హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

కొత్తిమీర పుదీనా జ్యూస్... వేసవిలో తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు...

కొత్తిమీర పుదీనా జ్యూస్... వేసవిలో తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు...

కొత్తిమీర, పుదీనా జ్యూస్ తాగితే ఆరోగ్యం.

కొత్తిమీర, పుదీనా జ్యూస్ తాగితే ఆరోగ్యం.

Health Benefits of Coriander Water: నాన్ వెజ్ వంటకాల్లో వాడే కొత్తిమీరతో ఇంకా చాలా ప్రయోజనాలున్నాయి. అవేంటో తెలుసుకుందాం.

అసలే తీవ్రమైన ఎండలు, వాటికి తోడు వేడి గాలులు... వడ దెబ్బ తగిలే అవకాశాలు సమ్మర్‌లో చాలా ఎక్కువ. వడ దెబ్బను చాలా మంది లైట్ తీసుకుంటారు గానీ, ఒక్కోసారి అదే ప్రాణం తీయగలదు కూడా. ఏటా వడ దెబ్బ తగిలి మన దేశంలో లక్ష మందికి పైగా చనిపోతున్నారని తెలుసా. ఆ చనిపోయే ప్రతి ఐదుగురిలో ఒకరు మన తెలుగు రాష్ట్రాల వారే ఉంటున్నారు. సో, వడ దెబ్బ తగలకుండా మనం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట. వడ దెబ్బ తగిలినప్పుడు సరైన చర్యలు తీసుకోకపోతే, మన శరీరంలో కీలక అవయవాలు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. 40 డిగ్రీల కంటే ఎక్కువ ఎండ ఉంటే, వడ దెబ్బ తగిలే ప్రమాదం ఉంటుంది.

వడ దెబ్బకు చెక్ పెట్టేదెలా : ఎండా కాలంలో మనం ఎండ నుంచీ తప్పించుకోలేం. ఏదో ఒక పనిపై ఇంట్లోంచీ బయటకు వెళ్లక తప్పదు. అలాంటప్పుడు మనం కంటిన్యూగా వాటర్ తాగుతూ ఉండాలి. మన శరీరంలో నీటి శాతం తగ్గకుండా (Dehydration) జాగ్రత్త పడాలి. ఐతే, కేవలం వాటరే తాగితే సరిపోదు. బాడీలో సాల్ట్, షుగర్ లెవెల్స్ తగ్గిపోతూ ఉంటాయి. వాటిని కూడా కవర్ చేసేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇందుకోసం కొత్తిమీర (Coriander), పుదీనా (Mint) ఆకులు చక్కగా పనిచేస్తాయి.

కొత్తిమీర, పుదీనా ఆకులకు మన శరీరాన్ని చల్లబరిచే గుణం ఉంది అని ఆయుర్వేదంలో రాసివుంది. అందువల్ల కొత్తిమీర, పుదీనా నీటిని కాస్త చక్కెర (షుగర్) కలిపి తాగితే వడ దెబ్బ నుంచీ తప్పించుకోవచ్చు. ఇందుకోసం కొన్ని కొత్తిమీర, పుదీనా ఆకులను తీసుకోవాలి. కేవలం కొత్తిమీర ఆకులే తీసుకున్నా పర్వాలేదు. ఓ గ్లాసు నీరు, 3 స్పూన్ల చక్కెర తీసుకోవాలి.

కొత్తిమీర, పుదీనా నీరు తయారీ :

* గ్లాసు నీటిలో ఆకులను (కొత్తిమీర, పుదీనా) వెయ్యాలి.

* మిక్సీలో వేసి జ్యూ్స్ వాటర్‌లా చేసుకోవాలి.

* జ్యూస్ వాటర్‌ను గ్లాసులో పోసి, చక్కెర కలపాలి.

* జ్యూస్ వాటర్‌ని డైరెక్టుగా గానీ, ఫ్రిడ్జ్‌లో ఉంచి, కూలింగ్ అయ్యాక గానీ తాగవచ్చు.

* ఈ జ్యూస్‌లో కాస్త నిమ్మరసం కూడా కలుపుకొని తాగవచ్చు.

ఇవి కూడా చదవండి :

సమ్మర్‌లో బీట్ రూట్ జ్యూస్ తాగుతున్నారా... ఈ అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతం...

కొబ్బరి నీళ్లతో 20 రకాల ప్రయోజనాలు... తాగితే రోగాలు దరిచేరవు

లవంగాలు మనకు ఎంత మేలు చేస్తున్నాయో తెలుసా... ఎన్ని ప్రయోజనాలో... రోజూ తినాల్సిందే.

పుచ్చకాయ కొయ్యకుండానే ఎర్రగా ఉందో లేదో గుర్తించడం ఎలా... ఇలా...

రోజూ కనీసం గ్లాస్ కొత్తిమీర నీరు తాగితే... వడ దెబ్బ తగలదు. ఎండ నుంచీ ఎదురయ్యే చాలా సమస్యలు తగ్గుతాయి. ఈ నీరు వికారం, వామ్టింగ్ వస్తున్నట్లు అనిపించే లక్షణాన్ని కూడా తగ్గించగలదని పరిశోధనల్లో తేలింది.

First published:

Tags: Health, Health Tips, Tips For Women, Women health

ఉత్తమ కథలు