ఈ సీజన్‌లో సీతాఫలం తింటే ఎన్నో ప్రయోజనాలు

Health Tips: సీతాఫలంలో లభించే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కారకాలని దూరం చేస్తాయి. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపుతాయి.

news18-telugu
Updated: October 23, 2019, 12:46 PM IST
ఈ సీజన్‌లో సీతాఫలం తింటే ఎన్నో ప్రయోజనాలు
Health Tips : సీజనల్ ఫ్రూట్ సీతాఫలం తినండి... ఈ ప్రయోజనాలు పొందండి
  • Share this:
మరికొన్ని రోజుల్లో చలికాలం మొదలుకానుంది. వర్షాలతో ఇప్పటికే వాతావరణం కూడా చల్లగా మారింది. ఇక సీజన్‌కు అనుగుణంగా మనం కూడా మన ఆహారపు అలవాట్లు కూడా మార్చుకోవాలి. ముఖ్యంగా ఏయే సీజన్‌లలో దొరుకుతున్న పండ్లను మాత్రం తప్పనిసరిగా తినేయాలి. ఇక తాజాగా ఇప్పుడు మార్కెట్లో ఎక్కడ చూసినా సీతాఫలాలు కనిపిస్తున్నాయి. వ్యాపారులు ఎక్కడికక్కడ గుట్టగుట్టలుగా పోసి సీతాఫలాల్ని అమ్ముతున్నారు. ధరలు కూడా అంతా ఎక్కువగా లేకుండా కాస్త అందుబాటులోనే ఉన్నాయి.


వాతావరణం చల్లగా ఉంది కదా సీతాఫలం ఏం తింటాంలే అనిమాత్రం అనుకోకండి ఎందుకంటే ఈసీజన్‌లో దొరికే సీతాఫలం తింటే.. మనకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా ఈ పండు తినడం వల్ల విటమిన్, సీ, ఐరన్, ఫాస్పరస్, మెగ్నీషియం సమృద్ధిగా మనకు లభిస్తాయి. సీతాఫలం రక్తంలో గ్లూకోజ్ శాతాన్ని అదుపులో ఉంచుతుంది. యాంటీ బయోటిక్‌గా పనిచేస్తుంది. పండుని రోజూ తినడం వల్ల విటమిన్ ‘సీ’ శరీరానికి సమృద్దిగా లభిస్తుంది. ఇది రక్తంలోని ఇన్సులిన్ శాతాన్ని క్రమబద్ధీకరిస్తోంది. దీన్లో లభించే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కారకాలని దూరం చేస్తాయి. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపుతాయి. శరీరానికి అవసరమయ్యే ముఖ్యమైన విటమిన్లలో ఐరన్ ఒకటి. రక్తహీనత బారిన పడకుండా సీతాఫలం కాపాడుతుంది. కండరాలను ధృడంగా ఉంచే మెగ్నీషియం పోషకాన్ని అందిస్తుంది. సీతాఫలంలో ఉండే కాపర్ రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతుంది.

గర్భిణులకు ప్రతిరోజూ వెయ్యి మిల్లీ గ్రాముల కాపర్ అవసరం అవుతుంది. ఒక సీతాఫలం అంత కాపర్ లభిస్తుంది. ఇంకా దీనిలో లభించే డయిటరీ పీచు జీర్ణ వ్యవస్థ పనితీరు బాగుండేలా మాస్తుంది. ఈ పండులో కొవ్వూ కెలోరీలు కూడా తక్కువే. బరువు తగ్గాలనుకునేవారు. ఎంత ఎక్కువగా తింటే అంత మంచిది. దీన్లో విటమిన్ ఏ కూడా ఉంటుంది. అది కంటిచూపు బాగుండేందుకు తోడ్పుడుతంది. సీతాఫం శరీరానిక ిచలువ చేస్తుంది. దీంట్లోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఈ కాలంలో వేధించే సమస్యలతో పోరాడతాయి. ముఖ్యంగా అమ్మాయిల ఆరోగ్యానికి ఇది మంచి ఔషధం. ఏదైన ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్నప్పుడు వీటిని తింటే ఎంతో మేలు జరుగుతుంది. సీతాఫలానికి చలువ చేసే గుణం ఎక్కువ. పీచు పదార్థాలు ఎక్కువగా ఉండటంతో మలబద్ధకాన్ని నివారిస్తుంది. వీటిని తినడం వలన కడుపులో మంట తగ్గుతుంది. అజీర్తి సమస్యలు దూరం అవుతాయి.
Published by: Sulthana Begum Shaik
First published: October 23, 2019, 12:46 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading