సెక్స్‌ను ఎక్కువగా కోరుకునేది.. ఆడవారా? మగవారా?

స్త్రీ, పురుషులిద్దరిలో ఎవరికి కోరికలు ఎక్కువగా ఉంటాయి? పురుషులు పెత్తనం చెలాయించినంత మాత్రానా కామవాంఛ ఎక్కువ ఉంటుందని అనుకోవచ్చా? అని పరిశోధకులు ఆరా తీయగా పలు ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి.

news18-telugu
Updated: September 6, 2019, 2:39 PM IST
సెక్స్‌ను ఎక్కువగా కోరుకునేది.. ఆడవారా? మగవారా?
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
సెక్స్‌లో పురుషులదే పెత్తనం అవడం వల్ల వారే ఎక్కువ సెక్స్ చేస్తారని, వారిలోనే కామవాంఛ ఎక్కువగా ఉంటుందని అనుకుంటూ ఉంటాం. మరి ఇద్దరిలో ఎవరికి కోరికలు ఎక్కువగా ఉంటాయి? పెత్తనం చెలాయించినంత మాత్రానా కామవాంఛ ఎక్కువ ఉంటుందని అనుకోవచ్చా? అని పరిశోధకులు ఆరా తీయగా పలు ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. దాదాపు 4వేల మంది బ్రిటిషర్లను పరిశోధకులు ప్రశ్నించగా మహిళల కంటే పురుషులకే సెక్స్ ఎక్కువ అవసరం అని 32 శాతం మంది చెప్పారట. పురుషులే ఎక్కువగా సెక్స్ కోరుకుంటారని 42 శాతం మంది స్పష్టం చేశారట. ఇదిలా ఉండగా.. 54 శాతం మాత్రం ఇద్దరికీ సెక్స్ అవసరం అని అభ్రిపాయపడ్డారు. ఇద్దరూ సెక్స్ కోరుకుంటారని 45 శాతం మంది వెల్లడించారు. స్త్రీ, పురుషులు సమానంగా సెక్స్ ఎంజాయ్ చేయాలని 73 శాతం మంది తెలపడం గమనార్హం.

పడకగది విషయానికి వచ్చే సరికి సహజంగానే లింగ అసమానత్వం ఉంటుందని, దాన్ని తగ్గించుకొని.. భాగస్వాములిద్దరూ సెక్సువల్ రిలేషన్‌షిప్‌ను ఎంజాయ్ చేయాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఇక్కడ.. మహిళల భావప్రాప్తి అనేది చాలా ముఖ్యమని.. మహిళలు సెక్స్‌ను కోరుకున్నట్లుగానే దాన్ని అనుభవించడం, అనుభవించేలా చేయడం అనే అంశాలు కీలకమైనవని స్పష్టం చేస్తున్నారు.

First published: September 6, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>