్నాయి. చక్కటి సువాసనతోపాటూ... రోగాల్ని నయం చేసే శక్తి దీని సొంతం. ఒరెగానోలో 40కి పైగా రకాలున్నాయి. వాటిలో ఒరిగానమ్ వల్గారే (Origanum vulgare) అత్యంత శక్తిమంతమైనది. పశ్చిమ ఆసియాలో పెరిగే ఈ మొక్క తాజా ఆకులు లేదా ఎండిన ఆకుల్ని... చికెన్, మటన్, ఆకుకూరలు, అన్ని రకాల వంటల్లోనూ వాడితే... మంచి ఫ్లేవర్తోపాటూ... రోగాలకూ చెక్ పెట్టినట్లవుతుంది. ఇదే ఒరెగానో ఆకుల నుంచీ తైలం (నూనె, ఆయిల్) కూడా తీస్తున్నారు. దాన్ని కూడా రకరకాల రోగాలు నయం చేసేందుకు వాడుతున్నారు. ఇప్పుడీ మొక్క కావాలంటే మనం పశ్చిమ ఆసియా దేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఆన్లైన్ ఈ-కామర్స్ సైట్లలో ఈ మొక్కల ఎండిన ఆకులు, తైలాన్ని అమ్ముతున్నారు. సరే ఇప్పుడు మనం ఈ మొక్క ఆకులతో కలిగే ప్రయోజనాల్ని తెలుసుకుందాం.
✨SINUS : add 4 drops of oregano oil in a hot water and sniff it under a towel, so macam you’re steaming your face. It helps with my sinus esp when you’re sneezing non stop, it helps to relieve ? pic.twitter.com/3TjFM4YXsN
— Shekin D. ✨ (@Shxkin) December 13, 2019
- ఒరెగానో ఆకులు... 23 రకాల చెడు బ్యాక్టీరియా అంతు చూస్తాయి. కూరల్లో, ఫ్లైల్లో ఈ ఆకుల్ని కొద్దిగా వేసుకుంటే చాలు... ఇవి పొట్టలోకి వెళ్లి... అక్కడి విష వ్యర్థాలను తరిమేస్తాయి.
- మన చర్మ కణాల్ని కాపాడే శక్తి ఈ ఆకులకు ఉంది. వీటిలో ఫైబర్, విటమిన్ కె, మాంగనీస్, ఐరన్, విటమిన్ ఇ, ట్రైప్టోఫాన్, కాల్షియం ఉన్నాయి. అందువల్ల ఇవి మనకు ఎంతో ఆరోగ్యకరం.
- కాన్సర్, గుండె జబ్బుల అంతు చూసే ఈ ఆకుల వల్ల మనకు ఎన్నో పోషకాలు లభిస్తాయి. వీటిలో కేలరీలు చాలా తక్కువ.
- ఎండిన ఆకుల్ని గ్లాస్ కంటైనర్లలో నిల్వ చేసుకోవాలి. కాలం గడిచే కొద్దీ సువాసన తగ్గినా... హెల్త్ పరంగా కలిగే ప్రయోజనాలు మాత్ర అలాగే ఉంటాయి.
- గొంతు గరగరగా ఉన్నా, జీర్ణక్రియ సరిగా లేకపోయినా, వికారంగా ఉన్నా, ముక్కు దిబ్బడ ఉన్నా, గొంతు మంటగా ఉన్నా... ఒరెగానో ఆకుల్ని వాడతారు. త్వరగా ఫలితం కావాలంటే ఒరెగానో తైలాన్ని కప్పు గోరు వెచ్చటి నీటిలో ఒకట్రెండు చుక్కలు వేసి... తాగేయడమే.
- ఒళ్లు నొప్పులు, కీళ్ల నొప్పులు ఉన్న చోట... ఈ తైలాన్ని రాస్తే... ఫలితం కనిపిస్తుంది.
- చలికాలంలో వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్లపై పోరాడే శక్తి ఒరెగానో ఆకులకు ఉంది.
ఇది కూడా చదవండి:Vastushastra: ఖర్చులు పెరుగుతున్నాయా... వెంటనే ఆ వస్తువుల్ని వదిలించుకోండి
- బాడీలో వేడిని తగ్గించే గుణాలు కూడా ఇందులో ఉన్నాయి. బాడీలో వేడి పెరిగే కొద్దీ గుండె సమస్యలు, డయాబెటిస్ వంటి ఇతర సమస్యలకు దారితీస్తుంది. అందువల్ల ఇలాంటి ఆకుల్ని కూరల్లో వేసేసుకుంటే... ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Health, Telugu news, Telugu varthalu