హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Lemon Peel Benefits: నిమ్మకాయ తొక్కలతో ఎన్నో ప్రయోజనాలు... ఇలా చెయ్యండి

Lemon Peel Benefits: నిమ్మకాయ తొక్కలతో ఎన్నో ప్రయోజనాలు... ఇలా చెయ్యండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Lemon Peel: మనం చాలా పండ్లు, కూరగాయలను తొక్కలు తీసేసి తింటాం. ఆ తొక్కల్ని పారేస్తాం. కానీ... కొన్ని సందర్భాల్లో ఆ తొక్కలతో చాలా ప్రయోజనాలుంటాయి. నిమ్మకాయ తొక్కలతో ఉపయోగాలేంటో తెలుసుకుందాం.

నిమ్మకాయలు ప్రతి ఇంట్లో కామన్. ఎందుకంటే... రోజూ ఏదో ఒక అవసరానికి అవి ఉపయోగపడుతూ ఉంటాయి. కూరల్లో, డ్రింక్స్‌లో ఇలా వాడే నిమ్మకాయల్ని రసం పిండేశాక... తొక్కల్ని పారేస్తున్నాం. ఎందుకంటే... ఆ తొక్కలతో కలిగే ప్రయోజనాలు మనకు తెలియవు కాబట్టి. కానీ... సైంటిస్టులు ఊరుకోరు కదా... నిమ్మకాయ తొక్కలతో కలిగే ప్రయోజనాలేంటో వాళ్లు కనిపెట్టారు. ఎందుకంటే నిమ్మకాయ తొక్కల్లో... ఎన్నో బయోయాక్టివ్ కాంపౌండ్స్ ఉన్నాయి. అవి చాలా శక్తిమంతమైనవి. సింపుల్‌గా చెప్పాలంటే... నిమ్మకాయ తొక్కల్లో చాలా పోషకాలుంటాయి. టేబుల్ స్పూన్ (6 గ్రాముల) తొక్కల్లో... 3 కేలరీలు, 1 గ్రాము కార్బొహైడ్రేట్స్, 1 గ్రాము ఫైబర్, 9 శాతం విటమిన్ సీ ఉంటాయని పరిశోధనల్లో తేలింది. నిమ్మ తొక్కల్లో కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం కూడా చిన్న మొత్తాల్లో ఉంటాయి.

నిమ్మకాయ తొక్కల్లో ఉండే D లైమొనెన్ అనే పదార్థం... గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటిస్‌ను తగ్గించగలవని పరిశోధనల్లో తేలింది. అమెరికాలో చాలా మంది హైబీబీ, హై కొలెస్ట్రాల్, అధిక బరువు వల్ల వచ్చే గుండె జబ్బులతో చనిపోతున్నారు. నిమ్మ కాయ తొక్కలు... అధిక బరువును తగ్గించడమే కాదు... బీపీ కూడా కంట్రోల్ అవుతోంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గేందుకు కూడా ఇవి ఉపయోగపడుతున్నాయి. అంతెందుకు... ద్రాక్ష పళ్లలో ఉండే యాంటీఆక్సిడెంట్స్ కంటే... నిమ్మకాయ తొక్కల్లోనే ఎక్కువ యాంటీఆక్సిడెంట్స్ ఉంటాయట. నిమ్మకాయ తొక్కను పీల్చితే చాలు... ఆ వాసన వల్ల స్ట్రెస్ రిలీఫ్ కలుగుతుంది.

నిమ్మకాయ తొక్కల్లో పెక్టిన్ అనే పదార్థం ఉంటుంది. అది కూడా చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తోంది. మన లివర్‌లో బైల్ యాసిడ్స్ బాగా రిలీజయ్యేలా చేస్తుంది. అది కొలెస్ట్రాల్ అంతు చూస్తుంది.

ఈ రోజుల్లో అత్యంత ప్రమాదకరంగా మారిన కాన్సర్ వ్యాధితో పోరాడటంలోనూ నిమ్మకాయ తొక్కలు బాగా పనిచేస్తున్నాయని తేలింది. నిమ్మ తొక్కల్లోని విటమిన్ సి... తెల్ల రక్త కణాల సంఖ్య పెరిగేలా చేస్తోంది. మీకు తెలుసు కదా... తెల్ల రక్త కణాలు కాన్సర్ కణాల అంతు చూస్తాయి. D లైమొనెన్ కూడా... పొట్టలో వచ్చే కాన్సర్‌తో పోరాడుతోంది.

గాల్ బ్లాడర్‌లో కొంత మందికి రాళ్లు ఏర్పడుతూ ఉంటాయి. వాటిని నయం చేయాలంటే కూడా... నిమ్మ తొక్కలు ఉపయోగపడుతున్నాయి. గాల్ బ్లాడర్‌లో రాళ్లు ఉన్న 200 మందికి D లైమొనెన్ ఇంజెక్షన్లు ఇస్తే... 96 మందికి ఆ రాళ్లు పూర్తిగా మాయమయ్యాయి. ఇలాంటి చాలా ప్రయోజనాలున్నాయి. కాబట్టి... ఇకపై నిమ్మతొక్కల్ని పారేయకండి.

ఇలా చెయ్యండి :

- వాటిని ఎండబెట్టి పౌడర్ చేసి... కూరల్లో వేసుకోవచ్చు. మార్కెట్‌లో నిమ్మతొక్కల పౌడర్ కూడా దొరుకుతుంది. కానీ దాని కంటే ఇంట్లో స్వయంగా చేసుకునే పౌడరే ఎక్కువ ప్రభావం చూపిస్తుంది.

- నిమ్మతొక్కల్ని ఎండబెట్టలేకపోయినా... వాటిని చిన్న చిన్న ముక్కలుగా కోసి... రోజువారీ వంటల్లో వేసేసుకుంటే సరి. అలా కూడా అవి ఎంతో ప్రయోజనం కలిగిస్తాయి.

- గ్రీన్ టీలో కూడా నిమ్మ తొక్కలు వేసుకుంటే లాభమే.

- రకరకాల జ్యూస్‌లలో కూడా నిమ్మ తొక్కల్ని కొద్ది మొత్తంలో వేసుకొని తాగచ్చు.

- మార్కెట్లలో నిమ్మ తొక్కలు డ్రై అయినవి దొరుకుతాయి. అవి కొనుక్కొని కూడా వాడుకోవచ్చు.

- నిమ్మకాయల తొక్కలతో చట్నీ చేసుకొని... అప్పుడప్పుడూ తినవచ్చు.

First published:

Tags: Health benifits, Life Style, Tips For Women, Women health

ఉత్తమ కథలు