కొబ్బరి నీళ్లతో 20 రకాల ప్రయోజనాలు... తాగితే రోగాలు దరిచేరవు

Coconut Water : కొబ్బరి బోండాల రేటు ప్రతీ సంవత్సరం పెరుగుతూనే ఉంది. కారణం వాటి వల్ల కలిగే అనేక ప్రయోజనాలే. అవేంటో చకచకా తెలుసుకుందాం.

news18-telugu
Updated: April 19, 2019, 5:59 PM IST
కొబ్బరి నీళ్లతో 20 రకాల ప్రయోజనాలు... తాగితే రోగాలు దరిచేరవు
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: April 19, 2019, 5:59 PM IST
కూల్ డ్రింగ్స్, మద్యం తాగే బదులు కొబ్బరి నీళ్లు తాగితే... ఆరోగ్యమే ఆరోగ్యం. ఇవి గుండెను కాపాడేస్తాయి. బాడీలో హీట్ తగ్గిస్తాయి. దాహం సమస్యను చెక్ పెడతాయి. ఈ నీళ్లు ఎన్ని తాగినా శరీరంలో కొవ్వు పెద్దగా ఏర్పడదు. అందుకే అంటారు ఒక కొబ్బరిబోండాం, ఒక సెలైన్ బాటిల్‌తో సమానం అని. రెండో ప్రపంచ యుద్ధంలో సెలైన్ కొరత రావడంతో గాయపడినవారికి కొబ్బరి బోండాలనే ఇచ్చారు. లేత కొబ్బరి బొండాల్లో 90 నుంచి 95 శాతం నీరు, 24 కేలరీల శక్తి ఉంటుంది. 100 గ్రాముల కొబ్బరి నీటి నుంచి 17.4 క్యాలరీల ఎనర్జీ లభిస్తుంది. అండమాన్ నికోబార్ దీవుల్లో వందేళ్ల కిందటి వరకూ డబ్బు బదులు కొబ్బరి బోండాలు ఇచ్చుకునేవాళ్లు. మాల్దీవుల జాతీయ వృక్షం కొబ్బరి చెట్టు. ఎన్నో ప్రయోజనాలు ఉండబట్టే... సెప్టెంబర్‌ 2ను ప్రపంచ కొబ్బరి దినోత్సవం (World Coconut Day)గా ప్రకటించారు.

health benefits, health tips, coconut water, benefits of coconut water, heart protection, health tips for men, health tips for women, health benefits, కొబ్బరి నీళ్లు, ఆరోగ్య ప్రయోజనాలు
ప్రతీకాత్మక చిత్రం


* షుగర్ (డయాబెటిస్) ఉన్నవారు కొబ్బరి నీళ్లు తాగితే... షుగర్ లెవెల్స్‌ని తగ్గిస్తాయి. ఇన్సులిన్‌లో వేగం పెరుగుతుంది. ఈ నీటిలోని మెగ్నీషియం టైప్ 2 డయాబెటిస్, ప్రీ-డయాబెటిస్ ఉన్నవారికి ఎంతో మేలుచేస్తుంది.

* గుండె జబ్బులకు కొబ్బరి నీళ్లు చెక్ పెడతాయి. వీలైనప్పుడల్లా ఓ బోండాం ఎత్తేయాలి. అప్పుడు హార్ట్ హ్యాపీగా ఉంటుంది.


* కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా చెయ్యడానికి కొబ్బరి నీళ్లు సరైన ఆప్షన్. మంచినీళ్ల కంటే ఇవి బాగా పనిచేస్తాయి.
* కొబ్బరి నీళ్లలో ఫైబర్ (పీచు పదార్థం), విటమిన్ సి, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. నీరసంగా ఉండేవారు కొబ్బరి బోండాలు తాగితే సరి.
* సూక్ష్మక్రిములు, విష వ్యర్థాల నుంచీ కొబ్బరి నీళ్లు మనల్ని కాపాడతాయి. బీపీని కంట్రోల్‌లో ఉంచుతాయి.
Loading...
* ఎక్సర్‌సైజ్ చేశాక కొబ్బరినీళ్లు తాగాలి. అప్పుడు బాడీలో నీరసాన్ని ఈ వాటర్ తగ్గిస్తాయి.
* తల తిరగడం, కడుపులో గడబిడ వంటి వాటిని తరిమికొట్టడంలో కొబ్బరి నీళ్లకు తిరుగులేదు.

health benefits, health tips, coconut water, benefits of coconut water, heart protection, health tips for men, health tips for women, health benefits, కొబ్బరి నీళ్లు, ఆరోగ్య ప్రయోజనాలు
ప్రతీకాత్మక చిత్రం


చూశారా ఎన్ని ప్రయోజనాలున్నాయో. అందుకే రోజూ కాకపోయినా కనీసం అప్పుడప్పుడూ అయినా కొబ్బరి నీళ్లు తాగేస్తే సరి. ఆరోగ్యం సంగతి అవి చూసుకుంటాయి.

 

Video: అటు అందం..అటు ఆందోళన...చైనాను వణికిస్తున్న మంచు
First published: April 19, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...