యాలకులు రేటెక్కువే. అందుకు తగ్గట్టే అవి సువాసన, రుచి మాత్రమే కాదు... ఇంకా చాలా ప్రయోజనాలు కలిగిస్తున్నాయి. కొన్ని రకాల టీలు, వంటల్లో యాలకుల పొడిని వేస్తుంటారు. ఐతే... యాలకులు శృంగారపరమైన సమస్యలకు చెక్ పెట్టగలవని పరిశోధనల్లో తేలింది. ఈ రోజుల్లో టెన్షన్లు, బిజీ లైఫ్ స్టైల్, రెడీ టూ ఈట్ ఆహారపు అలవాట్ల వల్ల ప్రజల్లో సహజ సిద్ధంగా ఉండే శృంగార సామర్ధ్యం తగ్గిపోతోంది. సెక్స్ పరమైన సమస్యలు ఎక్కువవుతున్నాయి. ముఖ్యంగా పిల్లలు పుట్టకపోవడమన్నది ఎక్కువ మందిలో కనిపిస్తోంది. ఇందుకు కారణాలేమైనా... సమస్యల్ని పరిష్కరించుకోవడానికి యాలకుల వంటి సుగంధ ద్రవ్యాలు కొంతవరకూ ఉపయోగపడుతున్నాయి.
టెన్షన్ తగ్గిస్తాయి : యాలకులు మూడ్‌ని పెంచుతాయి. వాటి సువాసన ఒత్తిడిని దూరం చేస్తుంది. శృంగార జీవితంలో సమస్యలు ఉన్నవారు యాలకులు ఎక్కువగా తీసుకోవాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
వీర్య కణాల వృద్ధి : చాలా మందికి పిల్లలు పుట్టకపోవడానికి ప్రధాన కారణం స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉండటమే. రోజుకు 1 నుంచీ 2 యాలకులు తీసుకుంటే (ఏదో ఒక రూపంలో) వీర్య కణాలు వృద్ధి చెందుతాయి. నపుంసకత్వం లాంటి లైంగిక సమస్యలు దూరమవుతాయి.
శీఘ్ర స్ఖలనానికి చెక్ : సంభోగంలో ఎక్కువసేపు పాల్గొనే శక్తిని రెట్టింపు చెయ్యగలవు యాలకులు. అందువల్ల దంపతులకు యాలకులు ఎంతో మేలు చేస్తున్నట్లే.
చర్మ సౌందర్యానికి : చర్మంపై ఎర్పడే నల్ల మచ్చల్ని యాలకులు తగ్గిస్తాయి.
జుట్టుకు మేలు : వెంట్రుకలు చిట్లిపోవడం, ఊడిపోవడం వంటి సమస్యలకు యాలకులు చెక్ పెడతాయి. జుట్టు ఒత్తుగా, బలంగా, కుదుళ్లు గట్టిగా ఉండేందుకు ఇవి దోహదపడతాయి.
అధిక బరువు తగ్గాలంటే : యాలకులు అధిక బరువును తగ్గిస్తాయి కూడా. యాలకుల్లోని వేడి మన శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను కరిగిస్తుంది. ఇందుకోసం రోజూ రాత్రి వేళ ఓ యాలుకను తినేయాలి. బరువు తగ్గడమే కాదు... శరీరంలో వ్యర్థాలు, హానికారక బ్యాక్టీరియా వంటి వాటిని యాలకులు తరిమేస్తాయి.
మలబద్దకం నివారణ : ఈ రోజుల్లో ఎక్కువ మందికి ఎదుర్కొంటున్న మరో సమస్య మలబద్ధకం. యాలకులను టీలలో గానీ, ఇతరత్రా ఏ రూపంలో తీసుకున్నా... అవి జీర్ణ వ్యవస్థను మెరుగు పరుస్తాయి. మలబద్ధకాన్ని తగ్గిస్తాయి.
ఇంకా ఇవి గ్యాస్ సమస్యను పోగొడతాయి. చక్కటి నిద్ర వచ్చేలా చేస్తాయి. ఎముకల్ని గట్టి పరుస్తాయి. ఇలా చాలా లాభాలున్నాయి. అందువల్ల యాలకులను రెగ్యులర్‌గా వాడాలని సూచిస్తున్నారు ఆయుర్వేద నిపుణులు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Health Tips, Life Style, Tips For Women, Women health