జీర్ణక్రియకు మేలు : బెల్లంలో తక్కువ క్యాలరీలు ఉంటాయి. దీని వల్ల మన శరీరంలోకి అధికంగా క్యాలరీలు చేరుతాయన్న బెంగ, అధిక బరువు పెరుగుతామన్న భయం ఉండవు. కొన్ని అనారోగ్య సమస్యల్ని తగ్గించడంలో బెల్లం అద్భుతంగా పనిచేస్తుందని పరిశోధనల్లో తేలింది. రోజూ రాత్రి పూట భోజనం చేశాక ఒక చిన్న బెల్లం ముక్కను తింటే మనకు చాలా లాభాలు కలుగుతాయి. జీర్ణక్రియ సులభంగా జరుగుతుంది. బెల్లంలో ఉండే ఔషధ గుణాలు జీర్ణాశయంలోని డైజెస్టివ్ ఎంజైమ్‌లను యాక్టివేట్ చేస్తాయి. మలబద్దకం, గ్యాస్, ఏసీడీటీ సమస్యలు కూడా ఉండవు. పొట్ట చల్లగా ఉండాలంటే బెల్లం షర్బత్ తాగాలని డాక్టర్లు సూచిస్తున్నారు. బెల్లం శ్వాసకోస సంబంధ సమస్యల్ని కూడా నయం చేస్తుంది. ఆస్తమా రోగులు బెల్లం, నువ్వులూ కలిపి తింటే చక్కటి ఫలితం కనిపిస్తుంది.
కాలేయాన్ని కాపాడుతుంది : బెల్లం మన శరీరంలోని లివర్‌కు ఎంతగానో మేలు చేస్తుంది. కాలేయాన్ని శుభ్ర పరుస్తుంది. రోజూ బెల్లం తింటే లివర్‌లో ఉండే హానికర వ్యర్థాలు, విష పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. లివర్ శుభ్రంగా ఉంటుంది. కాలేయ సంబంధ అనారోగ్యాలు రాకుండా ఉంటాయి.
శరీరం సమతుల్యం : బెల్లంలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల దీన్ని తింటే శరీరంలో ఎలక్ట్రోలైట్స్ సమతుల్యంలో ఉంటాయి. కండరాల నిర్మాణం సరవుతుంది. శరీర మెటబాలిజం క్రమపద్ధతిలో ఉంటుంది. ఒంట్లో అధికంగా ఉండే నీరు బయటకు వెళ్లిపోతుంది. అధిక బరువు తగ్గుతారు. గుండె జబ్బులు రాకుండా ఉంటాయి.
రక్తాన్ని శుద్ధి చేస్తుంది : బెల్లానికి ఉన్న మరో మంచి లక్షణం ఇది బ్లడ్ ప్యూరిఫైయర్‌లా పనిచేస్తుంది. దీన్ని తరచుగా కొద్ది మొత్తాల్లో తీసుకుంటూ ఉంటే, రక్తాన్నిశుద్ధి చేస్తుంది. శరీరాన్ని ఆరోగ్యంగా మార్చేస్తుంది. శరీరంలో హిమోగ్లోబిన్ పరిమాణాన్ని కూడా పెంచుతుంది. రక్త హీనతను తగ్గిస్తుంది. రక్తం పరిశుభ్రంగా ఉన్నప్పుడు చాలా రకాల వ్యాధులు శరీరానికి రావు.
అదుపులో బీపీ : బెల్లంలో పొటాషియం, సోడియం ఉంటాయి. ఇవి శరీరంలో యాసిడ్ లెవెల్స్‌ని క్రమపద్ధతిలో ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. వీటి ద్వారా బ్లడ్ ప్రెష్షర్ కంట్రోల్‌లో ఉంటుంది.
వ్యాధి నిరోధకతను పెంచుతుంది : బెల్లంలో యాంటీఆక్సిడెంట్స్, జింక్, సెలెనియం లాంటి ఖనిజాలుంటాయి. ఇవి సూక్ష్మక్రిముల ద్వారా శరీరానికి జరిగే హానిని అరికడతాయి. ఇన్ఫెక్షన్ల నుంచీ శరీరాన్ని కాపాడతాయి.
నొప్పుల నివారిణి : బెల్లంలో అధిక సంఖ్యలో ఉండే పోషకాలు... పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పులను దూరం చేస్తాయి. పీరియడ్స్ తర్వాత అనారోగ్య సమస్యలు రాకుండా ఉండేందుకు రోజూ కొద్ది మొత్తంలో బెల్లం తీసుకుంటే మంచిదే. బెల్లం నుంచీ విడుదలయ్యే ఎండోర్ఫిన్స్, శరీరానికి నొప్పుల నుంచీ ఉపశమనం కలిగిస్తాయి.
కీళ్లనొప్పుల నివారిణి : కీళ్ల నొప్పులు, మంటలతో బాధపడేవాళ్లు బెల్లం తినాలి. ఇది ఎంతో ఎక్కువ రిలీఫ్ కలిగిస్తుంది. అల్లంతో కలిపి తింటే ఇంకా ఎక్కువ ఉపశమనం కలుగుతుంది. రోజూ పాలలో బెల్లం కలుపుకుని తాగితే, ఎముకలు పుష్టిగా అవుతాయి. తద్వారా కీళ్ల నొప్పుల సమస్య తీరుతుంది.
పేగులకు బలం : బెల్లంలో ఎక్కువ పరమాణంలో ఉండే మెగ్నీషియం... పేగులకు బలాన్నిస్తుంది. 10 గ్రాముల బెల్లంలో 16 మిల్లీ గ్రాముల మెగ్నీషియం ఉంటుంది. మన శరీరానికి రోజూ 4 గ్రాముల మెగ్నీషియం అవసరం.
బరువు తగ్గాలంటే : బరువు తగ్గాలనుకునేవారికి బెల్లం అద్భుతమైన పరిష్కారం. ఇందులోని పొటాషియం మన శరీరంలోని ఎలక్ట్రోలైట్స్‌ని బ్యాలెన్స్ చేస్తుంది. కండరాల్ని ధృడంగాచేసి, మెటబాలిజంను పెంచుతుంది. తద్వారా శరీర బరువును క్రమబద్ధీకరిస్తుంది. కేజీల కొద్దీ బరువు తగ్గాలనుకునేవాళ్లు, తమ డైట్‌లో బెల్లాన్ని కూడా చేర్చుకుంటే మంచిదే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Health Tips, Tips For Women