Health : గుండెను కాపాడే చేమదుంపలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

చాలా తక్కువ మంది వండుకునే చేమదుంపల్లో ఎన్ని పోషకాలున్నాయో తెలిస్తే ఆశ్చర్యం కలగకమానదు.

Krishna Kumar N | news18-telugu
Updated: January 18, 2020, 6:06 AM IST
Health : గుండెను కాపాడే చేమదుంపలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు
చేమదుంపలతో ప్రయోజనాలు
  • Share this:
దుంపల్లో కొన్నింటిని పచ్చిగానే తినొచ్చు... కొన్నింటిని వండుకొని తినగలం. చేమ దుంపల్ని వండుకొని మాత్రమే తినగలం. ఇవి జిగురుగా ఉంటాయని చాలా మంది వీటిని తినేందుకు ఇష్టపడరు. నిజానికి వీటిలో చాలా పోషకాలు ఉంటాయి. చేమ దుంపల్ని ఉడికించి, వేయించి, కాల్చుకుని తినొచ్చు. మాంసానికి బదులుగా వీటిని తింటారని తెలుసా. మంచి రుచినీ, పోషకాలనీ ఇవి ఇస్తాయి. 100 గ్రాముల చేమదుంపల్లో దాదాపు 120 కేలరీల శక్తి ఉంటుంది. వీటిలో ఎక్కువ కాంప్లెక్స్‌ కార్బోహైడ్రేట్స్‌ దొరుకుతాయి. పీచు పదార్థాన్ని నెమ్మదిగా జీర్ణం చేస్తూ రక్తప్రసరణలోకి గ్లూకోజ్‌ను స్థిరంగా విడుదల చేస్తాయి. అందువల్ల షుగర్ లెవెల్స్ సడెన్‌గా పెరగవు. పైగా వీటివల్ల బాడీలో ఎనర్జీ ఎక్కువసేపు ఉంటుంది.

health, healthy, maca root benefits, health tips, skin health, cama beet benefits, health secrets, health tips for women, how to save hearth, how to reduce over weight, how to get good digestion, చేమ దుంపలు, చామ దుంపలు
ప్రతీకాత్మక చిత్రం


గుండెను కాపాడతాయి : చేమదుంపలు బరువు తగ్గడానికి ఉపయోగపడతాయి. మిగతా దుంపల లాగే వీటిలో కూడా పిండి పదార్థాలు ఎక్కువే. ఐతే ఇవి గుండెకు చాలా మంచివి. వీటిలోని పీచు, యాంటీ ఆక్సిడెంట్ల కాంబినేషన్‌ ధమనులలో కొవ్వు నిల్వ ఉండకుండా చేస్తుంది. అరుదుగా లభించే విటమిన్‌ బి-6 చేమ దుంపలు తింటే వస్తుంది. గుండెజబ్బులకు, హైపర్‌ టెన్షన్‌కు కారణమయ్యే బ్లడ్‌ హోమోసిస్టిన్‌ స్థాయిలను తగ్గించడానికి అవసరమైన 'ఇ' విటమిన్‌ను ఈ దుంపలు అందిస్తాయి. బీపీని సెట్ చేసే పొటాషియం వీటిలో పుష్కలంగా ఉంటుంది. అంతేకాదు వీటిలో ఉండే డియోస్కోరిన్‌ అనే ప్రోటీన్‌ గుండె జబ్బులూ, హార్ట్ ఎటాక్ రాకుండా కాపాడుతుంది.

జీర్ణం సంపూర్ణం : చేమ దుంపలు జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తాయి. వీటిలోని డైటరీ ఫైబర్‌ మలబద్ధకాన్ని తగ్గించి, విష పదార్థాలు పేరుకుపోకుండా కాపాడుతుంది. కొలన్‌ క్యాన్సర్‌, ఇర్రిటబుల్‌ బవెల్‌ సిండ్రోమ్‌ల నుంచి చాలా వరకు ఉపశమనం లభిస్తుంది.health, healthy, maca root benefits, health tips, skin health, cama beet benefits, health secrets, health tips for women, how to save hearth, how to reduce over weight, how to get good digestion, చేమ దుంపలు, చామ దుంపలు
ప్రతీకాత్మక చిత్రం


మెనోపాజ్‌ సమస్యలకు చెక్ : చామ దుంపల వల్ల మహిళల ఎండోక్రైన్‌ వ్యవస్థ చక్కగా పనిచేస్తుంది. మెనోపాజ్‌ తర్వాత ఈ దుంపలు మంచి ప్రభావం చూపిస్తాయి. రాత్రివేళ చెమట, తడి ఆరటం, హాట్‌ ప్లషెస్‌ వంటి లక్షణాలు చేమదుంపల వల్ల తగ్గుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. హార్మోన్‌ రిప్లేస్‌మెంట్‌ థెరపీకి ఇవి ప్రత్యామ్నాయం. డియోజెనిన్‌ అనే కెమికల్‌లో ఉండే యాంటీ-ఇన్‌ప్లమేటరీ, యాంటీ-స్పాజ్మాడిక్‌, యాంటీ-ఆక్సిడెంట్‌ గుణాలు ఈ దుంపల్లో లభిస్తాయి. ఋతుసంబంధిత క్రాంప్స్‌, ఆర్థరైటిస్‌ నొప్పులు, కండరాల అలసట తగ్గించడానికి, ఉత్తమ నెర్వట్రాన్స్‌మిషన్‌కు సహకరిస్తాయి. గర్భిణీలకు నీరు పట్టడం, ఉదయం వేళ వికారం వంటి లక్షణాలను చామదుంపలు తగ్గిస్తాయి.

ఇన్ని ప్రయోజనాలున్న చేమ దుంపల్ని మనం తినాల్సిందే. ఈసారి కూరగాయల మార్కెట్‌కి వెళ్లినప్పుడు... వీటిని కూడా మీ లిస్టులో పెట్టుకోండి మరి. 

ఇవి కూడా చదవండి :

వంటింట్లో ఆ రంగు ఉంటే బొద్దింకలకు పండగే... ఇలా వాటికి చెక్ పెట్టండి

ఇంటికి ఎలాంటి కలర్స్ వేస్తే మంచిది... కలర్స్ ప్రభావం మనపై ఎలా ఉంటుంది?

పుచ్చకాయ కొయ్యకుండానే ఎర్రగా ఉందో లేదో గుర్తించడం ఎలా... ఇలా...
First published: January 18, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు