Health Tips : పట్టులాంటి జుట్టు కావాలా... ఉల్లిపాయలతో ఇలా చెయ్యండి

Health Benefits of Onions for Hair : జుట్టును కాపాడుకునేందుకు రకరకాల షాంపూలు, నూనెలూ వాడుతున్నారా? అయినప్పటికీ జుట్టు రాలిపోతూనే ఉంటే... మీరు మీ జుట్టుకి ఉల్లిపాయల్ని ప్రయోగించాల్సిందే. అదెలాగో తెలుసుకుందాం.

news18-telugu
Updated: September 20, 2020, 7:11 AM IST
Health Tips : పట్టులాంటి జుట్టు కావాలా... ఉల్లిపాయలతో ఇలా చెయ్యండి
పట్టులాంటి జుట్టు కావాలా... ఉల్లిపాయలతో ఇలా చెయ్యండి
  • Share this:
Health Benefits of Onions for Hair : ఉల్లిపాయలు కంటనీరు తెప్పిస్తాయేగానీ... వాటి మనసు అమ్మ మనసు లాంటిదే. వాటిలో బ్యాక్టీరియా, ఫంగస్‌లను తరిమికొట్టే గుణాలు చాలా ఉన్నాయి. జుట్టు ఊడిపోయేవారికి ఉల్లిపాయలు దివ్యౌషధం. ఎందుకంటే అవి మన జుట్టు కుదుళ్లను ఒత్తుగు, బలంగా అయ్యేలా చేస్తాయి. చుండ్రుకు చెక్ పెడతాయి. ఉల్లిలో ఉండే సల్ఫర్... జుట్టు చిట్లిపోవడాన్నీ, సన్నగా అయిపోవడాన్నీ అడ్డుకుంటుంది. ఎక్కువగా జుట్టు రాలిపోతున్నవారు ఉల్లిపాయలతో అద్భుత ప్రయోజనాన్ని పొందగలరు. జుట్టు తెల్లగా అయిపోతుంటే... వెంటనే ఉల్లిపాయల్ని ప్రయోగించడం మేలు. ఎందుకంటే వెంట్రుకల గొట్టాల్లో ఉండే మెలనిన్‌ను (ఈ మెలనిన్ లేకపోతే వెంట్రుకలు తెల్లగా కనిపిస్తాయి) తిరిగి నింపడంలో ఉల్లిపాయలు ది బెస్ట్. జుట్టులో పేలను తరిమికొట్టే సహజ లక్షణాలు కూడా ఉల్లికి ఉన్నాయి. ఉల్లికి రక్త ప్రసరణను మెరుగు పరిచే గుణాలున్నాయి. ఇది కూడా జుట్టు పెరుగుదలకు మేలు చేస్తుంది. కాబట్టి... ఆందోళనలూ, టెన్షన్లూ అన్నీ పక్కన పెట్టి... ఉల్లిపాయల్ని తెచ్చుకోండి.

ఉల్లిపాయలతో ఇలా చెయ్యండి :

- రెండు చిన్న ఉల్లిపాయలు తీసుకోండి.
- ఉల్లిపాయల తొక్కలు తీసి... వాటిని నాలుగు భాగాలుగా కోయండి.
- జ్యూసర్ లేదా గ్రైండర్‌లో వాటిని గుజ్జుగా చెయ్యండి.
- కొద్దిగా నీరు పొయ్యండి. ఇప్పుడు గుజ్జును బాగా కలిపి... ఫిల్టర్ చెయ్యండి. (ఓ గుడ్డలో గుజ్జును వేసి, పిండితే సరి)
- ఇప్పుడు చక్కటి ఆనియన్ జ్యూస్ (రసం) వచ్చినట్లే.- ఆ రసాన్ని జుట్టుకి బాగా పట్టించండి.
- మీ చేతి వేళ్లతో... మెల్లగా, స్మూత్‌గా మసాజ్ చెయ్యండి. అన్ని వెంట్రుకలకూ ఆ రసం చేరాలి.
- ఓ గంట పాడూ ప్రశాంతంగా కూర్చోండి.
- ఇప్పుడు తేలికపాటి (అంతగా పవర్‌ఫుల్ కాని, ఎక్కువ కెమికల్స్ లేని) షాంపూతో... జుట్టును స్లోగా కడిగేయండి.
- ఇలా చెయ్యకపోతే, ఉల్లిపాయల వాసన అలాగే ఉంటుంది. అందువల్ల మంచి స్మెల్ ఉండే షాంపూ వాడాలి.
- ఇలా మీరు వారానికి ఓసారి చెయ్యాలి. ఇలా రెండు నెలలు చేసి చూడండి. మీకే డిఫరెన్స్ కనిపిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.


Pics : బెంగాలీ రసగుల్ల నైనా గంగూలీ అందాలు అదరహో... 


ఇవి కూడా చదవండి :

Health Tips : ఎంతకీ చుండ్రు తగ్గట్లేదా? ఇలా చెయ్యండి చాలు


Health Tips : చక్కటి ఆరోగ్యానికి 5 సూత్రాలు... పాటిస్తే ఎంతో మేలు


Health Tips : టమాటాలతో 10 అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు...


Health Tips : పార్కులో 20 నిమిషాలు నడవండి... ఎంతో ఆరోగ్యం

Published by: Krishna Kumar N
First published: September 20, 2020, 7:10 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading