హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

ఎండు ఖర్జూరాలను తేనెలో నానబెట్టి తింటే.... ప్రయోజనాలు ఇవీ...

ఎండు ఖర్జూరాలను తేనెలో నానబెట్టి తింటే.... ప్రయోజనాలు ఇవీ...

తేనె, ఎండు ఖర్జూరాల మిశ్రమంతో ఎన్నో ప్రయోజనాలు

తేనె, ఎండు ఖర్జూరాల మిశ్రమంతో ఎన్నో ప్రయోజనాలు

Honey and Dates : తేనె, ఖర్జూరాలు మనకు ఎంత మేలు చేస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ రోజుల్లో ఎన్నో అనారోగ్య సమస్యల్ని ఇవి తరిమికొడుతున్నాయి. వీటి కాంబినేషన్‌తో ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఓసారి తెలుసుకుందాం.

తేనెలో ఎండు ఖర్జూరాల్ని నానబెడితే : ఎండు ఖర్జూరాలు, పటికబెల్లాన్ని నీటిలో నానబెట్టి తింటే... చలవ చేసి... శరీరంలో వేడిని తగ్గిస్తాయని మనకు తెలుసు. అదే ఎండు ఖర్జూరాల్ని తేనెలో నానబెట్టి తినడం వల్ల మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఇందుకు కొన్ని పద్ధతులు పాటించాలి. ఓ చిన్న గిన్నెలో సగానికి పైగా తేనె పోసి... సీడ్ లెస్ ఎండు ఖర్జూరాల్ని వెయ్యాలి. వాటిని బాగా కలియబెట్టాలి. తర్వాత ఓ గాజు సీసా లేదా కంటైనర్ తీసుకొని... అందులో ఆ మిశ్రమాన్ని వెయ్యాలి. ఇంట్లో ఏదైనా ఎండ తగలని ప్రదేశంలో ఓ వారం పాటూ కదపకుండా ఉంచాలి. ఫ్రిడ్జ్‌లో ఉంచాల్సిన పనిలేదు. బయటే ఉంచొచ్చు.

వారం పాటూ తేనెలో నానడం వల్ల ఖర్జూరాలు చాలా మెత్తగా, మృదువుగా తయారవుతాయి. వారం తర్వాత రోజుకు ఒకటి, రెండు ఖర్జూరాలని తినొచ్చు. ఆల్రెడీ అవి తేనెను పీల్చేసుకుంటాయి కాబట్టి... అందులో తేనే పెద్దగా మిగలదు. తేనెను ప్రత్యేకంగా తీసుకోవాల్సిన పనిలేదు. ఖర్చూరాన్ని తింటే, దానిలోనే కావాల్సినంత తేనె కూడా ఉంటుంది.

ప్రయోజనాలు : ఖర్జూరాలకు మన శరీరంలో వేడిని తగ్గించే అద్భుత గుణాలున్నాయి. వీటికి తేనె కూడా తోడవడం వల్ల దగ్గు, జలుబు, పడిశం వంటివి త్వరగా నయం అవుతాయి. వీటికి రోగాల్ని తగ్గించే గుణం ఉండటం వల్ల... చాలా రకాల రోగాలు రాకుండా ఆగిపోతాయి. నిద్ర పట్టని వాళ్లు రాత్రివేళ ఈ మిశ్రమాన్ని తీసుకుంటే చాలు... చక్కటి నిద్ర పడుతుంది. ఈ మిశ్రమం ఎంత మంచిదంటే... దీన్లో చాలా యాంటీ బయోటిక్ గుణాలున్నాయి. ఇవి గాయాలు, వాపులు ఇతరత్రా అనారోగ్య సమస్యల్ని తగ్గిస్తాయి.

బ్రెయిన్ చురుగ్గా తయారై.. మెమొరీ పవర్ పెరుగుతుంది. ఎగ్జామ్స్ టైమ్‌లో ఈ తేనె, ఎండు ఖర్జూరాల జ్యూస్ తీసుకుంటే... ఏది చదివితే అది బుర్రకు ఎక్కేస్తుంది. ఎందుకంటే ఈ రెండింటిలో కాల్షియం, ఐరన్‌ ఎక్కువగా ఉంటాయి. ఇవి మన బ్రెయిన్‌కి చాలా అవసరం. ఇవి ఉంటే చాలు... బ్రెయిన్ సూపర్ పవర్ అయిపోతుంది. అంతేకాదు... మన దేశంలో చాలా మందికి బాడీలో సరపడా బ్లడ్ ఉండదు. వాళ్లు ఇలాంటి మిశ్రమాన్ని తీసుకుంటే... రక్త హీనత తగ్గుతుంది. కాల్షియం వల్ల ఎముకలు దృఢంగా మారతాయి. అంతే కాదు... షుగర్ లెవెల్స్ కంట్రోల్‌లో ఉండాలంటే ఈ జ్యూస్ కొద్ది మొత్తాల్లో తీసుకోవాల్సిందే.

మలబద్ధకంతో బాధపడే వారు వారంలో కనీసం మూడు రోజులైనా తేనె ఖర్జూరాల్ని తింటే సమస్య తొలగిపోతుంది. పేగుల్లో మంచి బ్యాక్టీరియా పెరిగి... అది ఆహారం చక్కగా జీర్ణం అయ్యేలా చేస్తుంది. గ్యాస్, ఏసీడీటీ సమస్యలు పరారవుతాయి. కడుపులో ఉండే చెడు క్రిములు చనిపోతాయి. ఇలా ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.


ఇవి కూడా చదవండి :

#HealthTips: కర్పూరంతో ఎన్ని సమస్యలు తగ్గుతాయో తెలుసా..

#Health Tips: పెసలు తింటే ఎన్ని లాభాలో చూడండి..

చుండ్రుని పోగొట్టి.. జుట్టు అందంగా మారాలంటే ఇలా చేయండి

First published:

Tags: Health Tips, Life Style, Tips For Women, Women health

ఉత్తమ కథలు